Chanakya Neeti
Chanakya Neeti : సమాజంలో మంచివారు ఉంటారు.. చెడ్డవారు ఉంటారు.. కానీ ఎవరితో ఎప్పుడూ ఎలా ప్రవర్తించాలో కొందరికి మాత్రమే అవగాహన ఉంటుంది. అయితే చాణక్యుడు పరిస్థితులను బట్టి మనుషులు ఇలా ప్రవర్తించాలో తెలియజేశాడు. ముఖ్యంగా జీవితంలో పైకి ఎదగాలనుకునే వారు కొన్ని రకాల అలవాట్ల ద్వారా అన్నింట విజయం సాధిస్తారు. లేకుంటే వీరికి అనేక రకాల ఇబ్బందులు ఎదురై వెనుకడుగు వేస్తారు. అపర చాణక్యుడు రాజనీతి శాస్త్రం కి సంబంధించిన విషయాలు మాత్రమే కాకుండా మనుషుల జీవితాలకు సంబంధించిన అనే విషయాలను చెప్పాడు. అందులో ఒక మనిషి ఎదుగుదలకు ఎన్ని అడ్డంకులు ఏర్పడతాయో? అలాంటి పరిస్థితుల్లో ఎలా ఉండాలో తెలియజేశాడు. మరి వాటి గురించి తెలుసుకుందామా..
చాణిక్యుడు చెప్పిన నీతి ప్రకారం కొందరు ఉద్యోగులు కార్యాలయాల్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కానీ వెంటనే వాటికి రియాక్ట్ అవుతారు. అయితే ఏ పని చేసినా కష్టాలు అనేది కామన్. వీటిని ఎదుర్కొని ముందుకు వెళ్లడమే అసలైన వ్యక్తిత్వం. ఇలా చిన్నచిన్న కష్టాలు ఎదురైనప్పుడు భావోద్వేగాలకు గురికాకుండా ఉండాలి. ఎందుకంటే చిన్న విషయానికే స్పందిస్తే జీవితం అక్కడికే ఆగిపోతుంది. ముందుకు వెళ్లే అవకాశం ఉండదు. అందువల్ల ఈ విషయంలో కొంచెం ఓర్పు ఉండాలని చాణక్యుడు చెబుతాడు. ఓర్పు లేకపోవడం వల్ల అనేక కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొంటాడు.
Also Read : చాణక్య నీతి: ఇలాంటి వ్యక్తులతో స్నేహం చేయడం చాలా డేంజర్.. ఎందుకంటే?
కెరీర్ లో ఎదగాలంటే ఫస్ట్ ఉండే అలవాటు ఆలోచించి పనిచేయడం. ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్న ఎన్నో విషయాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇలాంటి సమయంలో కొన్ని తొందరపాటు నిర్ణయాలు తీవ్ర నష్టానికి గురిచేస్తాయి. ఆలోచించకుండా తీసుకుని నిర్ణయాల వల్ల నష్టం మాత్రమే కాకుండా సమాజంలో అగౌరవం ఏర్పడుతుంది. దీంతో భవిష్యత్తులో ఇబ్బందులు ఏర్పడి కెరీర్ కు అడ్డంకులు ఏర్పడతాయి. అందువల్ల ఏ విషయంలోనైనా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అలాగే పెట్టుబడుల విషయంలో కూడా ఆలోచన లేకుండా పెట్టడం వల్ల తీవ్ర నష్టాలకు గురికావాల్సి వస్తుంది.
జీవితంలో ఎవరి చేతిలో మోసపోకుండా ఉండాలంటే కొత్త వ్యక్తులను నమ్మొద్దని చాణక్య నీతి చెబుతుంది. ఏ రంగంలో వారికి అయినా కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. అయితే చాలామంది వీరితో ఆర్థిక వ్యవహారాలు వెంటనే జరిపి నష్టాలకు గురవుతారు. ఎదుటివారి వ్యక్తిత్వం పూర్తిగా తెలుసుకున్న తర్వాతే వారితో ఆర్థిక వ్యవహారాలు జరపాలి. లేకుంటే ఇలాంటివారు మోసం చేసే అవకాశాలున్నాయి. అంతేకాకుండా వ్యాపారులు వీరితో పెట్టుబడులు పెట్టాల్సి వస్తే కొన్ని రోజులు సమయం తీసుకోవాలి.
ఉద్యోగులకు కార్యాలయాల్లో సీనియర్ల ఇబ్బందులు తప్పవు. అయితే కొందరు సీనియర్ల నుంచి అవసరమైన విషయాలు తీసుకొని వారితో సంయమనం పాటిస్తారు. మరికొందరు మాత్రం చిన్న చిన్న విషయాలకి వాగ్వాదాలు చేసి వారికి దూరమవుతారు. ఇలాంటి వారు సీనియర్లతో వైరం పెంచుకోవడం వల్ల వారి కెరీర్ పై ప్రభావం చూపుతుంది. దీంతో భవిష్యత్తులో చేసే కొన్ని పనులకు వారు అడ్డంకు సృష్టించే అవకాశం ఉంది. అందువల్ల ఉద్యోగులు సీనియర్లతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అప్పుడే కెరీర్ లో విజయం సాధించగలుగుతారు.