Ashwin- Dhoni: డబ్ల్యూటీసి ఫైనల్ లో ఓటమిపాలైన భారత జట్టు తీవ్రస్థాయిలో విమర్శలను ఎదుర్కొంది. ఇప్పటికీ మాజీ క్రికెటర్లు, అభిమానులు ఈ ఓటమిని జీర్ణించుకోలేక తమదైన శైలిలో విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే ఈ ఓటమి నుంచి వస్తున్న విమర్శల వాడి తగ్గుతుంది అనుకుంటున్న తరుణంలో.. ఫైనల్ మ్యాచ్ లో చోటు దక్కించుకోలేకపోయిన రవిచంద్రన్ అశ్విన్ తాజాగా చేసిన కామెంట్స్ మరింత దుమారాన్ని రేపుతున్నాయి.
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ లో భారత జట్టు ఆస్ట్రేలియా చేతిలో దారుణంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ ఓటమి తర్వాత పెద్ద ఎత్తున భారత జట్టుపై విమర్శలు వ్యక్తం ముఖ్యంగా ఫైనల్ మ్యాచ్ లో రవిచంద్రన్ అశ్విన్ ను తీసుకోకపోవడం పెద్ద తప్పిదం అంటూ సీనియర్ క్రికెటర్లు విమర్శలు గుప్పించారు. దీనిపై ఇన్నాళ్ళు మౌనం వహిస్తూ వచ్చిన అశ్విన్ తాజాగా స్పందించాడు. కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ ను లక్ష్యంగా చేసుకొని పరోక్షంగా కామెంట్స్ చేశాడు. ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి.
ఆస్ట్రేలియా జట్టును అభినందించిన అశ్విన్..
డబల్ యు టి సి ఫైనల్ లో ఆస్ట్రేలియా జట్టు విజయం సాధించడంపై తన యూట్యూబ్ ఛానల్ వేదికగా ఒక వీడియోను పోస్ట్ చేశాడు అశ్విన్. ఈ వీడియోలో ఆస్ట్రేలియా జట్టును అభినందించాడు. ‘ముందుగా ఆస్ట్రేలియా జట్టుకు శుభాకాంక్షలు. డబ్ల్యూటిసి ఫైనల్ మ్యాచ్ అద్భుతంగా సాగింది. విజయానికి వాళ్లు పూర్తిగా అర్హులు. మార్నస్ లబుషేన్ వంటి ఆటగాళ్లు కౌంటిల్లో ఆడటం వాళ్లకు కాస్త ప్రయోజనకరంగా మారిన మాట వాస్తవమే. నిజానికి టీం ఇండియా లాగే ఆసీస్ కూడా గత డబ్ల్యుటిసి సైకిల్ లో నిలకడైన ప్రదర్శన కనబరిచింది. కానీ ఫైనల్ కు చేరలేకపోయింది. కానీ ఈసారి తప్పులు పునరావృతం కాకుండా చూసుకుంది. వారికి గెలిచే అర్హత వందకు వంద శాతం ఉంది ‘ అని అశ్విన్ వీడియాలో వ్యాఖ్యానించాడు. ఇకపోతే ఫైనల్ మ్యాచ్ లో అశ్విన్ ను ఆడించకపోవడం పెద్ద తప్పిదంగా ఓటమి అనంతరం పలువురు విశ్లేషించారు. కాగా, డబ్ల్యూటీసి 2021-23 సైకిల్ లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్ గా అశ్విన్ నిలిచినప్పటికీ ఫైనల్లో చోటు దక్కకపోవడం గమనార్హం. అనుభవజ్ఞుడు విదేశాల్లో మంచి రికార్డు ఉన్న అశ్విన్ ను ఆడించకపోవడం పట్ల అప్పట్లోనే పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఓటమి తర్వాత అనేక విధాలుగా విమర్శలు వచ్చినప్పటికీ అశ్విని ఇప్పటివరకు స్పందించలేదు. తాజాగా స్పందిస్తూ ఈ విధంగా వ్యాఖ్యలు చేశాడు అశ్విన్.
బాధను సహానుభూతి చెందగలను అంటూ కామెంట్..
ఈ విషయంపై మరింతగా స్పందించిన అశ్విన్.. గత పదిహేళ్లుగా టీమిండియా ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా గెలవలేదని, కాబట్టి అభిమానులు ఆవేశపడటం సహజమేనని, వారి బాధను తాను సహానుభూతి చెందగలనని ఈ సందర్భంగా అశ్విన్ వ్యాఖ్యానించాడు. అయితే జట్టులోని ఈ ఆటగాడిని తప్పించి మరో ఆటగాడికి అవకాశం ఇవ్వాల్సిందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్ సరికాదని, రాత్రికి రాత్రి ఆటగాళ్ల నైపుణ్యాలు, శక్తిసామర్థ్యాల్లో మార్పులు రాగానే అశ్విన్ స్పష్టం చేశాడు.
ధోని నాయకత్వ ప్రతిభను కొనియాడిన అశ్విన్..
పనిలో పనిగా మహేంద్ర సింగ్ ధోని నాయకత్వ ప్రతిభను కూడా అశ్విన్ కొనియాడాడు. ధోని ఎటువంటి పరిస్థితులను అయినా సరళతరం చేస్తాడని, ధోని సారధ్యంలో తాను కూడా ఆడానని ఈ సందర్భంగా వెల్లడించాడు. ధోని తన జట్టులో తొలుత 15 మందిని ఎంపిక చేసుకుంటాడని, తుది జట్టును వీరు నుంచే ఎంపిక చేసుకుంటాడని స్పష్టం చేశాడు అశ్విన్. వారిని ఏడాది మొత్తం జట్టులా ఉండేలా చూసుకోవడం ద్వారా మెరుగైన ఫలితాలు వచ్చేలా చేస్తుంటాడని ధోని నాయకత్వాన్ని ప్రశంసించాడు. నిజానికి ఒక ఆటగాడు మెరుగైన ప్రదర్శన ఇవ్వాలంటే జట్టులో తన స్థానం వదలమే అన్న నమ్మకం కలిగాల్సి ఉందని అశ్విన్ పేర్కొన్నాడు. ధోని నాయకత్వాన్ని ప్రశంసించడం ద్వారా రోహిత్ శర్మ, రాహుల్ ద్రావిడ్ పై పరోక్షంగా విమర్శలు గుప్పించినట్లు అయిందని పలువురు క్రికెట్ అభిమానులు పేర్కొంటున్నారు.
Web Title: Ravichandran ashwin interesting comments on dhonis captaincy
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com