https://oktelugu.com/

Chanakya Niti: చాణక్య నీతి ఈ ఐదు రకాల బంధువులకు దూరంగా ఉండాలి..

అపర చాణక్యుడు జీవితానికి సంబంధించిన ఎన్నో విలువైన సూత్రాలను అందించారు. కొందరు వీటిని ఫాలో అవుతూ తమ జీవితాలను సార్ధకం చేసుకుంటున్నారు. ఒక వ్యక్తి ఎలా ఉండాలి? ఎవరితో ఎలా మాట్లాడాలి? ఎవరితో స్నేహం చేయాలి? ఎవరికి దూరంగా ఉండాలి? అనే విషయాలను చెప్పాడు.

Written By: , Updated On : March 24, 2025 / 05:36 PM IST
Chanakya-nithi

Chanakya-nithi

Follow us on

Chanakya Niti:  అపర చాణక్యుడు జీవితానికి సంబంధించిన ఎన్నో విలువైన సూత్రాలను అందించారు. కొందరు వీటిని ఫాలో అవుతూ తమ జీవితాలను సార్ధకం చేసుకుంటున్నారు. ఒక వ్యక్తి ఎలా ఉండాలి? ఎవరితో ఎలా మాట్లాడాలి? ఎవరితో స్నేహం చేయాలి? ఎవరికి దూరంగా ఉండాలి? అనే విషయాలను చెప్పాడు. ప్రతి ఒక్కరికి ఎవరో ఒకరు బంధువులు ఉంటారు. కొందరు బంధువులు వారి బాబు కోరుతూ వారికి అవసరమైనప్పుడు సాయం చేస్తారు. మరికొందరు మాత్రం వారి అభివృద్ధికి ఆటంకాలుగా మారుతారు. అయితే బంధువుల్లో ఉండే కొన్ని లక్షణాలను బట్టి వారితో కలిసి ఉండాలా లేదా అని నిర్ణయించుకోవచ్చు అని చాణక్య నీతి తెలిపింది. ఈ లక్షణాలు కనుక బంధువుల్లో కనిపిస్తే వారికి దూరంగా ఉండడమే మంచిదని అంటున్నారు. అవేంటో ఒకసారి తెలుసుకుందాం..

కొందరు బంధువులు పైకి స్నేహం గానే నటిస్తారు. కానీ లోపల వారి క్యారెక్టర్ వేరేలా ఉంటుంది. అయితే వీరి ప్రవర్తన కాస్త అతిగా ఉంటుంది. పైకి ఎక్కువగా ప్రేమ చూపించినట్లు కనిపించే వారితో జాగ్రత్తగా ఉండాలని చాణక్యుడు చెప్పారు. ఎందుకంటే వీరు తమ స్వార్థం కోసమే పైకి ప్రేమ చూపిస్తారు. తాము అనుకున్నది పూర్తయిన తర్వాత మీరు దూరంగా వెళ్తారు. అందువల్ల ఇటువంటి వారితో జాగ్రత్తగా ఉండాలని చాణక్య నీతి తెలుపుతుంది.

కొంతమంది బంధువులకు డబ్బు ఆశ ఎక్కువగా ఉంటుంది. వీరు డబ్బు ఎవరి దగ్గర ఎక్కువగా ఉంటే వారితోనే స్నేహం చేస్తారు. డబ్బు పోయిన తర్వాత వారికి దూరంగా ఉంటారు. ఇలాంటి వారి కనిపిస్తే వారికి దూరంగా ఉండటమే మంచిది. ఎందుకంటే వారు నిజమైన బంధువుల్లా కనిపించరు. కేవలం డబ్బు ఆశతోనే వారు మంచిగా కనిపిస్తారు. వారికి డబ్బుతోనే పని ఉంటుంది. ఇటువంటి లక్షణం కలిగిన వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని చాణిక్యనీతి తెలుపుతుంది.

బంధువులు ఎక్కువగా బాగు కోరుతారు అని చెబుతారు. కానీ కొంతమంది మాత్రం మనసుల మధ్య తగాదాలు సృష్టిస్తారు. ఎదుటివారు ఎప్పుడూ గొడవ పడితే ఆనందం పొందే రాక్షసత్వం కొందరిలో ఉంటుంది. ఇలాంటివారిని ఎప్పుడు దగ్గరికి దరిచేరనివ్వద్దు. ఎందుకంటే వీరితో ఉంటే ఎప్పుడూ నిరాశ ఉంటుంది. అంతేకాకుండా వారు ఎప్పుడూ ఏదో ఒక గొడవ సృష్టించడానికి ఉంటారు.

బంధువుల్లో కొందరు అమితంగా స్నేహం చేసినట్లే కనిపిస్తారు. కానీ కష్టాల్లో ఉన్నప్పుడు వీరు కనిపించరు. ఆనంద సమయంలో మాత్రమే నిజమైన స్నేహితుడిలా ప్రవర్తిస్తారు. వారికి ఏసేబు అంటే ఆ సేవ చేస్తారు. కష్టాల్లో మాత్రం సేవ చేయడానికి ముందుకు రారు. ఇటువంటి వారికి దూరంగా ఉండటమే మంచిదని చాణుక్య నీతి తెలుపుతుంది. ఎందుకంటే ఆపదలో ఆదుకున్న వారి నిజమైన స్నేహితుడు అని అంటారు. అలాంటి స్నేహితులు ఉంటేనే వారి జీవితం బాగుంటుంది.

కొందరు బంధువులు సాయం చేసినట్టే కనిపిస్తారు. కానీ వీరు తక్కువ సాయం చేసి ఎక్కువ ప్రయోజనం పొందాలని చూస్తారు. ఇందులో భాగంగా ఒక్కోసారి సాయం అడగకుండా వారు చేయడానికి ముందుకు వస్తారు. అయితే వారికి ఏం కావాలో ముందే తెలుసుకొని జాగ్రత్త పడటం మంచిది. ఎందుకంటే చివరి సమయంలో వారు పెద్ద మొత్తంలో ప్రయోజనం పొందేందుకు ప్లాన్ వేస్తారు.