YS Sharmila Vs Avinash: వైఎస్ షర్మిల vs వైఎస్ అవినాష్.. ఇరకాటంలో సీఎం జగన్.. ఎవరికి మద్దతు?

కాంగ్రెస్ పార్టీతో తెలుగు దేశానికి సైద్దాంతిక విభేదం. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టుకొచ్చిందే తెలుగుదేశం. అందుకే ఆ రెండు పార్టీల మధ్య పొత్తు వర్కౌట్ కాలేదు.

Written By: Dharma, Updated On : April 3, 2024 3:18 pm

YS Sharmila Vs Avinash

Follow us on

YS Sharmila Vs Avinash: కాంగ్రెస్ పార్టీ నుంచి పుట్టుకొచ్చింది వైసిపి. నాయకులు వేరువేరు పార్టీల నుంచి వచ్చి వైసీపీలో చేరి ఉండొచ్చు. కానీ అక్కడ ఉన్నది కాంగ్రెస్ క్యాడర్. రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీ నాశనమైంది. కాంగ్రెస్ ఓటు బ్యాంకు వైసీపీలోకి మళ్ళింది. వివిధ పార్టీల నుంచి వచ్చిన నేతలతో బలోపేతం అయ్యింది. రాష్ట్ర అవసరాలు, పరిస్థితులు రీత్యా ప్రజలు వైసిపి వైపు మొగ్గు చూపారు. అయితే ఇప్పుడు షర్మిల నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ వైసీపీకి గట్టి సవాల్ విసురుతోంది. ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా బలమైన అభ్యర్థులను బరిలో దించుతోంది. తప్పకుండాప్రభుత్వ సానుకూల ఓట్లను కాంగ్రెస్ పార్టీ చీల్చుతుందని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.

కాంగ్రెస్ పార్టీతో తెలుగు దేశానికి సైద్దాంతిక విభేదం. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టుకొచ్చిందే తెలుగుదేశం. అందుకే ఆ రెండు పార్టీల మధ్య పొత్తు వర్కౌట్ కాలేదు. 2018లో తెలంగాణలో, 2019లో ఏపీలో ఆ రెండు పార్టీల మధ్య పొత్తు అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ ఓటు బ్యాంకు తెలుగుదేశం వైపు వెళ్లదు. టిడిపి ఓటు బ్యాంకు కాంగ్రెస్ వైపు రాదు. అయితే వైసిపి విషయానికి వచ్చేసరికి అలా కాదు. నాయకత్వానికి విభేదించి వైసిపి ఏర్పాటు చేశారు జగన్. కానీ ఆ పార్టీలో చేరింది కాంగ్రెస్ క్యాడర్. గత రెండు ఎన్నికల్లో కాంగ్రెస్ క్యాడర్ అంతా వైసిపికి ఓటు వేసింది. కాంగ్రెస్ కి సరైన నాయకత్వం లేకపోవడం వల్లే అలా చేసింది. కానీ ఇప్పుడు షర్మిల నేతృత్వంలో సరైన నాయకత్వం కనిపిస్తోంది. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది. అటు బలమైన అభ్యర్థులు బరిలో దిగుతున్నారు.

ఇప్పటికే మూడు పార్టీలు కూటమి కట్టడంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు కచ్చితంగా అటువైపు వెళుతుంది. ప్రభుత్వ సానుకూల ఓట్లు మాత్రం భారీగా చీలిక వస్తుందని అంచనా ఉంది. వైయస్ కుటుంబంలో జరిగిన పరిణామాలు, ఆ కుటుంబానికి చెందిన మహిళ నేత షర్మిల కావడంతో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అవుతాయని అంచనా ఉంది. మరోవైపు కడప నుంచి షర్మిల, బాపట్ల నుంచి జీడీ శీలం, కాకినాడ నుంచి పల్లం రాజు, శ్రీకాకుళం నుంచి కిల్లి కృపారాణి లాంటి నేతలు పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఐదు నుంచి పదివేల వరకు ఓట్లు చీల్చితే మాత్రం వైసీపీకి దారుణ దెబ్బ తప్పదు. అందుకే జగన్ సైతం అలర్ట్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ వల్ల జరిగే నష్టాన్ని అంచనా వేసి దిద్దుబాటు చర్యలకు ఉపక్రమిస్తున్నారు. అయితే అవి ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.