Senior Actress Jayasudha: అలనాటి హీరోయిన్స్ ఇప్పటికి కూడా క్యారక్టర్ ఆర్టిస్టు రోల్స్ వేస్తూ నేటి తరం వారిని కూడా అలరిస్తున్న సంగతి మన అందరికి తెలిసిందే..అలాంటి హీరోయిన్స్ లో ఒక్కరు జయసుధ గారు..ఒక్కప్పుడు ఈమె చిరంజీవి , కృష్ణ , ఎన్టీఆర్, ANR , కమల్ హస్సన్ మరియు శోభన్ బాబు వంటి టాప్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా నటించిన సంగతి మన అందరికి తెలిసిందే..కానీ ఆ తర్వాత పెరుగుతూ పితున్న పోటీ వల్ల ఈమెకి హీరోయిన్ పాత్రలు రావడం తగ్గిపోయింది..కానీ ఆ తర్వాత ఈమెకి క్యారక్టర్ ఆర్టిస్టు రోల్స్ మాత్రం క్యూ కట్టాయి అనే చెప్పాలి..ముఖ్యంగా తల్లి పాత్ర అంటే మనకి ముందుగా గుర్తుకు వచ్చే పేరు జయసుధ గారే..మన ఇంట్లో అమ్మ ఎలా ఉంటుందో..వెండితెర మీద జయసుధ గారిని చూస్తే అలానే అనిపిస్తుంది..అందుకే ఆమెకి సహజ నటి అనే బిరుదు కూడా వచ్చింది..నిన్న మొన్నటి వరుకు వరుస సినిమాలతో ఫుల్ బిజీ గా గడిపిన జయసుధ గారు అకస్మాత్తుగా సినిమాలు చెయ్యడం తగ్గించేశారు..ముఖ్యంగా కరోనా వల్ల షూటింగ్స్ లో భారీ గ్యాప్ రావడం వల్ల జయసుధ గారిని ఇండస్ట్రీ లో చాలా మంది మర్చిపొయ్యే పరిస్థితి వచ్చింది అంటే ఏ మాత్రం అతిశయోక్తి లేదు.

Also Read: TDP Mahanadu 2022 Success: మహానాడు సక్సెస్ వెనుక జగన్..అదేలా అంటే?
చాలా కాలం తర్వాత సోషల్ మీడియా లో ఆమె ఫోటోలను చూసిన అభిమానులు కంగుతిన్నారు..ఈమె మన జయసుధ గారేనా అనేంతలా ఆమె ముఖం మారిపోయింది..వయస్సు మీద పడడం, దానికి తోడు సన్నగా తయారు అవ్వడం వల్లే జయసుధ గారికి సినిమాల్లో అవకాశాలు రావడం బాగా తగ్గిపోయాయి అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్త..ఇప్పుడు ఆమె మళ్ళీ సినిమాల్లో నటించడానికి తగ్గట్టు గా మారిన కూడా ఆమెకి అవకాశాలు బాగా కరువు అయ్యాయి..నటిగా, రాజకీయాల్లో కూడా మంచిగా రాణించిన జయసుధ కి ఇప్పుడు ఆర్ధిక కష్టాలు బాగా ఉన్నాయి అంటే..మొత్తం అప్పులతో కూరుకుపోయిన ఆమె ఆర్ధిక పరిస్థితి మళ్ళీ చక్కబడాలి అంటే కచ్చితంగా ఆమెకి ఇంతకు ముందు ఇండస్ట్రీ లో ఎలాంటి అవకాశాలు వచ్చేవో..అలాంటి పరిస్థితి మళ్ళీ రావాలి..చూడాలి మరి జయసుధ గారి రీ ఎంట్రీ తో ఆమె పరిస్థితి ఇంతముందు లాగ మారుతుందో లేదో అనేది..2019 వ సంవత్సరం లో బాలయ్య బాబు హీరోగా నటించిన రులెర్ అనే సినిమానే ఆమె చివరి సినిమా..ఈ సినిమా తర్వాత మళ్ళీ ఆమె వెండితెర పై కనిపించలేదు.
Also Read: Poorna Engagement: హీరోయిన్ పూర్ణ సీక్రెట్ నిశ్చితార్థం..వరుడు ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Recommended Videos
[…] Also Read: Senior Actress Jayasudha: ఆర్ధిక కష్టాల్లో మునిగిపోయ… […]