Chanakya Niti Success: మనం జీవితంలో ఎదగాలని అందరు కోరుకుంటారు. దాని కోసం అహర్నిశలు శ్రమిస్తారు. విజయం సాధించి మన మేంటో నిరూపించాలని కలలు కంటుంటారు. కానీ ఆ విజయం అంత తేలిగ్గా రాదు. దాని కోసం ఎంతో కష్టపడాలి. లేకపోతే విక్టరీ మన దరి చేరదు. విజయా సాధించాలంటే ఈ ఐదు తప్పులు చేయొద్దని ఆచార్య చాణక్యుడు సూచించాడు.
చిత్తశుద్ధి
నిజాయితీ, చిత్తశుద్ధి ప్రాధాన్యం గురించి తెలుసుకోవాలి. నిజాయితీ లేని పనులు చేయడం మంచిది కాదు. మనం చేసే పనుల్లో నిజాయితీ లేకపోతే ఇబ్బందులే. వ్యక్తిగత, వృత్తిపరమైన రంగాల్లో విజయానికి ముఖ్యమైనదిగా ఉంటుంది. ఈ నేపథ్యంలో నమ్మకంతో పనులు చేయాలి. నిర్లక్ష్యం వహిస్తే కష్టాలు తప్పవని తెలుసుకోవాలి.
వాయిదాలు వద్దు
ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవద్దు. రేపటి పని ఈ రోజే చేయండి. ఈ రోజు పని ఇప్పుడే చేయండి. పనులు వాయిదా వేయడం వల్ల మన పురోగతి దెబ్బ తింటుంది. సమయం వృథా చేసుకుంటే ఒత్తిడి కలగవచ్చు. చేసే పనులకు ప్రాధాన్యం ఇచ్చి సత్వరంగా చేసుకోవాలి. అప్పుడే మన అభివృద్ధి కుంటుపడకుండా ఉంటుంది.
అహంకారం
మనిషిని అహంకారం అందుడిగా చేస్తుంది. వ్యక్తిగత పురోగతి అవరోధంగా మారుతుంది. మితిమీరిన గర్వం ఉంటే మనిషికి కష్టాలు తప్పవు. అహంకారం మనిషి పతనానికి కారణమవుతుంది. గర్వం లేకుండా చేసుకుంటేనే మన ఎదుగుదల సాధ్యం అవుతుంది. అహంకారం ఉందంటే మనిషి పతనం ప్రారంభమవుందని చెప్పొచ్చు.
దురాశ
దురాశ దుఖానికి చేటు అంటారు. జీవితంలో అన్ని కావాలని అనుకోవడం మంచిది కాదు. మనిషి పురోగతి గాడిలో పడదు. ఉన్న దాంట్లో తృప్తి పడాలి. మనిషిలో విలువలు నశిస్తే అతడి పురోగమనం మందకొడిగా మారుతుంది. అత్యాశ ఉన్న వాడు పైకి రాడు. దురాశతో ఏదీ సాధించలేడు. ప్రశాంతంగా ఉండటం వల్ల మనిషి ఎదుగుదల సాధ్యమవుతుంది.
కోపం
తన కోపమే తన శత్రువు అంటారు. మనిషికి శాంతమే రక్ష. కోపం మనిషి పతనానికి కారణమవుతుంది. దీని వల్ల మనిషిలో ప్రతికూలతలు వస్తాయి. కోపం వల్ల శత్రువులు పెరుగుతారు కానీ స్నేహితులు కారు. కోపాన్ని విడిచి పెట్టకపోతే కష్టాలు రావడం తథ్యం. సామూహిక విజయంతోనే వ్యక్తిగత విజయం సాధ్యం అవుతుంది.