Chanakya Niti: జీవితంలో విద్యార్థి దశ ముఖ్యమైనది. అందుకే మొక్కై వంగనిది మానై వంగుతుందా అన్నారు. మన అలవాట్లు ఇక్కడే రూపుదిద్దుకుంటాయి. జీవితానికి మార్గనిర్దేశం చేస్తాయి. విద్యార్థి దశలో నేర్చుకున్న వాటినే మనం అమలు చేస్తుంటాం. దీనికి చాణక్యుడి తన నీతి శాస్త్రంలో కొన్ని నియమ నిబంధనలు సూచించాడు. చాణక్యుడు చెప్పిన విధానాలు విద్యార్థులు జీవితంలో ఎదగడానికి ఎంతగానే ఉపయోగపడతాయి. ఇప్పటికి కూడా చాణక్యుడి రాజనీతి శాస్త్రాన్నే ప్రామాణికంగా తీసుకుంటున్నారంటే దాని ప్రాధాన్యత ఎంత ఉందో తెలుస్తోంది.

జీవితంలో విద్యార్థి మంచి మార్గంలో నడవాలంటే ఉండాల్సిన లక్షణాలు కొన్నింటిని చాణక్యుడు బోధించాడు. వాటి ప్రకారం నడుచుకుంటే విద్యార్థి తన మనుగడను సక్రమంగా సాగించేందుకు వీలవుతుంది. భవిష్యత్ బాగా ముందుకు పోతుుంది. అందుకే జీవితంలో మొట్టమొదటి లక్షణంగా క్రమశిక్షణ ఉండాలని సూచిస్తున్నాడు. విద్యార్థికి ఉండాల్సిన ప్రథమ లక్షణాల్లో క్రమశిక్షణే ముఖ్యమైనది.
విద్యార్థికి ఎట్టి పరిస్థితుల్లో కూడా సోమరితనం ఉండకూడదు. బద్దకం ఉంటే విద్యార్థి దేన్ని కూడా సాధించలేడు. సోమరితనం లేని విద్యార్థి ప్రతి పనిలో ముందుంటాడు. విద్యార్థి జీవితంలో సోమరితనం దరి చేరకూడదు. విద్యార్థి సోమరితనం దరిచేరితే దేన్ని కూడా సాధించడం కష్టమే. అందుకే బద్దకం వీడి తన పనులు తాను చేసుకునేందుకు ప్రయత్నించాలి.
విద్యార్థికి ఉండకూడని మరో లక్షణం దురాశ. ఇది ఉంటే బతుకు అనర్థమే. విద్యార్థి జీవితానికి ప్రధాన అవరోధంగా ఇది ప్రధానమైనది. విద్యార్థి కొత్త విషయాలు తెలుసుకునేందుకు ముందుకు వెళ్లాలే కానీ అత్యాశతో ఉంటే చదువు ముందుకు సాగదు. విద్యార్థికి ఉండాల్సిన మరో ఆభరణం గౌరవం. తల్లిదండ్రులు, గురువులు, పెద్దవారి పట్ల విద్యార్థి గౌరవంగా ఉంటేనే మంచి వాడుగా పేరు వస్తుంది. అంతేకాని ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తే చెడ్డ పేరే వస్తుంది.

అందుకే విద్యార్థులు పై లక్షణాలు పుణికిపుచ్చుకుని జీవితంలో ఎదిగేందుకు జాగ్రత్తగా ఉండాల్సిందే. మంచి గుణాలు ఉన్న వారికి మంచి పేరు వస్తుంది. ఫలితంగా జీవితంలో మంచి విలువలతో ఉన్నత స్థానానికి ఎదగొచ్చు. అందరి మన్ననలు పొందవచ్చు. విద్యార్థి తన గమ్యాన్ని మంచి మార్గంలో నడుచుకుని మంచివాడుగా ఎదగాలి. అప్పుడే జీవిత లక్ష్యం నెరవేరుతుంది.
Also Read:Break Bad Habits: దరిద్రమైన అలవాట్లను దూరం చేసుకోకపోతే అంతే?