Chanakya Niti: ఇతర చాణక్యుడు కేవలం రాజనీతి శాస్త్రవే కాకుండా మనుషుల జీవితానికి సంబంధించిన ఎన్నో విలువైన విషయాలను చెప్పారు. వీటిని చాలామంది ఫాలో అవుతూ వస్తున్నారు. అయితే చాణక్యుడు ఒక వ్యక్తికి మిత్రుడు ఎంత ముఖ్యమో శత్రువు కూడా అంతే ముఖ్యమని చాణక్యుడు చెప్పాడు. అయితే మిత్రుల కంటే శత్రువుల విషయంలోనే ఎక్కువ దృష్టి పెట్టాలని చాణక్యుడు తన నీతి శాస్త్రంలో పేర్కొన్నారు. శత్రువులు చేసే కొన్ని పనులను కూడా గ్రహిస్తే వారి కంటే ముందే విజయం సాధించే అవకాశం ఉందని పేర్కొన్నారు. సాధారణంగా శత్రువులను చూసి చాలామంది భయపడుతూ ఉంటారు. కానీ వారిలోని లక్షణాలు కూడా కొన్ని ఉపయోగకరంగా ఉంటాయి. వాటిని ఫాలో కావడం వల్ల జీవితంలో అత్యంత విజయం సాధించే అవకాశం ఉంది. అయితే శత్రువులో ఉండే ఏ లక్షణాలను గ్రహించుకోవాలి? ఏ లక్షణాలు ఉపయోగకరంగా ఉంటాయి?
సమాజంలో ఎంతోమంది మనుషులు ఉన్న.. ఇతరు వ్యక్తుల మధ్య మనస్తత్వం భిన్నంగా ఉంటుంది. ఈ క్రమంలో వారిద్దరి మధ్య శత్రుత్వం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఇలా శత్రుత్వం పెరిగినప్పుడు ఒకరి లక్షణాలు మరొకరికి నచ్చవు. అయితే కొందరు శత్రువులు అని భావించినా.. వారికి ఉండే లక్షణాలను బట్టి వారు విజేతలుగా మారుతారు. అప్పుడు మంచివారు శత్రువులను జయించకుండా ఉంటారు. అయితే ఇలాంటి సందర్భంలో శత్రువుల లక్షణాలు కూడా ఉపయోగకరమైనవే అని భావించాలి. ఆ లక్షణాలు ఏంటంటే?
కొందరు వ్యక్తులు తమ పనులను రహస్యంగా నిర్వహించుకుంటూ ఉంటారు. వారు పనిని మొదలుపెట్టిన తర్వాత పూర్తిచేసే వరకు రహస్యంగా ఉంచుతారు. ఇలా ఉంచడం వల్ల వారి పనులను ఎవరు అడ్డుకోరని భావిస్తారు. ఇలా వారు విజయవంతంగా తమ పనిని పూర్తి చేయగలుగుతారు. ఇలాంటి లక్షణం శత్రువులో ఉన్న సరే వాటిని ఫాలో అయితే కచ్చితంగా మంచివారు కూడా విజయం సాధిస్తారు.
కొందరు వ్యక్తులు ఇతరులకు నచ్చకపోయినా వారు కొన్ని విషయాల్లో సహనంతో ఉండిపోతారు. ఎంతటి కష్టం ఎదురైనా కూడా వారు ఈజీగా ఎదుర్కోనగలుగుతారు. అంతేకాకుండా ఒక పని పూర్తి చేసే వరకు మరో పనిని ప్రారంభించారు. ఇలా చేయడం వల్ల వారు చేపట్టిన పనిని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఈ లక్షణం కూడా శత్రువులో ఉన్న దానిని పాటించడం వల్ల మంచి జరుగుతుంది.
పనిని ఎప్పుడు ప్రారంభించామనేది కాకుండా.. సరైన సమయంలో ఏం చేశామనేది చాలా ఇంపార్టెంట్. అందువల్ల కొందరు సరైన సమయంలో కొన్ని ప్రణాళికలు వేసుకుంటారు. ఇవి విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఇలాంటి లక్షణాలు కొందరు శత్రువుల్లో కూడా ఉంటాయి. అయితే వారు ఇతరులను ఇబ్బంది పెట్టినా.. ఆ లక్షణం ఉండడం వల్ల అనుకున్న పనిని త్వరగా పూర్తి చేయగలుగుతారు.
శత్రువులు ఎప్పుడూ ఎదుటివారి లక్ష్యాలను దృష్టి పెడతారు. ఎదుటివారు ఏ పని చేస్తున్నారు? వారి ప్రణాళిక ఏంటి అని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటారు. ఇలాంటి లక్షణం కలిగి ఉండటం వల్ల ఎదుటివారి మనస్తత్వాలను తెలుసుకొని వారికి అనుగుణంగా వ్యక్తులకు పైఎత్తులు వేసి అనుకున్నది విజయం సాధించే అవకాశం ఉంటుంది.