https://oktelugu.com/

Chanakya Niti: ఉద్యోగులు ఈ ఆరు సూత్రాలు పాటిస్తే విజయం అంచులకు చేరినట్లే..

చాణక్యుడు చెప్పిన నీతి ప్రకారం.. ఒక ఉద్యోగి ఏదైనా పని చేసే ముందు రహస్యంగా ఉంచాలి. బాస్ ఒక పనిని అప్పగిస్తే దానిని పూర్తి చేసేవరకు అప్పుడే ఇతరులకు చెప్పకుండా కొనసాగించాలి.

Written By:
  • Srinivas
  • , Updated On : August 8, 2024 5:30 pm
    Chanakya Niti

    Chanakya Niti

    Follow us on

    Chanakya Niti: రాజనీతిని శాస్త్రజ్ఞుడు చాణక్యుడు ఏన్నో ఏళ్ల కింద మౌర్య సమ్రాజ్యానికి తన విలువైన బోధనలు అందించాడు. చాణక్య నియమాలు పాటించి ఆ సమయంలో రాజులు తమ పరిపాలనను చక్కగా చేసేవారు. కేవలం రాజ్యానికి సంబంధించిన సూత్రాలే కాకుండా జీవితానికి సంబంధించిన కొన్ని నియమాలను చాణక్యుడు అప్పట్లోనే పలువురికి నేర్పించాడు. వాటిని తరతరాలుగా పాటిస్తూ జీవితాన్ని ఆనందమయం చేసుకుంటున్నారు. ఈ చాణక్య నీతి సూత్రాలు భవిష్యత్ తరాల వారికి ఉపయోగపడేలా పుస్తకాలు, పత్రికల్లో ప్రచురిస్తున్నారు. ఇప్పటికీ కొందరు చాణక్య సూత్రాలను పాటిస్తూ సక్సెస్ ఫుల్ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. చాణక్యుడు ఉద్యోగులు కార్యాలయాల్లో ఎలా ఉండాలో చెప్పాడు. ఏ విధంగా ప్రవర్తిస్తే తాను అనుకున్న లక్ష్యాలు అధిగమిస్తారో వివరించారు. నేటి కాలంలో ఏ రంగంలోని ఉద్యోగులైనా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. దీంతో చినచ్ని కారణాలకే మనస్థాపానికి గురవుతున్నారు. కొందరు ఉద్యోగుల ఎక్కువ ఒత్తిడిన తట్టుకోలేక ఎక్కువకాలం జాబ్ చేయలేకపోతున్నారు. దీంతో మిగతా వారి కంటే వెనకబడుతున్నారు. అయితే కొన్ని విషయాల్లో ప్రణాళికలు వేసుకోవడం వల్ల అనుకున్న లక్ష్యాలను సాధిస్తూ ముందుకు వెళ్తారని చాణక్యుడు తన బోధనల ద్వారా చెప్పారు. అంతేకాకుండా మిగతా వారి కంటే వీరు ఎక్కువగా ప్రమోషన్ పొందుతారని చెప్పారు. అయితే చాణక్య నీతి సూత్రాలు పాటించే సమయంలో కొంత ఓర్పు, కష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ వీటిని పాటించడం వల్ల జీవితంలో ఎంతో ప్రగతి సాధిస్తారు. మరి ఆ సూత్రాలు ఏవో తెలుసుకుందాం..

    చాణక్యుడు చెప్పిన నీతి ప్రకారం.. ఒక ఉద్యోగి ఏదైనా పని చేసే ముందు రహస్యంగా ఉంచాలి. బాస్ ఒక పనిని అప్పగిస్తే దానిని పూర్తి చేసేవరకు అప్పుడే ఇతరులకు చెప్పకుండా కొనసాగించాలి. లేకుంటే కొందరు ఆ పని పూర్తి చేయకుండా అడ్డంకులు సృష్టిస్తారు. అంతేకాకుండా దానిని వారు చేసి బాస్ దగ్గర మెప్పు పొందుతారు. దీంతో వారి కంటే వెనుకబడిపోతారు.

    తెలివైన వారు మాత్రమే ఉద్యోగాల్లో రాణిస్తారనేది సత్యం. అయితే కొన్ని పనులు చేసేటప్పుడు విధుల్లోనే మునిగిపోకుడా ఇతరులు మనపై ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో తెలుసుకోవాలి. ఎందుకంటే నిటారుగా ఉన్న చెట్లనే ముందుగా నరికివేస్తారు. అలాగే ఎక్కువగా పనిచేసేవారిపైనే వేటు పడుతుంది. దీంతో ఓ వైపు సక్రమంగా విధులు నిర్వహిస్తూనే.. మరోవైపు ఇతరులతో జాగ్రత్తగా ఉండాలి.

    కార్యాలయాల్లో ఒక పనిని అప్పగించినప్పుడు ఎన్నో అడ్డంకులు ఎదురవుతాయి. అయితే అనుకున్న లక్ష్యానికి చేరుకోవడానికి ఇలాంటివి కామన్. ఈ నేపథ్యంలో చిన్న చిన్న విషయాలను పట్టించుకోకుండా ముందుకు వెళ్లడమే మంచింది. చిన్న వాటికి రియాక్ట్ కావడం వల్ల సమయం వృథా అవుతుంది. దీంతో అసలైన పనులు మరుగున పడుతాయి.

    ఏదైనా ఒక పనిచేసేటప్పడు మిగతా వారి కంటే బెటర్ గా చేయగలననే విధంగా ప్రవర్తించాలి. ఒక విధంగా దూకుడుగా ముందుకు సాగాలి. అప్పడే మీ పై బాస్ కు నమ్మకం కలుగుతుంది. మిగతా వ్యక్తుల వలే ప్రవర్తించడం వల్ల ప్రత్యేక గుర్తింపు అంటూ ఏదీ ఉండదు. దీంతో ప్రమోషన్లు రావడానికి ఇబ్బందులు పడుతాయి.

    ఒక కంపెనీ వ్యక్తి విధులు సక్రమంగా నిర్వహిస్తున్నాడనేది మాత్రమే చూడకుడా అతని వ్యక్తిత్వాన్ని కూడా పరిశీలిస్తుంది. అతడు స్నేహితులతో కలిసిమెలిసి ఉంటున్నారా? లేక వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడా? అనేది చూస్తుంది. వ్యక్తిత్వం లేని ఉద్యోగిపై కంపెనీకి చెడు ప్రభావం వెళ్లే ప్రమాదం ఉంది. ఈ అవకాశం రాకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి.

    సాధారణ జీవితంతో పాటు కార్యాలయంలో శత్రువులు ఉంటారు. ఒక రకంగా వీరిని ఎదర్కోవడానికైనా తెలివి ఉండాలి. లేదా వారికి దూరంగా ఉండాలి. వారితో కలిసి ఉండడం వల్ల వారి ప్రభావం మీపై పడే అవకాశం ఉంది. అందువల్ల ఇలాంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.