Chanakya Niti: ఆచార్య చాణక్యుడు మనిషి దైనందిన జీవితంలో ఎదురయ్యే ఎన్నో సంఘటనలకు పరిష్కార మార్గాలు సూచించాడు. ఆనాడే తన నీతిశాస్త్రం ద్వారా చాలా విషయాలు చెప్పాడు. మనిషి ఎలా ముందుకు వెళ్లాలి? ఎలాంటి సమస్యలను దాటాలి? ఎలాంటి చతురతతో ఉంటే బాధలు లేకుండా సంతోషకరమైన జీవితాన్ని అనుభవించేందుక కావాల్సిన వాటిని వివరంగా చెప్పాడు. ఆనాడు అతడు సూచించిన మార్గాలు నేటికి అనుసరణీయంగానే ఉంటున్నాయి.
కోపం
తన కోపమే తన శత్రువు అన్నారు. ఎంత ప్రశాంతంగా ఉంటే అంత మంచి జరుగుతుంది. ఎంత కోపం ఉంటే అంత మంది శత్రువులు కూడా ఉంటారు. ద్వేషం ద్వేషాన్ని పెంచుతుంది. కోపం కోపాన్ని పెంచుతుంది. శాంతం ప్రశాంతతను కలిగిస్తుంది. నోరు మంచిదైతే ఊరు మంచిదైతది అంటారు. మన నోరు అదుపులో ఉంచుకోవాలి. అందుకే నోరు ఆడినట్లు నొసలు ఆడదంటారు.
డబ్బు
డబ్బు అందరికి అవసరమే. డబ్బు లేకపోతే మనుగడ ఉండదు. బతకడానికి డబ్బు కావాలి. కానీ అది అక్రమాల ద్వారా కాదు. కష్టపడి సంపాదించాలి. అప్పుడే దానికి సార్థకత ఉంటుంది. ఇతరులను మోసం చేసి సంపాదిస్తే రేపు నిన్ను కూడా మరొకడు మోసం చేస్తాడు. తాడి దన్నే వాడి తలదన్నే వాడుంటాడు. అందుకే ధర్మబద్ధంగా సంపాదించేదే డబ్బు. అక్రమంగా సంపాదించేది డబ్బు కాదు పాపం. ఎవరినో మోసం చేసి సంపాదిస్తే ఆ మోసమే నిన్ను దహిస్తుంది.
ధర్మం
ధర్మో రక్షితో రక్షిత: ధర్మాన్ని నీవు కాపాడితే అదే నిన్ను రక్షిస్తుంది. కానీ నీవు ధర్మబద్ధంగా లేకపోతే నిన్ను ఎవరు గౌరవించారు. ఎవరు కూడా నీ మాట వినరు. జీవితంలో సక్రమమైన మార్గంలో పయనిస్తే అందరు నీ తోడుగా నిలుస్తారు. ఆధ్యాత్మిక, దైవ చింతన లేకపోతే మనిషి ఎదుగుదల కష్టంగా కూడుకుంటుంది. మంచి పద్ధతుల్లో ఉంటే నీకు అవి శ్రీరామ రక్షగా నిలిచి ఆదుకుంటాయి.
మోక్షం
మనిషి చివరి దశ మోక్షం. ఈ కాలంలో ప్రతి వ్యక్తి మంచి కర్మలను ఆచరించాలి. నిర్మలమైన మనసుతో భగవత్ ధ్యానంలో గడిపితే మంచి మోక్షం లభిస్తుంది. అదే నీకు అండగా నిలుస్తుంది. నీ జీవితానికి పరాకాష్టగా నిలుస్తుంది. ఇన్నాళ్లు మిడిసిపడిన చరమాంకంలో మాత్రం దైవాన్ని స్మరించుకుంటేనే మంచిది. లేకపోతే మంచి కర్మ దక్కదు.