Pawan Kalyan- Modi: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు గత కొద్దీ రోజుల నుండి ఎంత హీట్ వాతావరణం లో కొనసాగుతున్నాయి మన అందరం చూస్తూనే ఉన్నాము..జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే ఉత్తరాంద్రలో పవన్ కళ్యాణ్ జనవాణి కార్యక్రమం మొదలు పెట్టాడో..అప్పటి నుండి రాష్ట్ర రాజకీయాల ముఖ చిత్రమే మారిపోయింది.

ఒక పథకం ప్రకారం జనసేన కార్యకర్తల సమూహం ఉన్న చోట వైసీపీ ఎంపీలు దూరడం..జనసేన కార్యకర్తలు వైసీపీ ఎంపీ లపై దాడులు చేసారని అక్రమం గా ఉత్తరాంధ్ర జనసేన నాయకులు మీద హత్యాయత్నం కేసులు పెట్టడం..పవన్ కళ్యాణ్ అలుపెరగని పోరాటం చేసి అందరిని జైలు నుండి విడిపించడం.
ఆ తర్వాత ఇప్పటం గ్రామా పంచాయితి లో వైసీపీ పార్టీ జనాల ఇళ్ళని కూల్చివేయడం..పవన్ కళ్యాణ్ ఆ గ్రామాన్ని సందర్శించి నష్టపోయిన కుటుంబాలను పరామర్శించి ప్రతి ఒక్కరికి లక్ష రూపాయిల ఆర్ధిక సహాయం అందించడం..ఇలా వరుస పరిణామాల మధ్య వైసీపీ పార్టీ తీవ్రమైన వ్యతిరేకత మూటగట్టుకోగా..జనసేన పార్టీ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది.

జరిగిన ఈ సంఘటనలు అన్ని గమనిస్తే ఇక భవిష్యత్తులో వైసీపీ మరియు జనసేన పార్టీ మధ్య హోరాహోరీ పోటీ నడవబోతుందని తెలుస్తుంది..ఇది ఇలా ఉండగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు విశాఖపట్నం లో రెండు రోజుల పర్యటించనున్నారు..ఈ పర్యటనలో భాగం గా ఈరోజు రాత్రి 8 గంటల 30 నిమిషాలకు పవన్ కళ్యాణ్ తో ప్రధానమంత్రి సుమారు గంట పాటు భేటీ కానున్నారు..ఎక్కడైతే వైసీపీ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ మీద జనసేన పార్టీ మీద దౌర్జన్యాలు చెయ్యాలని చూసిందో అక్కడే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ని కలవబోతుండడం ఇప్పుడు అధికార వైసీపీ పార్టీ కి ముచ్చమటలు పట్టిస్తుంది.
ఇటీవల కాలం లో ఆంధ్ర ప్రదేశ్ లో చోటు చేసుకున్న పరిణామాలన్నీ ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లనున్నారు పవన్ కళ్యాణ్..అంతే కాకుండా పొత్తులో భాగంగా భవిష్యత్తులో ఎలా కలిసి ముందుకు పోవాలి అనేది కూడా ఈ భేటీ లో చర్చకు రాబోతుంది..ఈ చర్చ రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి మార్పుని తీసుకొస్తుందో చూడాలి.