https://oktelugu.com/

Chanakya Niti : భార్య గురించి ఈ విషయాలు ఇతరులకు చెప్పడం వల్ల.. ఎలాంటి అనర్ధాలు తెలుసా?

Chanakya Niti : భర్త గురించి భార్య.. భార్య గురించి భర్త ఇతరులకు కొన్ని విషయాలు చెప్పడం వల్ల జీవితం చిన్నపిన్నమవుతుంది. అయితే ఈ నాలుగు విషయాలు భార్య గురించి ఇతరులకు చెప్పడం వల్ల దంపతుల జీవితం నాశనం అవుతుందని చాణిక్యనీతి తెలుపుతుంది. అవేంటో తెలుసుకుందాం..

Written By: , Updated On : March 26, 2025 / 02:00 AM IST
Chanakya Niti

Chanakya Niti

Follow us on

Chanakya Niti చాణక్యుడు రాజనీతి శాస్త్రం గురించే కాకుండా మనుషుల జీవితాల గురించి ఎన్నో విషయాలను ప్రజలకు అందించారు. ముఖ్యంగా దాంపత్య జీవితం గురించి చాణక్యుడు చెప్పిన కొన్ని చుట్టాలను చాలామంది ఫాలో అవుతూ వస్తున్నారు. పెళ్లి కాకముందు తల్లిదండ్రుల పై ఆధారపడే వ్యక్తులు పెళ్లయిన తర్వాత బాధ్యతతో ఉంటారు. ఈ క్రమంలో ఎన్నో కష్టాలను సుఖాలను అనుభవిస్తారు. అంతేకాకుండా బాధ్యత తెలిసి కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా దంపతుల్లో ఇద్దరు ఒకరిపై ఒకరు నమ్మకం పెంచుకొని జీవితాన్ని ముందుకు సాగించాల్సి ఉంటుంది. ఈ సమయంలో భార్యాభర్తలు కొన్ని రహస్యాలను బయటకు చెప్పకుండా ఉండాలి. ముఖ్యంగా భారత గురించి భార్య.. భార్య గురించి భర్త ఇతరులకు కొన్ని విషయాలు చెప్పడం వల్ల జీవితం చిన్నపిన్నమవుతుంది. అయితే ఈ నాలుగు విషయాలు భార్య గురించి ఇతరులకు చెప్పడం వల్ల దంపతుల జీవితం నాశనం అవుతుందని చాణిక్యనీతి తెలుపుతుంది. అవేంటో తెలుసుకుందాం..

Also Read : చాణక్య నీతి ఈ ఐదు రకాల బంధువులకు దూరంగా ఉండాలి..

భార్యాభర్తల మధ్య ఎన్నో గొడవలు ఉంటాయి. మీ చిన్నవిగా ఉండొచ్చు. లేదా పెద్దవిగా ఉండొచ్చు. అయితే ఈరోజు జరిగిన గొడవ రేపటితో సమస్య పోతుంది. అలా సమసి పోయేలా ఒకరి మధ్య ఒకరికి అండర్స్టాండింగ్ ఉండాలి. అయితే ఇలా జరిగిన గొడవను స్నేహితులకు లేదా బంధువులకు చెప్పడం వల్ల తీవ్ర నష్టాలను ఎదుర్కొంటారు. ఎందుకంటే వారు తమదైన శైలిలో సలహాలు ఇస్తూ ఉంటారు. ఈ సలహాలు పాటించడం వల్ల భర్త తన భార్య నుంచి గౌరవం కోల్పోతాడు. ఇది భవిష్యత్తులో వారి జీవితానికి ఎదురు దెబ్బలాంటిది అవుతుంది.

సమాజంలో మనుషులు ఎన్నో రకాలుగా ఉంటారు. వారి ప్రవర్తన కూడా విభిన్నంగా ఉంటుంది. అయితే వీరు దంపతులు అయితే ఒకరినొకరు అర్థం చేసుకొని… ఒకరి లోపాలను ఒకరు సరి చేసుకుని ముందుకు సాగాలి. భార్యలోని లోపాన్ని ఇతరులకు చెప్పడం వల్ల భర్తకే అవమానం అవుతుంది. దీనిపై అందరూ చెడుగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఫలితంగా కుటుంబానికి చెడ్డ పేరు వస్తుంది. ఇది భవిష్యత్తులో పిల్లలపై ప్రభావం పడుతుంది. అందువల్ల భార్యకు ఉన్న లోపాల గురించి స్నేహితులకు లేదా బంధువులకు చెప్పొద్దు. ఇలా చెప్పడం వల్ల ఎప్పటికైనా నష్టమే కలుగుతుంది..

భార్యాభర్తల మధ్య ఎన్ని గొడవలు ఉన్నా అవి ఇంటి వరకే పరిమితం కావాలి. అయితే బంధువులు లేదా స్నేహితులు ఇంటికి వచ్చినప్పుడు లేదా భార్యాభర్తలు బయటకు వెళ్లినప్పుడు అందరి ముందు భార్యను తిట్టడం లేదా దూషించడం వంటివి చేయడం మానుకోవాలి. ఇలా చేయడం వల్ల సమాజంలో భార్యా విలువ తగ్గించినట్లు అవుతుంది. అయితే ఇది అవమానంగా ఫీల్ అయి భార్య తర్వాత భర్తను దూరం పెడుతుంది. ఇలా క్రమంగా ఇద్దరి మధ్య మరింత దూరం పెరిగే పిల్లలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అందువల్ల పదిమందిలో భార్యను తిట్టడం లేదా దూషించే ప్రయత్నాలు చేయొద్దు.

భార్యపై పదేపదే కోపాన్ని తెచ్చుకోకుండా ఉండాలి. అయితే సందర్భానుసారం కోపం వస్తే పర్వాలేదు. కానీ చీటికిమాటికి కోపం తెచ్చుకోవడం వల్ల భార్య మనసులో ప్రతికూల భవనం ఏర్పడుతుంది. దీంతో సంసారం పై ప్రభావం పడి చిన్న భిన్నం అవుతుంది. ఇలాంటి కోపం గురించి కూడా ఇతరులకు చెప్పకుండా ఉండాలి.

Tags