Chanakya Neeti : ప్రతి ఒక్కరి జీవితంలో తల్లిదండ్రులు, సోదరులు, బంధువులు ఉన్నట్లే స్నేహితులు కూడా ఉంటారు. అయితే నీ స్నేహితుల్లో కొందరు మంచివారు ఉండొచ్చు చెడ్డవారు ఉండొచ్చు. ఎలాంటి వారైనా కొందరు స్నేహాన్ని కొనసాగిస్తూ ఉంటారు. కానీ మంచి స్నేహం చేయడం వల్ల జీవితం హ్యాపీగా ఉంటుంది. అయితే ఒక్కోసారి మనకు తెలియకుండానే ఇతరులతో స్నేహం చేస్తాం. వారి గురించి తెలిశాక దూరంగా ఉంటాం. అయితే కొందరు తమ వ్యక్తిత్వాన్ని బయట పెట్టకుండా ఉంటారు. లోపల చెడ్డ లక్షణాలు ఉన్న పైకి మంచి వారిలా నటిస్తూ ఉంటారు. మరి ఇలాంటి వారిని గుర్తించడం ఎలా? ఇలాంటి లక్షణాలతో వీరు ఉంటార? వారితో స్నేహం చేయడం వల్ల కలిగే అనర్ధాలు ఏంటి?
తల్లిదండ్రులు, బంధువులతో చెప్పుకోలేని కొన్ని విషయాలను.. స్నేహితులతో పంచుకుంటాం. కొందరు స్నేహితులు ప్రాణం ఇవ్వడానికి కూడా వెనుకాడరు. అయితే మంచి స్నేహితులు ఎవరు అని తెలుసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే కొందరు స్నేహం పేరుతో మోసం చేస్తూ ఉంటారు. ఇలాంటి వారి లక్షణాలు విభిన్నంగా ఉంటాయి. అలాంటివారు ఎవరంటే?
కొందరు తమ గొప్పల గురించి ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటారు. తామే గొప్ప అని ఫీల్ అవుతూ ఉంటారు. ఇలాంటి వారితో స్నేహం చేయడం చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఇలాంటివారు ఎప్పుడు మరొకరితో పోల్చుకుంటూ ఉంటారు. ఒకవేళ తమ కంటే ఎవరైనా గొప్పగా ఉన్నట్లు వారు భావిస్తే.. వారిని అరగదొక్కడానికి ప్రయత్నాలు ప్రారంభిస్తారు. ఇలాంటి విషయంలో స్నేహితుల నువ్వు కూడా చూడకుండా వారిపై పెత్తనం చెలాయించాలని చూస్తారు. అందువల్ల ఇలాంటి వారికి దూరంగా ఉండటమే మంచిది.
ఎక్కువగా మాట్లాడే వారితో కూడా స్నేహం చేయకుండా ఉండడం మంచిది. ఎందుకంటే నిత్యం ఏదో ఒకటి చెబుతూ ఎదుటివారిని విసిగిస్తూ ఉంటారు. తమకు తెలియకుండానే కొన్ని మాటలతో పక్కవారిని దూషిస్తూ ఉంటారు. ఇలాంటి మాటల వల్ల విన్నవారు చాలా బాధపడి పోతారు. వీరు భవిష్యత్తులో ఎప్పటికీ కలిసి ఉండలేరని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే తమ మాటల తో ఇతరులపై ప్రభావం చూపుతారు. అందువల్ల ఇలాంటి వారికి దూరంగా ఉండటమే మంచిది.
Also Read : చాణక్య నీతి: ఈ విషయాల్లో జాగ్రత్త.. లేకపోతే కెరీర్ ఖతం..
ఒకరితో స్నేహం చేసినప్పుడు వారు చెడ్డవారు అని తెలిస్తే వారికి దూరంగా ఉండటమే మంచిది. అలా కాకుండా ఇతర అవసరాల కోసం వారితో స్నేహం చేయడం వల్ల పక్కనే ఉన్నవారికి కూడా చెడ్డపేరు వస్తుంది. అంతేకాకుండా వీరితో ఉండడం వల్ల సమాజంలో గౌరవం పోతుంది. మీరు చేసే ప్రతి చర్యలో పక్క వారికి భాగం అవుతుంది. అందువల్ల ఒక వ్యక్తి చేసే చెడ్డ పనులు గుర్తించినట్లయితే వారికి దూరంగా ఉండటమే మంచిది.
కొందరు కొన్ని విషయాల్లో చాలా చీప్ గా వ్యవహరిస్తారు. ప్రతి చిన్న విషయానికి గొడవ పెట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. డబ్బుల విషయంలోనూ నిక్కచ్చిగా ఉంటారు. ఇలాంటి మనస్తత్వం ఉన్న వారితో స్నేహం చేయడం వల్ల ఎప్పుడు మనసు ఆందోళనగా ఉంటుంది. అందుకే ఇలాంటి వారికి దూరంగా ఉండి హాయిగా ఉండడమే మంచిది.
Also Read : చాణక్య నీతి: ఇలాంటి వ్యక్తులతో స్నేహం చేయడం చాలా డేంజర్.. ఎందుకంటే?