Chanakya Nithi Telugu : అపర చాణక్యుడు ప్రజలకు అందించిన కొన్ని నీతిసూత్రాలు తమజీవితాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నాయి. కొందరు వీటిని పాటిస్తూ తమ జీవితాలను సుఖమయం చేసుకుంటున్నారు. ముఖ్యంగా భార్యభర్తల విషయంలో చాణక్యుడు కొన్ని నియమాలు చెప్పాడు. దంపతుల మధ్య కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలన్నారు. అప్పుడే ఇద్దరు అన్యోన్యంగా కలకాలం కలిసి ఉంటారని చెప్పారు. లేకుంటే పెళ్లయిన కొన్ని రోజులకే ఇద్దరి మధ్య విభేదాలు వస్తాయని తెలిపారు. అయితే పెళ్లయిన తరువాత భార్య భర్తల మధ్య ఎన్నో విషయాలు జరుగుతూ ఉంటాయి. కొందరు వీటిని పట్టించుకోకుండా అజాగ్రత్తగా ఉంటారు. దీంతో ఇద్దరి మధ్య నిత్యం గొడవలు జరుగూత ఉంటాయి. ఇంతకీ ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని చాణక్యుడు చెప్పాడు?
భార్యభర్తల బంధం పవిత్రమైనది. ఒక వ్యక్తి తన జీవితంలో ఒకభాగం తల్లిదండ్రుల వద్ద ఉంటే మరోభార భార్య లేదా భర్తతో కలిసి ఉంటారు. ఈ క్రమంలో జీవితాంతం కలిసి ఉండడానికొ కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలని చాణక్యుడు బోధించాడు. వీటిలో మొదటిది రహస్యం. భార్యభర్తల మధ్య కొన్ని రహస్యాలు ఉంటాయి. ఇవి బయటి వారికి అస్సలు చెప్పకూడదు. ఇవి బయటి వారికి చెప్పడం వల్ల కొన్నిసార్లు అలుసుగా తీసుకొని వారు దంపతులను ఇబ్బందులకు గురిచేసే అవకాశం ఉంది. ఈ క్రమంలో భర్తపై భార్యకు లేదా భార్యపై భర్తకు చెడు ప్రభావం ఏర్పడుతుంది. దీంతో ఇద్దరు దూరమయ్యే అవకాశం ఉంది.
చాలా సందర్భాల్లో భర్త లేదా భార్య అబద్దాలు చెబుతూ ఉంటారు. కొన్ని విషయాలు అబద్దాలు చెప్పడం వల్ల తాత్కాలికంగా ఉపశమనం చెందుతారు. అయితే ముఖ్యమైన విషయాల్లో అబద్ధం ఆడకుండా ఉండాలి. ఓ విషయపై అబద్ధం ఆడినప్పుడు… ఆ తరువాత అది నిజం అని తేలిన తరువాత ఇద్దరి మధ్య విభేదాలు ఏర్పడుతాయి. ఆ తరువాత నిజం చెప్పినా నమ్మని పరిస్థితి ఉండదు. ఒకవేళ ముందుగా అబద్ధం ఆడినా.. ఆ తరువాత లొంగిపోయి.. తాను తప్పు చేశానని ఒప్పుకుంటే ఎదుటివారు అర్థం చేసుకునే అవకాశం ఉంది. ఇలా అబద్ధం విషయంలో ఒక ఒప్పందం ఉండడం బెటర్.
నేటి కాలంలో డబ్బు లేనిది ఏ పని జరగదు. ప్రస్తుత కాలంలో పురుషులతో పాటు మహిళలో పోటీ పడి సంపాదిస్తున్నారు. అయితే భర్తతో సమానంగా భార్య సంపాదించినా.. డబ్బునే ప్రధానంగా చూడకూడదు. డబ్బు మాత్రమే జీవితం అనుకుంటే ఇద్దరి మధ్య ఆదాయం తేడా ఉండడంతో మనస్పర్థలు వస్తాయి. ఆ తరువాత ఒకరికొకరు గొడవపడి విడిపోయే అవకాశం ఉంది. ఈ విషయంలో ఎవరికి వారు స్వేచ్ఛగా ఉండే ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా ఖర్చుల విషయంలో ఒకరిపై ఒకరు ఆధిపత్యాన్ని కొనసాగించకుండా కలిసి ప్లాన్ చేసుకోవడం మంచిది.
పురుషులు ఎక్కువగా కొన్ని వ్యసనాల బారిన పడుతారు. సినిమాలు చూడడం, మద్యం, ధూమ పానం లాంటి వాటికి అడిక్ట్ అవుతారు.భార్యతో సంతోషకరమైన జీవితం కావాలనుకుంటే వీటికి దూరంగా ఉండడమే మంచిది. ఎందుకంటే కొందరు ఆడవాళ్లు ఇలాంటి వ్యసనాలు ఉన్న వారిని అసహించుకుంటారు. దీంతో ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. ఆ తరువాత వైవాహిక జీవితం విచ్ఛిన్నమవుతుంది.