Chanakya Niti: ఆచార్య చాణక్య చెప్పిన నీతి సూత్రాలను చాలామంది పాటిస్తూ సంతోషంగా జీవనం సాగిస్తున్న సంగతి తెలిసిందే. చాణుక్యుడు పురుషులకు, స్త్రీలకు ఏ సందర్భంలో ఏ విధంగా మెలగాలో ఎలాంటి తప్పులు చేయకూడదో వివరంగా చెప్పారు. పురుషుడు తన జీవితంలో మూడు తప్పులను మాత్రం అస్సలు చేయకూడదు. ఒకవేళ ఈ తప్పులు చేస్తే మాత్రం ఇబ్బందులు పడక తప్పదు. పురుషుడు ప్రేమ విషయంలో ఎల్లప్పుడూ ధైర్యంగా వ్యవహరించాలి.
అమ్మాయికి ప్రేమను తెలియజేసే విషయంలో అబ్బాయిలు కంగారు పడకూడదు. ధైర్యంగా, సిగ్గు పడకుండా ప్రేమను వెల్లడిస్తే మంచిది. అమ్మాయికి ప్రేమను చెప్పే సమయంలో ఆ అమ్మాయి అభిప్రాయానికి కూడా విలువ ఇవ్వడంతో పాటు ఆమె మనస్సులో ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేస్తే మంచిదని చెప్పవచ్చు. ప్రేమను వ్యక్తపరిచే విషయంలో భయపడితే మాత్రం ప్రేమలో ఎప్పటికీ సక్సెస్ కాలేరు.
Also Read: నూతన జిల్లాల ఏర్పాటుతో వైసీపీకి తలనొప్పులేనా?
భార్యతో ఏకాంతంగా ఉన్న సమయంలో పురుషుడు సిగ్గు పడకూడదు. సిగ్గు పడితే భార్య నుంచి గౌరవం పొందలేరని గుర్తుంచుకోవాలి. సిగ్గు పడటం వల్ల భార్యాభర్తల మధ్య దూరం పెరగడంతో పాటు అపార్థాలు చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయి. దుఃఖం, పేదరికం, కఠిన పరీక్షలు ఎదురైన సమయంలో పురుషుడు భయపడకుండా జీవనం సాగిస్తే మంచిదని చెప్పవచ్చు.
అలాంటి పరిస్థితులు ఎదురైతే భయపడకుండా సమస్యలను పరిష్కరించుకుంటే మంచిది. ఇలా ఉండటం వల్ల భార్యకు నమ్మకం కలిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ప్రతి చిన్న విషయానికి ఫీలైతే ఇబ్బందులు పడక తప్పదు. పురుషుడు ఈ విషయాలలో తప్పులు చేస్తే జీవితాంతం బాధ పడాల్సి ఉంటుందని చెప్పవచ్చు.
Also Read: ఎన్టీఆర్ ఇమేజ్‌ను వాడుకునే పనిలో జగన్.. పెద్ద ప్లానే వేశారే..!