Chanakya Niti: జీవితం సుఖమయంగా ఉండడాని సొంత ఇల్లు చాలా అవసరం. ఇంటి నిర్మాణం కోసం చాలా మంది అనేక అవస్థలు పడుతూ ఉంటారు. కానీ జీవితంలో లక్ష్యంగా ఏర్పాటు చేసుకొని సొంతింటిని నిర్మించుకుంటారు. అయితే ఇల్లు నిర్మించుకోవాలనుకోవడం ఎంత ముఖ్యమో.. దీనిని సరైన ప్రదేశంలో కట్టుకోవడం అంతేముఖ్యం. సొంతిల్లు ఉండాలనే కోరికతో ఎక్కడ పడితే అక్కడ ఇంటిని నిర్మించుకోవడం వల్ల అనేక కష్టాలను ఎదుర్కొంటారు. అంతేకాక జీవితం ఎప్పుడూ నిరాశగా ఉంటుంది. అయితే అపర చాణక్యుడు చెప్పిన సూత్రాల ప్రకారం కొన్ని ప్రదేశాల్లో ఇల్లును అస్సలు నిర్మించకూడదట. ఆప్రదేశాలేవో చూద్దాం..
చాణక్య చెప్పిన నీతి ప్రకారం.. ఇల్లు అన్నాక ప్రశాంతంగా ఉండాలి. పొద్దంతా వివిధ పనులకు వెళ్లి ఇంట్లోకి వచ్చిన వారు రిలాక్స్ అవుతారు. ఇలాంటి సమయంలో ఇంటి పరిసరాలు ప్రశాంతంగా ఉండాలి. అంటే నిత్యం గొడవలు వివాదాలు ఉండే ప్రదేశంలో ఇల్లు నిర్మించుకోవడం వల్ల నిత్యం నిరాశతో ఉంటారు. మనసు ప్రశాంతంగా లేక కొత్త రోగాలు వచ్చే అవకాశం ఉంది.
జీవనోపాధి ఉండే ప్రదేశాల్లో ఇల్లు నిర్మించుకోవాలి. ఒక ప్రదేశంలో ఇల్లు నిర్మించుకొని జీవనోపాధి కోసం వెతుక్కోవడం కరెక్ట్ కాదు. దీంతో మానసికంగా కుంగిపోయి వేదనకు గురవుతారు. అందువల్ల జీవనోపాధి ఎక్కడ ఉంటుందో అక్కడే ఇల్లు నిర్మించుకునే ప్రయత్నం చేయాలి. ఇల్లు ఒకచోట.. పని మరో చోట ఉండడం వల్ల ఖర్చులు పెరిగి ఆదాయం తగ్గుతుంది.
Also Read: Love: టాకింగ్, చాటింగ్, డేటింగ్ ఇదేనా ప్రేమంటే?
ఆధ్యాత్మిక వాతావరణం ఉన్న చోట ఇల్లు నిర్మించుకోవాలని చాణక్య నీతి చెబుతుంది.అలాగే గౌరవం, మర్యాద ఇచ్చేవారి మధ్య నివసించడం వల్ల ప్రశాంతంగా ఉంటారు. అంతేకాకుడా ఇక్కడ నివసించడం వల్ల మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. దీంతో ఎలాంటిసమస్యలుఉండవు.
Also Read: Smartphone Addiction: పిల్లలు ఫోన్ లో బ్యాడ్ వీడియోలు చూడకూడదు అంటే ఏం చేయాలి?
ఇల్లుఎక్కడ ఉన్నా.. నిజాయితీగా ఉండే మనుషుల మధ్య ఉండడంవల్ల పిల్లల కెరీర్ బాగుంటుంది. అలాగేనైతిక విలువలు కాపాడే వారి మధ్య ఉండడం వల్ల మనవిలువ పెరుగుతుంది. ఇలాంటి ప్రదేశాల్లో ఇల్లు నిర్మించుకోవడానికి ప్రయత్నించాలి. అయితేకొన్ని ప్రాంతాల్లో అనువైన ప్రదేశం లేకపోతే.. అపార్ట్ మెంట్ లో ఇల్లు కొనాలనుకునేవారు సైతం ఇంటి పరిసరాలు ముందుగా తెలుసుకోవాలి.