https://oktelugu.com/

CCTV footage : సీసీ ఫుటేజీ ని పోలీసులు చెక్ చేస్తుండగా.. ఒక్కసారిగా షాక్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన ఈ రోజుల్లో ఒక నేరస్తుడిని పట్టుకోవడం పోలీసులకు సులభం అయినప్పటికీ.. వారు రకరకాల మార్గాలలో తప్పించుకుని తిరుగుతున్నారు. అలాంటప్పుడు వారిని పట్టుకోవడం పోలీసులకు చాలా కష్టమవుతోంది. అదిగో అలాంటి సమయంలో ఇలా సీసీ కెమెరాలు వాచ్ డాగ్ పాత్ర పోషిస్తున్నాయి. పోలీసులకు అనితర సాధ్యమైన సాయాన్ని అందిస్తున్నాయి.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : August 8, 2024 / 05:25 PM IST
    Follow us on

    CCTV footage :  ఒకప్పుడంటే.. ఎక్కడో ఒకచోట హత్యలు, ఇతర నేరాలు జరిగేవి. కానీ ఇప్పుడు అలా కాదు. సులభమైన సంపాదనకు అలవాటు పడి చాలామంది నేరాలకు పాల్పడుతున్నారు. ఇంకా కొంతమంది కోపాన్ని అణుచుకోలేక, సహనాన్ని కోల్పోయి హత్యలకు పాల్పడుతున్నారు. దోపిడీలకు తెగబడుతున్నారు. సాటి మనిషి అని చూడకుండా కి రతకంగా చంపేస్తున్నారు. వరుసలు, వావి అని చూడకుండా దారుణాలకు పాల్పడుతున్నారు. ఈ తరహా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో.. నేరస్తులను పట్టుకునేందుకు పోలీసులు రద్దీ ప్రాంతాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సీసీ కెమెరాల వల్ల పోలీసులకు నేరాల దర్యాప్తు సులభం అయిపోయింది. నేరస్తులను గుర్తించడం ఈజీ అయిపోయింది. ఒక సీసీ కెమెరా పదిమంది పోలీసులతో సమానం అని.. అందువల్లే వాటిని విరివిగా ఏర్పాటు చేస్తున్నామని డిజిపి స్థాయి అధికారులు అంటున్నారు.. అయితే ఈ సీసీ కెమెరాల ద్వారా ఇప్పటికే ఎన్నో కేసులను పోలీసులు చేదించారు. ఏమాత్రం క్లూ కూడా దొరకని కేసులను పరిష్కరించి.. నిందితులను జైళ్లకు పంపించారు. అయితే కర్ణాటక రాష్ట్రంలో సీసీ కెమెరా ఫుటేజ్ ని చెక్ చేస్తుంటే పోలీసులకు షాక్ లాంటి పరిణామం ఎదురైంది. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

    కర్ణాటక రాష్ట్రంలో ఇప్పటికే అన్ని పోలీస్ స్టేషన్లను అనుసంధానిస్తూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ సీసీ కెమెరాల ఫుటేజ్ ని నియంత్రించేందుకు కమాండ్ కంట్రోల్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. దీనిద్వారా రాష్ట్రం మొత్తం పహారా కాస్తున్నారు. వీటి ద్వారానే నేరాలను సాధ్యమైనంతవరకు నియంత్రిస్తున్నారు. ఈ క్రమంలో బెంగళూరు పోలీసులు సదాశివ నగర్ సిగ్నల్ వద్ద ఏర్పాటుచేసిన సీసీ కెమెరా పుటేజీ పరిశీలిస్తుండగా.. బైక్ పై వెళ్తున్న ఓ వ్యక్తి అనుమానస్పదంగా కనిపించాడు. ఆ బైక్ జూమ్ చేసి చూడగా నెంబర్ తప్పుగా ఉంది. అదే సమయంలో ఆ వ్యక్తి ని జాగ్రత్తగా పరిశీలిస్తే.. ఓ పాత నేరస్తుడి ముఖం మాదిరి కనిపించింది. మరింత లోతుగా పరిశీలించగా అతడు హాట్ కే మాంజా అని తేలింది.. దీంతో పోలీసులు వెంటనే ఆ ప్రాంతం వద్దకు వెళ్లి.. అతడిని మాటు వేసి పట్టుకున్నారు. అనంతరం అతడిని బెంగళూరు క్రైమ్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. అతడిని ప్రస్తుతం పోలీసులు వివిధ కేసులకు సంబంధించి విచారిస్తున్నారు.

    హాట్ కే మాంజా కరుడుగట్టిన నేరస్థుడు. కర్ణాటక రాష్ట్రంలో పలు నేరాలకు పాల్పడ్డాడు. వైట్ కాలర్ నేరాలు చేయడంలో ఇతడు సిద్ధ హస్తుడు. ప్రారంభంలో చిన్నచిన్న చోరీలు చేసిన ఇతడు.. ఆ తర్వాత దండుపాళ్యం లాగా ఒక గ్యాంగ్ ను నడిపేవాడు. అలా ఒక సమాంతర వ్యవస్థగా మారాడు. మత్తు పదార్థాల రవాణా, చైన్ లింకు మోసాలు, హత్యలు, అత్యాచారాలు.. ఇలా ఎన్నో నేరాలు చేశాడు. కానీ పోలీసులకు చిక్కినట్టే చిక్కి తప్పించుకునేవాడు. పైగా పోలీసులు ఇతడికి ఇన్ ఫార్మర్లు ఉన్నారు. అందువల్లే అతడు దర్జాగా తప్పించుకునేవాడు. పోలీసులు ఇతడి ఆచూకీ కోసం ఎప్పటినుంచో గాలిస్తున్నారు. అప్పట్లో ఇతడిని పట్టుకునేందుకు బెంగళూరు పోలీసులు ప్రత్యేకంగా బృందాన్ని ఏర్పాటు చేశారు. కానీ ఉపయోగం లేకుండా పోయింది. చివరికి సదాశివ నగర్ దగ్గర ఉన్న సిసి ఫుటేజీలో ఇతడు కనిపించడంతో.. పోలీసులు మాటువేసి పట్టుకున్నారు. వివిధ నేరాలకు సంబంధించి అతడిని విచారిస్తున్నారు.

    సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన ఈ రోజుల్లో ఒక నేరస్తుడిని పట్టుకోవడం పోలీసులకు సులభం అయినప్పటికీ.. వారు రకరకాల మార్గాలలో తప్పించుకుని తిరుగుతున్నారు. అలాంటప్పుడు వారిని పట్టుకోవడం పోలీసులకు చాలా కష్టమవుతోంది. అదిగో అలాంటి సమయంలో ఇలా సీసీ కెమెరాలు వాచ్ డాగ్ పాత్ర పోషిస్తున్నాయి. పోలీసులకు అనితర సాధ్యమైన సాయాన్ని అందిస్తున్నాయి.