https://oktelugu.com/

Sobhita Dhulipala: హద్దులు దాటేసిన అక్కినేని కోడలు..పెళ్లి తర్వాత ఇదేమి ఫోటో షూట్ సామీ!

Sobhita Dhulipala శోభిత హీరోయిన్ కాకముందు ఒక గొప్ప మోడల్. ఈమె మిస్ ఇండియా కిరీటాన్ని కూడా సొంతం చేసుకుంది. అందుకే ఈమె స్టైలింగ్ మొత్తం మిగిలిన హీరోయిన్స్ తో పోలిస్తే చాలా స్టైలిష్ గా ఉంటుంది.

Written By: , Updated On : March 24, 2025 / 05:38 PM IST
Sobhita Dhulipal

Sobhita Dhulipal

Follow us on

Sobhita Dhulipala: గత ఏడాది డిసెంబర్ నెలలో అక్కినేని నాగ చైతన్య(Akkineni Naga Chaitanya) తో శోభిత ధూళిపాళ్ల(Sobhita Dhulipala) కు వివాహం జరిగిన సంగతి తెలిసిందే. ఈ జంట ఇప్పుడు ఇండియా లోనే మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లో ఒకరిగా మారిపోయారు. అయితే శోభిత పెళ్లి తర్వాత సినిమాలు చేస్తుందా లేదా అనే సందేహం లో ఇన్ని రోజులు ఉన్నారు అభిమానులు. ఎందుకంటే ఈమె చిన్న హీరోయిన్ అయితే కాదు, బాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే దూసుకుపోతున్న యంగ్ హీరోయిన్స్ లో ఒకరు. యూత్ ఆడియన్స్ లో ఈమెకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. కాబట్టి ఇంకో నాలుగైదేళ్ళ సినిమాల్లో కొనసాగవచ్చు. అయితే ఇంతకు ముందు లాగా అందాల ఆరబోతల ఉండే పాత్రలు చేయదని, కేవలం నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను మాత్రమే చేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఆమె ఎలాంటి క్యారక్టర్ చేయడానికైనా సిద్దమే అన్నట్టుగా తన ఇన్ స్టాగ్రామ్ లో అప్లోడ్ చేస్తున్న ఫోటోలను చూస్తుంటే అర్థం అవుతుంది.

శోభిత హీరోయిన్ కాకముందు ఒక గొప్ప మోడల్. ఈమె మిస్ ఇండియా కిరీటాన్ని కూడా సొంతం చేసుకుంది. అందుకే ఈమె స్టైలింగ్ మొత్తం మిగిలిన హీరోయిన్స్ తో పోలిస్తే చాలా స్టైలిష్ గా ఉంటుంది. ఈమె స్టైలిష్ డిజైన్స్ కాస్ట్యూమ్స్ చూస్తే అసలు నిజంగానే ఈమె తెలుగు అమ్మాయేనా అనే సందేహాలు రాక తప్పదు. ఆ రేంజ్ లో ఉంటుంది. అయితే పెళ్లి తర్వాత కూడా ఈమె అదే రేంజ్ లుక్స్ తో ఫోటో షూట్ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. పెళ్లి డిసెంబర్ లో అయితే జనవరి నెలాఖరున ఈమె అప్లోడ్ చేసిన కొన్ని ఫోటోలు యూత్ ఆడియన్స్ కి మెంటలెక్కిపోయేలా చేసింది. ఆ ఫోటోలను మీరు కూడా క్రింద చూడొచ్చు. కేవలం అలాంటి ఫోటోలను మాత్రమే కాదు, ఆధ్యాత్మికత తెలిపే అంశాలను కూడా ఈమె అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది.

రీసెంట్ గానే ఈమె చెన్నై లోని రామాలయంలో కొన్ని ఫోటోలు దిగి సోషల్ మీడియా లో అప్లోడ్ చేసింది. ఒక మోడల్ గా ఎంత స్టైలిష్ గా కనిపించగలదో, అంతే సింపుల్ గా కూడా కనిపించగలదు ఈ అమ్మాయి. అదే ఈమె లో ఉన్న స్పెషాలిటీ. మన సంప్రాదయాలను తూచా తప్పకుండ అనుసరించడం లో ముందు ఉంటుంది. ఇది ఇలా ఉండగా ఈమె నాగ చైతన్య జీవితంలోకి అడుగుపెట్టిన తర్వాతనే ‘తండేల్’ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం వచ్చింది. ఈ సినిమాకు ముందు నాగ చైతన్య మాత్రమే కాదు, అక్కినేని ఫ్యామిలీ మొత్తం డిజాస్టర్ ఫ్లాప్స్ లోనే ఉంది. ‘తండేల్’ లాంటి ఒకే ఒక్క హిట్ తో మళ్ళీ అక్కినేని నాగ చైతన్య ఫామ్ లోకి రావడానికి ఒక విధంగా శోభిత పరోక్షంగా కారణం అయ్యిందని అంటున్నారు అభిమానులు.