https://oktelugu.com/

Maruthi Cars: అమ్మకాల్లో మారుతి జోరు.. గతేడాది ఎన్ని కార్లు అమ్మారంటే?

2023 -24 ఆర్థిక సంవత్సరానికి మారుతి సుజుకి 2,135,322 యూనిట్లను అమ్మకాలు చేసింది. ఇందులో అత్యధికంగా దేశీయ విక్రయాలు 1,793, 644 యూనిట్లు ఉన్నాయి.

Written By:
  • Srinivas
  • , Updated On : April 3, 2024 3:13 pm
    Maruthi ertiga 7 seater car

    Maruthi ertiga 7 seater car

    Follow us on

    Maruthi Cars:  మారుతి కార్లు అనగానే ఎవరైనా లైక్ చేస్తారు. సామాన్యులు సైతం కొనే కార్లను మారుతి కంపెనీ మార్కెట్లోకి తీసుకొస్తుంది. ఈ తరుణంలో కంపెనీ అమ్మకాలు జోరందుకుంటాయి. కొన్నేళ్లుగా మారుతికి చెందిన కార్లు విపరీతంగా అమ్మకాలు జరుపుకుంటూ నెంబర్ వన్ స్థానంలో నిలుస్తున్నాయి. ఇదే సమయంలో కొత్త కొత్త మోడళ్లను వినియోగదారులకు పరిచయం చేస్తూ ఆకటటుకుంటోంది. తాజాగా విడుదలయిన లెక్కల ప్రకారం మారుతి కార్లు అత్యధికంగా సేల్స్ జరుపుకున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

    హ్యాచ్ బ్యాక్ నుంచి ఎస్ యూవీ వరకు వివిధ వేరియంట్లను మారుతి ఉత్పత్తి చేస్తుంది. అన్ని రకాల కార్లను అందుబాటలోకి తీసుకురావడం వల్ల మారుతిని వినియోగదారులు ఆదరిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో మారుతి సుజుకీ ఎగ్జిక్యూటీ కమిటీ సభ్యుడు శశాంక్ శ్రీ వాస్తవ్ అమ్మకాల గురించి ఆసక్తికర విషయాలను బయటపెట్టారు. 2023 -24 ఆర్థిక సంవత్సరానికి మారుతి సుజుకి 2,135,322 యూనిట్లను అమ్మకాలు చేసింది. ఇందులో అత్యధికంగా దేశీయ విక్రయాలు 1,793, 644 యూనిట్లు ఉన్నాయి. ఎగుమతులు 283,067 ఉన్నాయి.

    వివిధ మోడళ్లు మారుతి నుంచి రిలీజ్ అయినా ఈ ఏడాది మాత్రం హ్యాచ్ బ్యాక్ లు, సెడాన్ ల కంటే ఎస్ యూవీ అమ్మకాలు పెరిగాయి. గతంలో మారుతి వ్యాగన్ ఆర్ అత్యధికంగా సేల్స్ నమోదు చేసుకున్నప్పటికీ 2023-24లో మాత్రం స్వల్పంగా క్షీణించింది. SUV విభాగాలను ఆదరిస్తున్న క్రమంలో గ్రాండ్ విటారా, బ్రెజ్జా, ఫ్రాంటెక్స్ ను ఆదరించే అవకాశం ఉందని తెలుస్తోంది. పట్టణాలతో పాటు గ్రామాల్లోనూ ఎస్ యూవీ కార్లను కోరుకుంటున్నారు. ముఖ్యంగా సీఎన్ జీ వెర్షన్ ను ఎక్కువగా ఆదరిస్తున్నారు.

    ఎస్ యూవీలతో పాటు ఎంపీవీలు కూడా వృద్ధిని సాధించాయి. మారుతి సుజుకీ పోర్ట్ పోలియోలో ఎర్టిగా కారు 4 నెలల వేటింగ్ పీరియడ్ ను కలిగి ఉంది. కానీ గ్రాండ్ విటారా వంటి ఎస్ యూవీలు అంతకంటే ఎక్కువ కాలం వెయిటింగ్ పీరియడ్ ను నమోదు చేసుకున్నాయి. దీనిని బట్టి చూస్తే ఎస్ యూవీలను ఎక్కువగా ఆదరిస్తున్నారని తెలుస్తోంది. అయితే మారుతి నుంచి ఎస్ యూవీలు మాత్రమే కాకుండా ఈవీల ఉత్పత్తులు కూడా పెంచే అవకాశం ఉందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.