Lakshmi Manchu: మంచు లక్ష్మికి కాలం కలిసి రాలేదు. స్టార్ హీరోయిన్ అవ్వాలన్న కోరిక తీరలేదు. అమెరికాలో మంచు లక్ష్మి కెరీర్ మొదలైంది. అక్కడ ఇంగ్లీష్ టాక్ షోలకు మంచు లక్ష్మి హోస్ట్ గా చేసింది. అలాగే ఒకటి రెండు హాలీవుడ్ చిత్రాల్లో నటించింది. అనంతరం టాలీవుడ్ కి షిఫ్ట్ అయ్యింది. అనూహ్యంగా అనగనగా ఓ ధీరుడు మూవీలో నెగిటివ్ రోల్ చేసింది. సిద్ధార్థ్, శృతి హాసన్ హీరో హీరోయిన్స్ గా తెరకెక్కిన పీరియాడిక్ ఫాంటసీ చిత్రంలో మంచు లక్ష్మి ప్రధాన విలన్ రోల్ చేసింది.
అనంతరం గుండెల్లో గోదారి మూవీలో హీరోయిన్ గా చేసింది. అలాగే దొంగాట, లక్ష్మీ బాంబ్, వైఫ్ ఆఫ్ రామ్ ఇలా పలు చిత్రాల్లో ఆమె ప్రధాన పాత్రలు చేశారు. అయితే ఒక్క సినిమా ఆడలేదు. టాలీవుడ్ లో అడుగుపెట్టి పదేళ్లు దాటిపోతున్నా మంచు లక్ష్మికి ఒక ఇమేజ్ అంటూ రాలేదు. తెలుగులో కూడా పలు టాక్ షోలు హోస్ట్ చేసింది. నిర్మాతగా, నటిగా పరిశ్రమలో కొనసాగుతున్నారు..
జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తుంది. సొంత బ్యానర్లో చిత్రాలు చేసుకుంటుంది. తాజాగా అగ్ని నక్షత్రం టైటిల్ తో యాక్షన్ ఎంటర్టైనర్ చేసింది. పోస్ట్ ప్రొడక్షన్ కూడా పూర్తయినట్లు సమాచారం. అయితే మూవీ మీద ఎలాంటి అప్డేట్ లేదు. ప్రమోషన్స్ చేయడం లేదు. ఈ మూవీలో మోహన్ బాబు సైతం ఓ రోల్ చేశారట. అగ్ని నక్షత్రం మూవీతో హిట్ కొట్టాలని మంచు లక్ష్మి చూస్తున్నారు.
ఇక సోషల్ మీడియాలో మంచు లక్ష్మి అరాచకాలు మాములుగా లేవు. నాలుగు పదుల వయసులో స్కిన్ షోకి తెరలేపుతుంది. తాజాగా కోటు బటన్స్ విప్పేసి బ్రా కనిపించేలా ఫోజులు ఇచ్చింది. బోల్డ్నెస్ లో నెక్స్ట్ లెవెల్ అన్నట్లు పరిస్థితి ఉంది. మంచు లక్ష్మి దెబ్బకు సోషల్ మీడియా షేక్ అవుతుంది. ఆమె హాట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇంతలా తెగిస్తున్న మంచు లక్ష్మి తీరుకు జనాలు వాపోతున్నారు. కాగా మంచు బ్రదర్స్ మధ్య విబేధాలు కొనసాగుతున్నాయి. కొన్నాళ్లుగా విష్ణు, మనోజ్ మధ్య వైరం నడుస్తుంది.
View this post on Instagram