Chanakya Niti Success: మనిషి జీవితంలో ప్రతికూలతలు, అనుకూలతలు సాధారణమే. ప్రతి వ్యక్తి జీవితంలో కష్టాలు ఎదుర్కోవడం సహజం. అలాంటి సమయంలోనే మనసు నిబ్బరం చేసుకోవాలి. లేకపోతే ఇబ్బందులు వస్తాయి. అలాంటి పరిస్థితులను తట్టుకునే శక్తి సామర్థ్యాలు మనమే సమకూర్చుకోవాలి. దీని కోసం ఆచార్య చాణక్యుడు మనకు చాలా మార్గాలు సూచించాడు. వాటిని గమనించుకుని నడుచుకుంటే మన కష్టాలు దూరం కావడం ఖాయం.
వైఫల్యం
జీవితంలో ఎదురయ్యే వైఫల్యాల నుంచి గుణపాఠం నేర్చుకోవాలి. దీంతో విజయానికి బాటలు వేసుకోవచ్చు. అపజయం నుంచి విజయానికి మార్గం ఉంటుంది. తప్పు ఎక్కడ జరిగిందో ఆలోచించుకోవాలి. వైఫల్యం విజయానికి మెట్టుగా భావించుకోవాలి. నిరాశ దరిచేరకుండా చూసుకుని మన పనులు సులభంగా చేసుకునేందుకు సిద్ధం కావాలి.
వ్యూహాలు
మన పనులు చేసుకునేందుకు వ్యూహాలు కావాలి. చేసే పనుల్లో ఆటంకాలు లేకుండా చేసుకునేందుకు పక్కా వ్యూహంతో ముందుకెళ్లాలి. అప్పుడే మనకు విజయం లభిస్తుంది. నిర్లక్ష్యంతో ఉంటే నష్టమే కలుగుతుంది. ఏ పని చేయాలన్నా పరిస్థితులను అనుకూలంగా మలుచుకోవాలి. మన విధానాలను సక్రమంగా ఉంచుకోవాలి.
ప్రశాంతత
కష్టకాలంలో కూడా ప్రశాంతంగా ఉండాలి. మనం చేసుకునే పనుల్లో అనవసరంగా హడావిడి చేస్తే ఒత్తిడి కలుగుతుంది. సానుకూల ఫలితాలు రావాలంటే మన సామర్థ్యం పెరగాలి. అప్పుడే మనం అనుకున్న పనులు త్వరగా పూర్తవుతాయి. ప్రశాంతంగా ఆలోచిస్తేనే పనులు సజావుగా సాగుతాయి. దీని కోసం మనం అహర్నిశలు ఆందోళన పడటంతో ఇబ్బందులు పెరుగుతాయి.
ప్రణాళిక
మనం చేసే పని పూర్తి కావాలంటే ప్రణాళిక ఉండాలి. చిన్న పనైనా పెద్ద పని అయినా దానికి ప్లాన్ ఉండటంతోనే మన పనులు ముందుకు సాగుతాయి. చేసే పనిలో ఏకాగ్రత ఉండాలి. సమస్య పరిష్కరించడానికి కావాల్సిన వాటిని తయారుగా ఉంచుకోవాలి. అప్పుడే మన పని సులభం అవుతుంది. దీనికి ఆచార్య చాణక్యుడు సూచించిన ఈ మార్గాలు పాటించి విజయం సాధించుకోవాలి.