Chanakya Niti Husband And Wife: ఆచార్య చాణక్యుడు వైవాహిక బంధం బలపడాలంటే ఏం చేయాలో సూచించాడు. పదికాలాల పాటు దంపతులు గొడవలు లేకుండా ఉండాలంటే జాగ్రత్తలు పాటించాలి. వారి జీవితంలో సుఖసంతోషాలు వెల్లివిరియాలంటే కూడా కొన్ని విషయాలు పట్టించుకోవాలి. భార్యాభర్తల్లో బంధం బలపడాలంటే ఇద్దరి అవగాహన ఉండాలి. అన్యోన్యత పెరగాలి. అనురాగం పెరిగితే ప్రేమానుబంధాలు బలపడతాయి. దీని వల్ల మనకు జీవితంలో ఇబ్బందులు ఎదురవకుండా ఉంటాయి.
ఇద్దరు గౌరవించుకోవాలి
దంపతులు ఇద్దరు పరస్పరం గౌరవించుకోవాలి. వారి ఆలోచనలు పంచుకోవాలి. ఇద్దరి మధ్య భావాలు అర్థం చేసుకోవాలి. జీవిత భాగస్వామికి అన్ని పనుల్లో తోడుండాలి. ఇద్దరి మధ్య సన్నిహిత్యం పెరగాలి. సఖ్యత ఇనుమడించాలి. అప్పుడే వారి అభిప్రాయాల్లో అరమరికలు లేకుండా సమన్వయంగా నడుచుకుంటే ఇద్దరి మధ్య విభేదాలు రాకుండా ఉంటుంది.
విశ్వాసం
భార్యాభర్తల మధ్య విశ్వాసం ఉండాలి. ప్రేమకు నమ్మకం పునాది అనుమానం సమాధి. అందుకే ఇద్దరి మధ్య బంధం బలపడాలంటే నమ్మకమే ప్రధానం. భాగస్వామికి నమ్మకద్రోహం లేకుండా చూసుకోవాలి. నమ్మకం లేని సంబంధం బలహీనంగా మారుతుంది. ఈనేపథ్యంలో దంపతుల మధ్య అనురాగం పెరగకపోతే ఇబ్బందులు వస్తాయి.
క్షమాగుణం
వివాహ బంధంలో సహనం, క్షమాపణ కామన్. ఏ తప్పు జరిగినా సారీ చెబితే సర్దుకుపోవచ్చు. జీవిత భాగస్వామిలోని లోపాలను ఎత్తి చూపకుండా ఓపిక పట్టాలి. తప్పు జరిగితే క్షమించడమని అడగడంలో ఇగో చూపించొద్దు. మన వల్ల తప్పు జరిగితే క్షమించమని అడగడంలో తప్పు లేదు. ఇలా చేయడం వల్ల ఇద్దరి మధ్య సంబంధం పెరుగుతుంది.
ఆచార్య చాణక్యుడు భార్యాభర్తల బంధం బలపడాలంటే కొన్ని టిప్స్ పాటించాలి. లేకపోతే సంసారంలో కలతలు రావచ్చు. దంపతుల మధ్య సఖ్యత పెరగడానికి పలు రకాల చర్యలు తీసుకోవాలి. ఇలా సంసారంలో ఆలుమగల మధ్య అనురాగం పెరగడానికి కారణమవుతుంది.