Chanakya Niti: ఆచార్య చాణక్యుడు మనకు ఎన్నో విషయాలు తెలిపాడు. జీవితంలో మనం ఎలా ఉండకూడదో, ఎలా ప్రవర్తించాలో కూడా మనకు వివరింా బోధించాడు. అతడు సూచించిన మార్గాలు ఇప్పటికి కూడా అనుసరణీయమే. మనిషి జీవితంలో డబ్బు సంపాదించాలనే యావలో నైతికతను మరచిపోతున్నాడు. ఎడాపెడా సంపాదించాలనే ఆశతో మంచిని పక్కన పెడుతున్నాడు. దీంతో లాభాల కంటే నష్టాలే ఎక్కువ అని తెలిసినా అదే దారిలో వెళ్తున్నారు. ఫలితంగా చాణక్యుడు సూచించిన మార్గంలో నడిస్తే మనకు అన్ని మంచి లాభాలే కలుగుతాయి.

చాణక్యుడు మనుషుల నడవడిక గురించి వివరించాడు. ఎవరైతే జీవితంలో డబ్బు సంపాదిస్తారు? వారి లక్షణాలేమిటి అనే కొన్నింటిని మనకు విశదీకరించాడు. మనిషి పొదుపు చేస్తే డబ్బు సంపాదించొచ్చు. కానీ సంపాదన అంతా పొదుపు చేస్తే తినడానికి తిండి కూడా కష్టమే అవుతుంది. మనం సుఖంగా ఉండేందుకు తినగా మిగిలింది పొదుపు చేస్తే భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడుతుంది. ఏ వ్యక్తి అయితే సంధ్యాకాలం, మధ్యాహ్న సమయాల్లో నిద్ర పోతాడో అలాంటి వాడి దగ్గర ధనం ఉండదు.
ఎవరైతే ఎప్పుడు బూతులు మాట్లాడతాడో అలాంటి వారి దగ్గర కూడా లక్ష్మీదేవి నివాసం ఉండదట. గంభీరంగా, కఠినంగా, చెడు మాటలు మాట్లాడే వారు డబ్బు ఆదా చేయలేరు. అతడికి జీవితమంతా డబ్బు నిలువ ఉండదు. మంచి మాటలతో మధురమైన వాణితో మాట్లాడే వ్యక్తి దగ్గర భాగ్యలక్ష్మి నిలువ ఉంటుంది. ఆకలి బాగా ఉన్న వారి దగ్గర కూడా ధనం ఉండదు. అతిగా తినే వారు సంపాదన మీద పెద్దగా దృష్టి పెట్టరు. దీంతో వారు సంపాదన మీద కాకుండా కేవలం తిండి కోసమే బతుకుతారు.

పరిశుభ్రంగా లేని ఇంట్లో కూడా డబ్బు స్థిరంగా ఉండదు. పరిశుభ్రతకు పెద్దపీట వేయాలి. ఇంకా చట్టవిరుద్ధంగా డబ్బు సంపాదించే వాడి ఇంట కూడా లక్ష్మీదేవి ఉండదు. ఇంటికి వచ్చే అతిథులను గౌరవించలేని వారి ఇంట కూడా భాగ్యలక్ష్మి నివాసం ఉండదు. డబ్బు, గౌరవం, మర్యాద లేకుండా పోతే ఇబ్బందులే. ఇలా చాణక్యుడు ఎవరి ఇంట్లో డబ్బు నిలువ ఉంటుందనే విషయం స్పష్టంగా తెలిపారు. డబ్బు సంపాదించే వారు ఈ విషయాలు గుర్తుంచుకుని మంచి పద్ధతులు అవలంభించి డబ్బు సంపాదన చేసుకోవాలని సూచిస్తున్నాడు.