Chanakya Niti: జీవితంలో ఎంతోమంది ఎదురవుతూ ఉంటారు. వీరిలో మంచివారు ఉండవచ్చు.. చెడ్డవారు ఉండవచ్చు. అయితే మంచి చేసుకుంటూ వెళ్లే వారికి మిత్రులు కంటే శత్రువులే ఎక్కువగా ఉంటారు. ఇలాంటి శత్రువులు ఏర్పడిన వారిని చూసి కొందరు భయపడుతూ ఉంటారు. కానీ నిజమైన విజేతలు మాత్రం వీరిని చూస్తూ నవ్వుతూ ఉంటారు. అదేంటి.. శత్రువులు చూసి ఎందుకు నవ్వాలి? అన్న సందేహం చాలామందికి వస్తుంది. అంతేకాకుండా శత్రువు ఎన్నో రకాలుగా బాధలు పెడుతూ ఉంటాడు. అయినా కూడా భరించాలా? అన్న అనుమానం కూడా వస్తుంది. అయితే శత్రుపై విజయం సాధించాలంటే ఇది ఒక్కటే మార్గం అని చాణిక్యనీతి తెలుపుతుంది. అదేంటంటే?
అపర చాణక్యుడు మానవ జీవితం గురించి ఎన్నో విలువైన సూత్రాలను అందించాడు. జీవితంలో ఎవరితో ఎలా ఉండాలి? ఏం చేస్తే విజయం దక్కుతుంది? అనే విషయాలపై పరిశీలన చేసి ప్రజలకు విలువైన సూచనలను చెప్పాడు. అయితే ప్రతి వ్యక్తికి శత్రువు కచ్చితంగా ఉంటాడు. ఈ శత్రువుతో అతడు ఎన్నో రకాలుగా బాధలు పడతాడు. అయితే ఆ శత్రువును గెలవాలంటే అతనితో నేరుగా పోరాడాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా గొడవ పెట్టుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు.
ఒకరు ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు ఎంతోమంది అడ్డంగా వస్తూ ఉంటారు. చేసే పనులపై ఆటంకాలు సృష్టిస్తారు. వీరు నుంచి తప్పించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినా ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారు. ఇలా వారు ఎన్ని రకాల బాధలు పెట్టినా.. వారిని చూస్తూ నవ్వుతూ ముందుకు వెళ్లాలని చాణక్యుడు చెబుతున్నాడు. ఎందుకంటే వారు ఎన్ని రకాలుగా బాధలు పెట్టినా.. వారి గురించి పట్టించుకోకపోతే కొన్ని రోజుల తర్వాత అతనిలో ఈర్ష తగ్గుతుంది. దీంతో అతనిలో కోపం కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఫలితంగా తను ఇబ్బంది పెట్టే వ్యక్తి గురించి మర్చిపోతాడు. ఇదే సమయంలో ఈ వ్యక్తి తన లక్ష్యంపై దృష్టి పెట్టి విజయం అంచుల వరకు చేరుకోవాలి. అలా చేరుకొని విజయం సాధించిన తర్వాత అప్పుడు.. శత్రుపై దృష్టి పెట్టి రివెంజ్ తీర్చుకునే అవకాశం ఉంటుంది. అంటే శత్రువుపై రివేంజ్ అంటే తిరిగి దాడి చేయడం కాదు.. తన విజయం చూసి శత్రువు సిగ్గుపడడమే అసలైన ఓటమి.
ఇలా ఎవరికి వారు తమ లక్ష్యాలపై దృష్టి పెట్టి మాత్రమే వాటి గురించి ఆలోచించాలి. మధ్యలో ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టే శత్రువులు తయారవుతూ ఉంటారు. వీరి గురించి ఏమాత్రం పట్టించుకోవద్దని చాణక్యుడు చెబుతున్నారు.