Chanakya Niti: బాహ్య సౌందర్య కంటే అంతర సౌందర్యమే గొప్పదని మాజీ విశ్వసుందరి సుస్మితాసేన్ చెప్పింది. మనిషిలో గుణాలకే ప్రాధాన్యం ఇవ్వాలి కానీ అందానికి కాదు. దీంతో మన జీవిత భాగస్వామి ఎంపికలో కూడా కొన్ని నిబంధనలు పాటించాల్సిందే. జీవనం సుఖవంతంగా సాగాలంటే అర్థం చేసుకునే అర్థాంగి లేకపోతే జీవితం నరకమే. జీవితంలో ఏ బాదరబందీ లేకుండా ముందుకు వెళ్లాలంటే సంసారంలో బాధలు ఉండకూడదు. మన అభిప్రాయాలను గుర్తించే వారిని ఎంచుకోవడం కూడా ఓ కళ. కాబోయే అర్థాంగిని ఎంచుకునేటప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలనేది ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో వివరించాడు.

అందంలో ఏముంది ప్రవర్తనలోనే మన గుణం దాగి ఉంటుంది. మన గుణగణాలను బట్టే మనల్ని అంచనా వేస్తారు. నీ స్నేహితులెవరో చెప్పు నీవెలాంటివాడివో చెబుతానంటారు. అదే విధంగా జీవిత భాగస్వామిని గుర్తించేటప్పుడు కొన్ని విషయాలు గ్రహించాలి. మంచి ప్రవర్తన, గుణం ఉన్న వారికి అందరు బాగానే కనిపిస్తారు. అదే చెడు లక్షణాలతో ఉన్న వారిని ఎవరు కూడా దగ్గరకు తీసుకోరు. అందుకే మన గుణం ప్రధానం కానుంది. మన ప్రవర్తనే మనకు ఓ ఆభరణంలా మారనుంది.
Also Read: KA Paul KCR: కేసీఆర్ ఆయువుపట్టుపై కొడుతున్న కేఏ పాల్..
ఆచార్య చాణక్యుడు సూచించిన ప్రకారం నడుచుకునే ఆడదాన్ని ఎంచుకుంటేనే మనకు జీవితంలో ఎలాంటి కష్టాలు రావు. కడదాకా తోడుంటే వ్యక్తికి మనం అండగా నిలవాల్సి వస్తుంది. ఆమె కూడా జీవితాంతం భర్త అడుగు జాడల్లోనే నడవాల్సి ఉంటుంది. దీని కోసం ఇద్దరి మధ్య సఖ్యత ఉంటేనే అన్ని సాధ్యమవుతాయి. అంతేకాని బండికి కట్టిన ఎడ్లు రెండు కలిస్తేనే సాఫీగా సాగుతుంది. అంతేకానీ ఓ ఎద్దు ఒక వైపు ఇంకో ఎద్దు మరోవైపు లాగితే ఏం లాభం. సంసారమనే పడవ కూడా సవ్యంగా సాగాలంటే ఇద్దరు కలవాల్సిందే.

మనకు కాబోయే భార్య విషయంలో ఆచితూచి అడుగులు వేయాలి. భార్యను కోరుకునే విషయంలో వారి గుణాన్ని అంచనా వేయాలి. లేకపోతే జీవితంలో మనకు ఎదురుదెబ్బలు ఖాయం. అర్థం చేసుకునే మనసు ఉంటే ఎంత దూరమైనా వెళ్లొచ్చు. అదే అర్థం కాని వేధింపులు ఉంటే నరకమే. భార్య మంచి నడవడిక కలిగి ఉంటే నలుగురిలో మన పరువు కూడా నిలబడుతుంది. అంతేకాని ఆమెలో మంచి గుణం లేకపోతే జీవితమే వ్యర్థమనే విషయం గ్రహించుకోవాలి. దీంతో ఆచార్య చాణక్యుడు సూచించిన విధానాలను లెక్కలోకి తీసుకుని మంచి భార్యను దక్కించుకునే విధంగా మన ప్రవర్తన ఉండాల్సిందే.
Also Read:YCP Bus Yatra Failure: అన్నీ చేస్తున్నా ప్రజాదరణ కరువు.. వైసీపీ నేతల్లో అంతర్మథనం