https://oktelugu.com/

Chanakya Niti: చాణక్య నీతి: అమ్మాయిలను ఆకర్షించాలంటే ఇవి పక్కా ఉండాలి

సాధారణ స్వభావం.. అప్పటికే ఎన్నో సమస్యలను ఎదుర్కొని ఉంటారు అమ్మాయిలు. సడన్ గా మీరు ఎంట్రీ అయితే మీ లైఫ్ లో కూడా కష్టాలు ఉన్నాయి అని తెలిస్తే పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరట.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : April 3, 2024 / 03:16 PM IST

    How To Attract A Woman

    Follow us on

    Chanakya Niti: అందం ఉంటే మాత్రమే సరిపోదు మరికొన్ని ముఖ్యమైన క్వాలిటీలు ఉంటేనే ఇతరులను ఆకర్షించగలుగుతారు. మరి స్త్రీ పురుషుల ఆకర్షణ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అరె మామ నేను కూడా అందంగానే ఉన్నా కదరా పోరి ఎందుకు నాకు పడటం లేదు అంటూ మీలో ఎవరైనా ఫ్రెండ్ ను అడిగారా? అయితే అమ్మాయిలు ఆకర్షించాలంటే చాణక్యుడు ఓ సీక్రెట్ చెప్పాడు. మరి అవేంటో తెలుసుకోండి.

    సాధారణ స్వభావం.. అప్పటికే ఎన్నో సమస్యలను ఎదుర్కొని ఉంటారు అమ్మాయిలు. సడన్ గా మీరు ఎంట్రీ అయితే మీ లైఫ్ లో కూడా కష్టాలు ఉన్నాయి అని తెలిస్తే పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరట. సాధారణ స్వభావం గల వ్యక్తులు, జీవితంలో కష్టాలను తేలికగా చేసే పురుషులను అమ్మాయిలు ఇష్టపడుతారు అని తెలిపారు చాణక్యుడు. ఆడంబరాలకు పోకుండా నిర్ణయాత్మక సామర్ధ్యం కలిగి ఉండాలట. అంతేకాదు జీవితం గురించి ఓ క్లారిటీ ఉండాలట.

    ధైర్యం..ధైర్యం ఉన్న వ్యక్తులనే మహిళలు ఇష్టపడుతారు. ఎలాంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినా వారిని వదిలిపెట్టరు అని నమ్ముతారు. వారి ప్రేమను ధైర్యంగా కాపాడుకుంటారు. చిన్న విషయాలకు భయపడే పురుషుల కంటే తమకు కవచంగా నిలిచే పురుషులనే ఎక్కువ ఇష్టపడుతారని తెలిపారు చాణక్యుడు.

    అహంకారం ఉండకూడదు.. అహం ఒక వ్యక్తిని స్థారపరుడిగా, సంబంధాల పట్ల ఉదాసీనంగా చేస్తోందని నమ్ముతారు. అహం లేని పురుషులను తమ భాగస్వామిగా చేసుకుని వారిని ఎంతో ఇష్టపడతారు భార్యలు. వారి అవసరాలను ప్రేమతో తీరుస్తారు. ఆకర్షణీయమైన వ్యక్తిత్వం ఉండాలంటే అహాన్ని విడిచిపెట్టాలి. స్త్రీలకు డౌన్ టు ఎర్త్ ఉండే పురుషులు అంటే మరింత ఇష్టం అని గుర్తు పెట్టుకోండని వివరించారు చాణక్యుడు.

    గొప్ప వ్యక్తిత్వం.. మహిళలు గొప్ప వ్యక్తిత్వం ఉన్నవారినే ఇష్టపడుతారు. స్వరం, స్త్రీలతో వారి ప్రవర్తన, వంటి ఇతర చిన్న విషయాల మీద కూడా శ్రద్ధ చూపుతారు మహిళలు. అందువల్ల పురుషులు ఈ విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. నిజానికి స్త్రీలు చిన్న విషయాలకు కూడా ప్రాధాన్యత ఎక్కువ ఇస్తుంటారు కాబట్టి చిన్న విషయాలే కదా అని లైట్ తీసుకోకుండి.