Bank New Timings 2023: బ్యాంకు వినియోగదారులను కేంద్రం అలర్ట్ చేసింది. ఇక నుంచి వీటి పనిదినాల్లో మార్పులు ఉంటాయని తెలిపింది. ఇందుకు సంబంధించిన కసరత్తును ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం అమల్లోకి వస్తే ఇప్పుడున్న బ్యాంకు టైమింగ్స్ పూర్తిగా మారిపోతాయి. అంతేకాకుండా సెలవులు కూడా పెరుగుతాయి. అయితే రోజూవారీ పనిగంటలు పెరగొచ్చు. కానీ వారంలో 5 రోజులు మాత్రమే బ్యాంకులు తెరిచి ఉంటాయి. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్(ఐబీఏ), యునైటెడ్ ఫోరం బ్యాంక్ ఆఫ్ ఎంప్లాయిస్ (యూఎఫ్ బీఈఎస్) సూచనల మేరకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం బ్యాంకులు వారంలో 6 రోజులు పనిచేస్తున్నాయి. రెండో, నాలుగో శనివారం హాలిడేస్ ఉంటున్నాయి. మొదటి, మూడో శనివారం మాత్రమే పనిచేస్తున్నాయి. అలాగే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పనిచేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం బ్యాంకు సమయాల మార్పునకు ఆమోదం తెలిపితే ఈ సమయాలు మారుతాయి. వారానికి 5 రోజులు మాత్రమే పనిచేయాల్సి ఉంటుంది. అయితే రోజువారీ గంటల్లో మార్పులు ఉంటాయి. ప్రతీరోజూ 40 నిమిషాలు ఎక్కువగా పనిచేయాలి. పనిగంటలు మార్చాలని ఐబీఏ ఆర్థిక శాఖకు పంపిన ప్రతిపాదన పంపిన విధంగానే ఈ మార్పులు ఉంటాయని తెలుస్తోంది.
గతంలో తమిళనాడు ప్రభుత్వం ప్రైవేట్ సంస్థల పనిదినాలు మార్చేందుకు కేలక ప్రతిపాదనలు చేసింది. ప్రతిరోజూ 12 గంటలు పనిచేస్తే వారంలో 3 రోజులు సెలవులు తీసుకొచ్చని తెలిపింది. అయితే దీనిపై ఉద్యోగ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. మరి ఇప్పుడు బ్యాంకు సమయాల మార్పుపై ఉద్యోగాల నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుందోనని అనుకుంటున్నారు. అయితే ఐబీఏ ప్రతిపాదన మేరకే బ్యాంకు సమయాలు మార్పు ఉంటుందిన కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఉద్యోగులపై ఒత్తిడి పెరుగుతున్న కారణంగా సెలవులు పెంచాలని ఉద్యోగ సంఘాలు కోరినట్లు పేర్కొంది.
బ్యాంకు సమయం మార్పులపై ఆర్థిక శాఖకు కూడా ప్రతిపాదను పంపినట్లు సమాచారం. అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే వేజ్ బోర్డ్ రివిజన్ తో పాటు కొత్ నోటిఫికేషన్ జారీ చేయొచ్చని అంటున్నారు. ఇదిలా ఉండగా బ్యాంకు సమయాలు మార్చితే వినియోగదారులు ఎలా రియాక్టవుతారనేది ఆసక్తిగా మారింది. ఇప్పటికే బ్యాంకుకుల పలు కారణాలతో సెలవులు రావడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బ్యాంకుతో రోజూ వ్యవహారం జరిపేవారు సెలవులు ఉండడం వల్ల నిరాశ చెందుతున్నారు.
ఓ వైపు డిజిటల్ పేమేంట్ సర్కిల్ పెరుగుతున్నా సాంకేతిక కారణాలతో ఎక్కువ మంది బ్యాంకునే ఆశ్రయిస్తున్నారు. మరోవైపు ఇటీవల డిజిట్ పేమేంట్ ద్వారా చార్జీలు వసూలు చేస్తారని ప్రచారం సాగడంతో బ్యాంకులనే నమ్ముకుంటున్నారు ఇటువంటి పరిస్థితుల్లో బ్యాంకులకు వారంలో 3 రోజులు సెలవులు అంటే యాక్సెప్ట్ చేస్తారా? అనేది ఆసక్తిగా మారింది. ఇదిలా ఉండగా మే నెలలో బ్యాంకులకు 11 రోజులు సెలవులు రానున్నాయి. ఈ నేపథ్యంతో బ్యాంకుల్లో రద్దీ కనిపిస్తోంది.