Chanakya Niti Tips in Telugu : పెళ్లికి సంబంధించిన అనేక నియమాలను కూడా ఆచార్య చాణిక్యుడు నీతి శాస్త్రంలో తెలిపాడు. నీతి శాస్త్రంలో ఆచార్య చానిక్యుడు పురుషులు తమ జీవితము నరకంగా ఉండకుండా ఉండాలి అంటే ఇటువంటి లక్షణాలు ఉన్న స్త్రీని పెళ్లి చేసుకోవద్దని తెలిపాడు. పెళ్లి తర్వాత జీవితం నరకంగా మారకుండా ఉండాలంటే ముఖ్యంగా జీవిత భాగస్వామిని ఎలా ఎంచుకోవాలి అలాగే ఎలాంటి స్త్రీలను పురుషులు పెళ్లి చేసుకోకూడదు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. పెళ్లి తర్వాత దంపతులు నిండు నూరేళ్లు కలిసి జీవించాల్సి ఉంటుంది. కాబట్టి సరైన జీవిత భాగస్వామిని ఎంచుకోవడం చాలా ముఖ్యం. ఇటువంటి ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాలి. జీవిత భాగస్వామిని ఎంచుకోవడంలో విఫలమైతే ఆ తర్వాత జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. కాబట్టి సరైన జీవిత భాగస్వామిని ఎంచుకోవడానికి మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. అయితే కొన్ని లక్షణాలు ఉన్న స్త్రీలను పొరపాటున కూడా పెళ్లి చేసుకోకూడదు అని ఆచార్య చాణిక్యుడు నీతి శాస్త్రంలో తెలిపాడు. చెడు కుటుంబం నుంచి వచ్చిన స్త్రీలను ఎప్పటికీ పురుషులు పెళ్లి చేసుకోకూడదు.
Also Read : పదేళ్లలో కనుమరుగు కాబోతున్న ఓ తరం.. భవిష్యత్తు సవాళ్ల మయం
ఆమె చాలా అందంగా ఉన్నా, చాలా డబ్బులు కలిగి ఉన్న కుటుంబం అయినా కూడా అటువంటి యువతిని పెళ్లి చేసుకోకూడదని ఆచార్య చానిక్యుడు తెలిపాడు. ఇటువంటి వారిని పెళ్లి చేసుకుంటే మీరు భవిష్యత్తులో చాలా సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. తన కుటుంబంలో ఉన్న సభ్యులను గౌరవించని స్త్రీని కూడా పొరపాటున కూడా పెళ్లి చేసుకోకూడదు అని ఆచార్య చాణిక్యుడు తెలిపాడు. ఇటువంటి స్త్రీని పెళ్లి చేసుకుంటే మీ కుటుంబం విడిపోయే అవకాశం ఉంది. అయితే ఒక స్త్రీ చూడడానికి చాలా అందంగా ఉన్నా కూడా ఆమె ప్రవర్తన, వైఖరి మాత్రం సరిగ్గా లేకపోతే అటువంటి స్త్రీని కూడా పెళ్లి చేసుకోకూడదు. అటువంటి మహిళలు భవిష్యత్తులో ఎప్పుడైనా సరే తన భర్తను విడిచి పెట్టవచ్చు. అలాగే అబద్ధం చెప్పే స్త్రీలను కూడా పెళ్లి చేసుకోకూడదు.
ఇటువంటి స్త్రీలు పెళ్లి తర్వాత సందర్భం వచ్చినప్పుడు తన భర్త పై కూడా తప్పుడు ఆరోపణలో చేసి భర్త జీవితాన్ని నాశనం చేస్తారు. అతని తల్లిదండ్రుల నుంచి తన భర్తని దూరం చేసేందుకు కూడా వీళ్ళు అబద్ధాలు చెప్పే అవకాశం ఉంది. వ్యంగ్యంగా మాట్లాడే స్త్రీలను కూడా పెళ్లి చేసుకోకూడదు. ఇటువంటి స్త్రీలు పెళ్లి తర్వాత తన భర్తను అలాగే అతని కుటుంబ సభ్యులను కూడా అవమానించే అవకాశం ఉంది. అలాగే అంతర్గత సౌందర్యం లేని స్త్రీని కూడా పెళ్లి చేసుకోకూడదని ఆచార్య చానిక్యుడు చెప్తున్నాడు. ఎందుకంటే ఇటువంటి స్త్రీలు ఆలోచనలు మంచివి కాకపోతే అటువంటి వివాహం చాలా కాలం నిలవదు.