Chanakya Niti: ఆచార్య చాణక్యుడు ఎన్నో విషయాలు చెప్పాడు. మనిషి నడుచుకోవాల్సిన తీరును వివరించాడు. దైనందిన జీవితంలో మనం ఎన్నో సమస్యలు ఎదుర్కొంటాం. వాటిని రహస్యంగానే ఉంచుకోవాలని సూచించాడు. సంఘంలో గౌరవ మర్యాదలతో బతకాలంటే కొన్ని విషయాలు గోప్యంగా ఉంచడమే మంచిది. ఇందుకోసం చాణక్యుడు పలు విధాలుగా వివరించాడు. జీవితంలో నిత్యం మనం ఎన్నో పనులు చేస్తుంటాం. ఎందరినో కలుస్తుంటాం. స్నేహితులు, బంధువులు, సహోద్యోగులు ఇలా పలు రకాలైన వ్యక్తులతో మనం సహవాసం చేయాల్సి ఉంటుంది. కానీ పొరపాటున కూడా మన వ్యక్తిగత విషయాలు ఇతరులకు చెప్పొద్దు.

ఆర్థిక సమస్యలు అందరికి ఉంటాయి. మనిషికి ఉన్న సమస్యల్లో ఎక్కువగా ఇబ్బంది పెట్టేవి ఆర్థిక సమస్యలే. దీంతో మనం మన ఆర్థిక సమస్యలను ఇతరులతో చర్చించకూడదు. ఒకవేళ చర్చిస్తే మన రహస్యాలు వారికి తెలిసిపోతాయి. చులకనగా చూస్తారు. ఎప్పుడు కూడా డబ్బులు లేవనే విషయం బహిర్గతం చేయకూడదు. అనుకోని సమయాల్లో అలా చేస్తే ఇక మీపై ఉన్న గౌరవ మర్యాదలు పోతాయి. మిమ్మల్ని నీచంగా చూస్తారు. అందుకే మన ఆర్థిక ఇబ్బందులను ఎప్పుడు కూడా బయటి వారితో అసలు మాట్లాడకూడదు.
ఇటీవల కాలంలో అనారోగ్య సమస్యలు అందరిని పీడిస్తున్నాయి. మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బులు, థైరాయిడ్ వంటి సమస్యలు నిత్యం వేధిస్తున్నాయి. మనం ఎక్కడ కూడా మన అనారోగ్యం గురించి డిస్కషన్ చేయకూడదు. మనకు రోగం ఉందని తెలిస్తే హేళన చేస్తారు. నలుగురు నవ్వుకుంటారు. మనం లేని సమయంలో వాడు రోగిష్టి అని తిట్టుకుంటారు. అందుకే ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఫలానా రోగంతో బాధపడుతున్నామని తెలియనివ్వరాదు. ప్రస్తుతం జరుగుతున్న రీతులను ఆనాడే చాణక్యుడు వివరించాడు.

ఇక మన జీవిత భాగస్వామి భార్య. ఇంట్లో ఉండే భార్య గురించి ఎప్పుడు కూడా బయటి వారితో చర్చించకూడదు. మన భార్య మన సొంతం. ఎదుటి వారి ముందు భార్య రహస్యాలు చెబితే ఆమె వ్యక్తిగత జీవితానికి భంగం కలుగుతుంది. పైగా పరాయి స్త్రీ మోజులో పడేవారు చాలా మంది ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మన భార్య రహస్యాలు బయటి వారితో పంచుకోకూడదు. సాధ్యమైనంత వరకు గోప్యంగా ఉంచడమే శ్రేయస్కరం. అంతేకాని స్నేహితుడు అని భార్య విషయాలు చెప్పడం సభ్యత కాదని ఆచార్య చాణక్యుడు ఆనాడే విశదీకరించాడు.
మనకు ఎక్కడైనా పొరపాటున ఏదైనా అవమానం జరిగితే దాన్ని ఎప్పుడు కూడా బయట పెట్టరాదు. నువ్వు స్నేహితులకు చెబితే అది ఏదో ఒక సందర్భంలో బయటపెట్టి నిన్ను బ్లాక్ మెయిల్ చేస్తారు. అందుకే పొరపాటున కూడా మనకు జరిగిన ఏ చిన్న అవమానాన్నైనా పంచుకోకూడదు. మన వ్యక్తిగత విషయాలు ఎవరితో చెప్పడం భావ్యం కాదు. కానీ కొంతమంది లూజ్ టాక్ వాళ్లుంటారు. వారు అన్ని విషయాలు ఇతరులతో పంచుకుంటారు. దీంతో భవిష్యత్ లోవారికి ముప్పు ఉంటుందనే విషయం మరిచిపోతారు.
ఆచార్య చాణక్యుడు దూరదృష్టితో ఎన్నో విషయాలు చెప్పాడు. అతడు సూచించిన వాటి ప్రకారమే ఇప్పుడు నడుస్తున్న పరిస్థితులు ఉండటం గమనార్హం. ఆనాడే భవిష్యత్ గురించి ఆలోచించి మనకు అర్థం కాని ఎన్నో విషయాలను తనదైన శైలిలో ఆలోచించి పరిష్కార మార్గాలు కూడా సూచించాడు. చాణక్యుడి సూచనల మేరకు మనం నడుచుకుంటే ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు.