Chanakya : ఈ మూడు చిట్కాలను పాటిస్తే మీరు అనుకున్న ఏ పని అయినా సరే మీరు అవలీలగా పూర్తి చేయగలుగుతారు. పురాతన భారతీయ తత్వవేత్త మరియు రాజకీయవేత్త ఆచార్య చానిక్యుడు తాను రచించిన నీతి శాస్త్రంలో మనిషి జీవితానికి సంబంధించిన ఎన్నో నియమాల గురించి తెలిపాడు. మనుషుల జీవితానికి సంబంధించిన ఎన్నో గొప్ప విషయాల గురించి ఆచార్య చానిక్యుడు వివరించాడు. మీరు ఏదైనా పని అనుకొని దానిని పూర్తి చేయలేక మిమ్మల్ని మీరు అసమర్థులుగా అనుకుంటున్నట్లయితే, జీవితంలో మీకు ఎదురయ్యే కష్టాలను తట్టుకోలేక పోతున్నట్లయితే వాటి గురించి కూడా నీతి శాస్త్రంలో ఆచార్య చాణిక్యుడు పరిష్కార మార్గాలను తెలిపాడు. ఏదైనా ముఖ్యమైన పనిని పూర్తి చేసేందుకు ప్రేరణ కలిగించే అద్భుతమైన సూత్రాలను ఆచార్య చాణిక్యుడు వివరించాడు. కొన్నిసార్లు ఏదైనా పని ఎన్నిసార్లు చేసినా కూడా దానిని పూర్తి చేయలేము. మనకు అప్పజెప్పిన ముఖ్యమైన పనులను మనం విజయవంతంగా చేయలేము. అయితే మీరు ఏదైనా పని అనుకున్నప్పుడు దానిని పూర్తి చేసే క్రమంలో ఏదైనా కష్టాలు ఎదురైనట్లయితే ఆ కష్టాలను జయించడానికి ఆచార్య చాణిక్యుడు మూడు చిట్కాలను తెలిపాడు. చాణిక్యుడు తెలిపిన మూడు చిట్కాలను మీరు పాటిస్తే ఏ పని అనుకున్నా సరే చాలా సులభంగా పూర్తి చేయగలుగుతారు.
చాణిక్యుడు తెలిపిన మొదటి సూత్రం విజ్ఞానం సంపాదించాలి. ఒక వ్యక్తి దగ్గర ఉండే తిరుగులేని ఆయుధం విజ్ఞానం అని చెప్పడంలో సందేహం లేదు. ఎటువంటి భయంకర విపత్తులు ఎదురైనా కూడా వాటిని ఎదుర్కోవడానికి విజ్ఞానం ఒక శక్తివంతమైన ఆయుధంగా పనిచేస్తుంది. జ్ఞానాన్ని మించిన మంచి స్నేహితులు కూడా ఎవరు ఉండరు. ఒప్పు తప్పుల గురించి ఒక విజ్ఞానవంతుడు చాలా వివేకంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జ్ఞానాన్ని పెంచుకోవడం చాలా అవసరం. ఇక ఆచార్య చాణిక్యుడు తెలిపిన రెండవ సూత్రం విజయం కోసం మానవప్రయత్నం చేస్తూ ఉండాలి. జ్ఞానం విజయానికి మార్గం సులభం చేస్తుంది. విజయం సాధించడం వలన ఆ వ్యక్తికి సమాజంలో గౌరవంతో పాటు గుర్తింపు కూడా లభిస్తుంది.వచ్చిన గుర్తింపు అతనిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.
Also Read : మీరు ఒప్పుకోకపోయిన ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన 10 పచ్చి నిజాలు ఇవే.. ఆచార్య చాణక్యుడు…
ఒక మనిషి జీవితంలో విజ్ఞానంతో సాధించిన విజయం అతనిని గౌరవప్రదమైన జీవితాన్ని గడిపేలా చేస్తుంది. కాబట్టి మనిషి విజయం సాధించడానికి ఎన్ని ప్రయత్నాలు అయినా సరే చేస్తూనే ఉండాలి. చివరి వరకు ఆశను కోల్పోకుండా ప్రయత్నిస్తూ విజయం సాధించాలి. ఇక చాణిక్యుడు తెలిపిన మూడవ సూత్రం ధర్మాన్ని పాటించాలి. సంపద కంటే కూడా ధర్మం చాలా విలువైనది. ధర్మం మనలను జీవితంలో మార్గ నిర్దేశం చేయడంతో పాటు అది మరణం తర్వాత కూడా మనతోనే ఉంటుంది.ధర్మం సమాజంలో మన గౌరవాన్ని పెంచుతుంది. కాబట్టి మనం ఎప్పుడూ ధర్మానికి కట్టుబడి ఉండాలి.