https://oktelugu.com/

Vastu Tips: ఇంట్లో ఎక్కువగా డబ్బు నిలవాలంటే ఈ టిప్స్ పాటించండి..

కొందరి ఇళ్లల్లో... వ్యాపార సముదాయాల్లోకి వెళ్లినప్పుడు లాఫింగ్ బుద్ద విగ్రహం కనిపిస్తుంది. ఇది సరదా కోసం ఉంచారని కొందరు అనుకుంటారు. మరికొందరి ఇళ్లల్లోనూ కనిపిస్తుంది. ఇదే డెకరేషన్ కోసం ఉంచారని మాట్లాడుకుంటారు.

Written By:
  • Srinivas
  • , Updated On : November 5, 2024 / 05:17 PM IST

    Vastu-tips

    Follow us on

    Vastu Tips: ప్రస్తుత కాలంలో డబ్బు ప్రధానమైనది. ఒకప్పుడు ప్రజలు తమ అవసరాల కోసం వస్తుమార్పిడి విధానాన్ని పాటించేవారు. కానీ నేటి కాలంలో ఏ చిన్న అసవరం తీరాలన్న డబ్బు కావాల్సి ఉంటుంది. అయితే నగదు అందరి వద్ద ఒకేలా ఉండదు. కొందరి వద్ద ఎక్కువగా ఉండి..మరికొందరి వద్ద తక్కువగా ఉంటుంది. కొందరు డబ్బు తక్కువగా ఉన్నా సంతోషంగా ఉంటారు. ఎలాంటి కష్టాలు ఎదుర్కోకుండా ఉంటారు. వీరికి సమయానికి ఆర్థిక సాయం అందుతుంది. ఇలాంటి వారు కొన్ని వాస్తు టిప్స్ పాటించడమేనని కొందరు జ్యోతిష్యులు చెబుతున్నారు. ఇంట్లో ఉండే కొన్ని వస్తువులు సరైన దిశలో ఉంచడం వల్ల ఎప్పటికీ ఇంట్లో ధనం నిల్వ ఉంటుందని వాస్తు శాస్త్రం చెబుతుంది. మరి ఏ వస్తువులు ఇంట్లో ఉంచాలి? అవి ఏ దిశలో పెట్టాలి?

    కొందరి ఇళ్లల్లో… వ్యాపార సముదాయాల్లోకి వెళ్లినప్పుడు లాఫింగ్ బుద్ద విగ్రహం కనిపిస్తుంది. ఇది సరదా కోసం ఉంచారని కొందరు అనుకుంటారు. మరికొందరి ఇళ్లల్లోనూ కనిపిస్తుంది. ఇదే డెకరేషన్ కోసం ఉంచారని మాట్లాడుకుంటారు. కానీ లాఫింగ్ బుద్ద ఇంట్లో ఉండడం వల్ల పాజిటివ్ ఎనర్జీ ప్రసారం అవుతంది. ఈ విగ్రహం ఏ ఇంట్లో ఉంటే ఆ ఇల్లు సంతోషంగా ఉంటుంది. అంతేకాకుండా డబ్బు ఎప్పటికీ ఇంట్లో నిల్వ ఉంటుంది. అసవరానికి ధన సాయం కూడా అందుతుంది.

    చాలా మంది ఇళ్లల్లో డబ్బును దాచే అల్మారాలు, బీరువాలు ఎక్కడ పడితే అక్కడ ఉంచుతారు. కానీ ఇలా చేయడం వల్ల ఇంట్లో డబ్బు నిల్వదు. ఏదో రకంగా ఖర్చు అయి ధనం వెళ్లిపోతుంది. అందువల్ల బీరువాను కచ్చితంగా నైరుతి దిశలోనే ఉంచాలి. నైరుతి దిశలో ఉన్న బీరువాలో డబ్బు దాచుకోవడం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుంది. దీంతో డబ్బు ఎప్పటికీ నిలిచి ఉంటుంది. అయితే నైరుతిలో బెడ్ రూంలో దీనిని ఏర్పాటు చేసుకోవచ్చు..

    ప్రతి ఇంటికి ఈశాన్యం చాలా ప్రధానం. ఈశాన్యంలో ఎక్కువ ప్లేసు ఉంటే ఆ ఇంట్లో అంతా మంచే జరుగుతుందని అంటారు. ఈశాన్యంలో దేవుళ్లు కొలువై ఉంటారని అంటారు. అందువల్ల ఈశాన్యంలో ఎటువంటి బరువైన వస్తువులను ఉంచరాదు. ఇలా ఉంచడం వల్ల ఇంట్లో అరిష్టం ఏర్పడతుంది. దీంతో నిత్యం ఆర్థిక కష్టాలు ఉంటాయి. అలాగే ఇంట్లో మనశ్శాంతి ఉండదు. కుటుంబ సభ్యుల మధ్య నిత్యం గొడవలు జరుతుతూ ఉంటాయి.

    పంచముఖ హనుమాన్ గురించి భక్తులకు తెలిసే ఉంటుంది. కొందరు ఈ విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకోవాలని చూస్తారు. హనుమాన్ విగ్రహాన్ని ఇంట్లో ఏర్పాటు చేసుకోవాలని అనుకుంటే మెయిన్ దర్వాజకు ఎదురుగా పెట్టుకోవాలి. ఎంట్రెన్స్ లో ఈ విగ్రహం ఉండడం వల్ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పాస్ అవుతుంది. అంతేకాకుండా హనుమాన్ ఆశీస్సులు ఉంటాయి.

    గుర్రపు నాడ గురించి నేటి కాలంలో చాలా మందికి తెలియదు. కానీ ఇది అందుబాటులో ఉంటే ఇంటి ప్రధాన ద్వారానికి ఉంచాలి. ఇది ఇంటి ద్వారానికి ఉండడం వల్ల ఎలాంటి దుష్ట శక్తులు ఇంట్లోకి ప్రవేశించవు. దీంతో డబ్బు ఎప్పటికీ నిల్వ ఉంటుంది.