Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ సీజన్ 7 లో సంచలనం సృష్టించాడు. కామన్ మ్యాన్ కేటగిరిలో హౌస్ లో అడుగుపెట్టాడు. అన్ని విధాలుగా సత్తా చాటాడు. టాస్కుల్లో విజృంభించి ఆడాడు. మాటతీరు, ప్రవర్తన ఇలా ప్రతిదాంట్లో ఆడియన్స్ దగ్గర మంచి మార్కులు కొట్టేశాడు. కామనర్ అయినప్పటికీ సెలబ్రెటీలను సైతం వెనక్కి నెట్టి టైటిల్ సొంతం చేసుకున్నాడు. బిగ్ బాస్ హిస్టరీలో లేని రికార్డు క్రియేట్ చేశాడు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఫినాలే ముగిసిన తర్వాత అసలైన రచ్చ స్టార్ట్ అయింది.
పల్లవి ప్రశాంత్ – అమర్ దీప్ ఫ్యాన్స్ దాడులకు దిగారు. దారుణంగా కొట్టుకుంటూ రచ్చ చేశారు. ప్రశాంత్ ఫ్యాన్స్ అమర్ దీప్ కారుని అడ్డుకున్నారు. వారిపై రాళ్ల దాడి చేశారు. అంతేకాదు మిగిలిన కంటెస్టెంట్ల కార్లు, ఆర్టీసీ బస్సుల అద్దాలు పగలగొట్టారు. అత్యుత్సాహంలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారు. దీంతో పల్లవి ప్రశాంత్ కి పోలీసులు ఆదేశాలు ఇచ్చారు. ఎటువంటి హంగామా చేయకుండా సైలెంట్ గా వెనుక గేట్ నుంచి వెళ్లిపోండని సూచించారు.
కానీ పల్లవి ప్రశాంత్ పోలీసుల మాటలు లెక్కచేయకుండా ర్యాలీ నిర్వహించాడు. దీంతో పరిస్థితి మరింత అదుపుతప్పింది. పోలీసులు పల్లవి ప్రశాంత్, అతని సోదరుడి పై కేసు నమోదు చేశారు. అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. రెండు రోజులకు ప్రశాంత్ బెయిల్ పై విడుదలయ్యాడు. అయితే ఈ సంఘటన నేపథ్యంలో బిగ్ బాస్ ఇమేజ్ డ్యామేజ్ అయింది. షో రెప్యుటేషన్ దెబ్బ తింది. అంతేకాదు హోస్ట్ నాగార్జున కి సైతం బ్యాడ్ నేమ్ వచ్చింది.
హింసకు కారణమైన బిగ్ బాస్ షో బ్యాన్ చెయ్యాలి అంటూ పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. అందుకే పల్లవి ప్రశాంత్ వలన బిగ్ బాస్ మేకర్స్ ఓ కఠినమైన నిర్ణయం తీసుకున్నారట. ఇక పై సామాన్యులను బిగ్ బాస్ షోకి తీసుకోకూడదని డిసైడ్ అయ్యారట. ఇది బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళాలి అనుకునే చాలా మందికి పెద్ద షాక్ అని చెప్పాలి. ఎందుకంటే కామనర్ కోటాలో బిగ్ బాస్ కి వెళ్లాలని నాన్ సెలెబ్స్ ఆశపడుతుంటారు.
అలాంటి వారి ఆశలు ఆవిరైనట్లే. ముఖ్యంగా బిగ్ బాస్ సీజన్ 8 లో సామాన్యులకు అవకాశం ఉండదు అని అంటున్నారు. ఇది ఇలా ఉంటే .. పల్లవి ప్రశాంత్ ఇప్పటివరకు ఇచ్చిన మాట ప్రకారం పేద రైతులకు రూ. 1. 20 లక్షలు మాత్రమే పంచిపెట్టాడు. ఇంకా దాదాపు రూ. 15 లక్షలు దానం చేయాల్సి ఉందని అంచనా. అది ఎప్పుడు చేస్తాడు అనేది క్లారిటీ లేదు. అసలు చేస్తాడో లేదో కూడా తెలియదు. సీజన్ 7 ముగిసి ఏడు నెలలు దాటిపోయింది. పల్లవి ప్రశాంత్ ప్రైజ్ మనీలో స్వల్ప మొత్తం ఆత్మహత్య చేసుకుని మరణించిన ఇద్దరు రైతు కుటుంబాలకు సహాయం చేశాడు. మరి మిగిలిన డబ్బులు సైతం మెల్లగా పల్లవి ప్రశాంత్ ఇస్తాడా లేక, పంచిన దానితో సరిపెడతాడా? అనేది చూడాలి…