Chanakya Niti Woman: ఆచార్య చాణక్యుడు మనకు ఎన్నో విషయాలు నేర్పాడు. 400 ఏళ్ల కింద అతడు చెప్పిన నీతి వాక్యాలు ఇప్పటికి కూడా మనకు అనుసరణీయంగా ఉన్నాయంటే అతడు ఎంత ముందుచూపుతో చెప్పాడో అర్థమవుతోంది. తన నీతి శాస్త్రంలో చాణక్యుడు మనిషి జీవితంలో చేయకూడని తప్పులను సూచించాడు. జీవితలో కష్టాలు ఎదురైనప్పుడు ఎలా ఉండాలో కూడా చెప్పడం గమనార్హం. దీంతో ఆచార్య చాణక్యుడు కొందరిని నమ్మకూడదని స్పష్టంగా బోధించాడు. వారు ఎవరంటే..
మంచిప్రవర్తన లేని స్త్రీ
ఎప్పుడు కూడా ఆడవారిని నమ్మొద్దనే చెబుతాడు చాణక్యుడు. వారి బుద్ధి వేరేలా ఉంటుంది. సముద్రం లోతు తెలుసుకోవచ్చు కానీ ఆడదాని మనసు తెలుసుకోవడం ఎవరి తరం కాదు. ఈ నేపథ్యంలో ఎప్పుడు కూడా ఆడవారితో జాగ్రత్తగా ఉండాలని చెబుతాడు. వారి బుద్ధి ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు. అందుకే వారితో మాట్లాడే సమయంలో ఆచితూచి వ్యవహరించాలి.
సహనం లేని స్త్రీ
సాధారణంగా ఆడవారికి ఓపిక ఎక్కువగానే ఉంటుంది. కానీ కొందరు కోపంతో ప్రవర్తిస్తుంటారు. అలాంటి వారితో మనం అప్రమత్తంగా ఉండాలి. సహనం లేని వారితో మనం గొడవ పెట్టుకుంటే మనకే నష్టం. ఎందుకంటే ముందే ఆమె స్వభావం తెలియడంతో ఇంకా ఎందుకు ఆమెతో తగవు పెంచుకోవడం. అలా చేస్తే మన పరువే పోతుంది. అలాంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది.
వ్యక్తిత్వం లేని..
వ్యక్తిత్వం లేని స్త్రీని కూడా మనం దూరంగా ఉంచాలి. ఎందుకంటే ఆమె స్వభావం మంచిది కాకపోవడంతో ఆమెతో మనం తిరిగితే మన వ్యక్తిత్వం కూడా దెబ్బతింటుంది. మనల్ని కూడా అలాగే అంచనా వేస్తారు. ఈ నేపథ్యంలో అలాంటి వారికి దూరంగా ఉండటమే శ్రేయస్కరం. ఇలా స్త్రీల గురించి చాణక్యుడు ఎన్నో విషయాలు కూలంకషంగా వివరించాడు. అలాంటి వారికి దూరంగా ఉండటానికి మనం నిర్ణయించుకోవాలి. అంతేకాని వారితో సఖ్యతగా ఉంటే అంతే సంగతి.