Tollywood (2)
Tollywood: ఈ వారం మూవీ లవర్స్ కి పండగే. ఉగాది, రంజాన్ సీజన్స్ కలిసి రావడంతో దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లోని క్రేజీ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ చిత్రాలకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మొదలయ్యాయి. ఏ సినిమాకి ఎక్కువ అడ్వాన్స్ బుకింగ్స్ జరిగింది?, జనాలు ఏ చిత్రంపై ఎక్కువగా అమితాసక్తిని చూపిస్తున్నారు అనేది ఇప్పుడు చూద్దాం.
L2 – ఎంపురన్(L2 – Empuran):
2019 వ సంవత్సరం లో విడుదలైన మోహన్ లాల్(Mohanlal) లూసిఫర్ చిత్రానికి సీక్వెల్ ఇది. ప్రముఖ మలయాళం స్టార్ హీరో పృథ్వీ రాజ్ సుకుమారన్(Prudhvi Raj Sukumaran) ఈ చిత్రానికి దర్శకుడు. మలయాళం సినీ ఇండస్ట్రీ స్థాయి ని పెంచిన సినిమాకి సీక్వెల్ కావడంతో ఎంపురన్ కి క్రేజ్ మామూలుగా లేదు. ఈ వారం విడుదల అవుతున్న సినిమాలలో అత్యధిక అడ్వాన్స్ బుకింగ్స్ ని సొంతం చేసుకున్న చిత్రమిదియే. ఇప్పటికే 10 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా వచ్చాయని అంచనా.
Also Read: అవసరమైతే రష్మిక కూతురుతో కూడా నటిస్తా..మీ బాధ ఏంటి – సల్మాన్ ఖాన్
మ్యాడ్ స్క్వేర్(Mad Square):
ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా అడ్వాన్స్ బుకింగ్స్ జరగడం లేదు కానీ, ఓవర్సీస్ లో మాత్రం దుమ్ము లేచిపోయే రేంజ్ లో బుకింగ్స్ జరుగుతున్నాయి. కేవలం ఒక్క నార్త్ అమెరికా నుండే లక్షకు పైగా డాలర్ల గ్రాస్ వచ్చిందట. ఓవరాల్ ఓవర్సీస్ నుండి కోటి రూపాయలకు పైగా గ్రాస్ వచ్చిందని అంటున్నాడు. బుక్ మై షో లో ఈ చిత్రం ఇంకా ట్రెండింగ్ లోకి రాలేదు.
సికిందర్(Sikindar):
సల్మాన్ ఖాన్(Salman Khan) చాలా కాలం తర్వాత ఒక పర్ఫెక్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ తో మన ముందుకు రాబోతున్నాడు. బాలీవుడ్ ఆడియన్స్ కూడా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ ఇంకా ఇండియా లో ప్రారంభం కాలేదు కానీ, ఓవర్సీస్ లో వారం రోజుల ముందే మొదలైంది. రెస్పాన్స్ బాగానే ఉంది కానీ, ఆశించిన స్థాయిలో లేదు. సల్మాన్ ఖాన్ లాంటి సూపర్ స్టార్ కి ఇప్పుడు కచ్చితంగా మొదటి రోజు వంద కోట్ల గ్రాస్ వసూళ్లు రావాలి, ఇది ఆయన అభిమానులకు ఎంతో ప్రతిష్టాత్మకం. మరి ఆ రేంజ్ లో ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంటాడో లేదో చూడాలి. మార్చి 30 న ఈ చిత్రం మన ముందుకు రానుంది.
రాబిన్ హుడ్(Robin Hood):
భీష్మ లాంటి కమర్షియల్ బ్లాక్ బస్టర్ తర్వాత నితిన్, వెంకీ కుడుముల కాంబినేషన్ లో వచ్చిన చిత్రమిది. ఇప్పటి వరకు ఈ సినిమా నుండి విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది, సినిమా కూడా ఆ రేంజ్ రెస్పాన్స్ ని దక్కించుకుంటే నితిన్ కి సూపర్ హిట్ పడినట్టే అయితే ఈ చిత్రానికి ఎందుకో అడ్వాన్స్ బుకింగ్స్ ఆశించిన స్థాయిలో జరగడం లేదు. మార్చి 28 న విడుదల అవ్వబోతున్న ఈ సినిమా, రాబోయే రెండు రోజుల్లో అయిన బుకింగ్స్ విషయం లో పికప్ అవుతుందా లేదా అనేది చూడాలి.