Chanakya Niti : అపర చాణక్యుడు మనుషుల జీవితాలకు సంబంధించిన ఎన్నో విలువైన సూత్రాలను అందించాడు. ఒక వ్యక్తి జీవితంలో ఎలాంటి పనులు చేయాలి? ఎలాంటి పనులు చేయకూడదు? ఇతరులతో ఎలాంటి సంబంధాలు ఉండాలి? మంచిగా ప్రవర్తించాలా? చెడుగా ఉండాలా? అనే విషయాలను తన నీతి సూత్రాల ద్వారా చెప్పారు. వీటిని చాలామంది అనుసరిస్తూ తమ జీవితాలను సక్రమ దారిలో ఉంచుకుంటున్నారు. అయితే చాణక్య నీతి ప్రకారం సమాజంలో మంచివారు ఉంటారు.. చెడ్డవారు ఉంటారు.. కానీ కొందరు మంచివారికి ఐదు రకాల చెడ్డ లక్షణాలు ఉంటాయని చెప్పారు. వీటివల్ల వారు ఎప్పుడూ బాధపడుతూ ఉంటారని పేర్కొంటున్నారు. ఇంతకీ మంచివారికి ఉండే చెడ్డ లక్షణాలు ఏవో ఇప్పుడు చూద్దాం..
మంచివారు ఎప్పుడు నవ్వుతూ ఉండాలని కోరుకుంటారు. వీరు సమాజం గురించి ఎక్కువగా ఆలోచించరు. పరిస్థితులు ఎలా ఉన్నా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ.. ఇతరులను నవ్విస్తూ ఉంటారు. అయితే వీరి వల్ల ఎవరూ బాధపడకూడదు అని సంతోషంగా ఉండే ప్రయత్నం చేస్తారు. తమకు ఎలాంటి బాధ ఉన్నా లో లోపల దాచుకొని పైకి ఆనందంగా కనిపిస్తూ ఉంటారు. దీంతో మీరు జనాల్లో ప్రత్యేకంగా నిలుస్తారు.
Also Read : భార్యలో ఈ లక్షణాలు ఉంటే.. భర్త అదృష్టవంతుడే..
మంచివారు ఎప్పుడూ తమ సమస్యలను ఎదుటివారికి చెప్పుకోవడానికి ఇష్టపడరు. తమ వల్ల ఎదుటివారు బాధపడొద్దని అనుకుంటూ ఉంటారు. అందువల్ల ఒంటరిగానే తమ బాధలను తలుచుకుంటూ కుంగిపోతుంటారు. ఒంటరిగానే కూర్చొని ఏడుస్తూ ఉంటారు. తనకున్న బాధలను ఇతరులకు చెప్పడం వల్ల వేరే వాళ్ళు కూడా బాధపడతారని భావిస్తారు. ఇలాంటి లక్షణాలు ఉన్న వారిని మంచివారు అని అనుకోవచ్చు.
మంచివారు ఏ చిన్న తప్పును ఒప్పుకోరు. వారికి పరిస్థితులు బాగా లేకపోతే వెంటనే కోపం వస్తుంది. మనసులో ఏదీ దాచుకోకుండా వెంటనే బయటపెట్టిస్తారు. అయితే తమ కోపం ఎక్కువ కాలం ఉండదు. అంతేకాకుండా ఈ కోపంతో ఎటువంటి అనర్థాలకు దారి తీయకుండా జాగ్రత్త పడతారు. తమ కోపం ద్వారా మంచే జరగాలని కోరుకుంటారు.. కానీ ఈ విషయంలో ఎదుటివారి దృష్టిలో చెడ్డవారిగా మారిపోతారు.
మంచివారు ఎప్పుడూ నిరాడంబరంగా ఉంటారు. మనసులో ఏది దాచుకోకుండా వెంటనే బయటకు చెప్పేస్తారు. ఎవరు ఏది అడిగినా టక్కున సమాధానం ఇచ్చే మాదిరిగా ఉంటారు. అయితే ఈ లక్షణం వారిని కొన్ని చిక్కుల్లో పడేస్తుంది. సందర్భం లేకుండా కొన్ని విషయాలను ఓపెన్ కావడంతో వారు ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
మంచివారు ఎప్పుడూ మోసపోతూనే ఉంటారు. మీరు తమల్ని ఎవరైనా మోసం చేసినా మళ్ళీ వారిని నమ్ముతుంటారు. అలా ఎన్నిసార్లు మోసం చేసిన పదేపదే నష్టపోతు ఆర్థికంగా నష్టపోతారు. ఈ లక్షణం వారి గుర్తించేసరికి అప్పటికే చేయి దాటిపోతుంది.
Also Read : ఇలాంటి వాళ్లను కష్టపడితే.. దరిద్రం తాండవిస్తుంది..
అయితే పై లక్షణాలు ఉన్న మంచివారు తమ నష్టాలను వెంటనే గుర్తిస్తే బయటపడే అవకాశం ఉంది. లేదా ఈ లక్షణాలను అలాగే కొనసాగిస్తే భవిష్యత్తులో తీవ్రంగా కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ లక్షణాలను వారు గుర్తించక పోయిన ఎదుటివారు గుర్తించి వారికి వివరించే ప్రయత్నం చేయాలి.