Janhvi Kapoor: సినీ ఇండస్ట్రీలో కొత్త భామల సందడి రోజురోజుకు పెరిగిపోతోంది. కొందరు తమ టాలెంట్ ను ఉపయోగించి ఇండస్ట్రీలోకి అడుగుపెడుతుండగా.. మరికొందరు వారసత్వంతో పరిశ్రమలోకి వస్తున్నారు. దివంగత స్టార్ హీరోయిన్ కూతురు జాన్వీ వెండితెరపై మొదటిసారి కనిపించి చాన్నాళ్లే అయింది. కానీ ఈ బ్యూటీకి ఇప్పుడిప్పుడే క్రేజీ పాపులారిటీ దక్కుతోంది. ఈ భామ సినిమాల్లో తక్కువ.. సోషల్ మీడియాలో ఎక్కువగా షో చేస్తూ ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో మిలియన్ల కొద్దీ ఫ్యాన్స్ ను పెంచుకున్న భామ వారిని ఎంటర్టైన్ చేయడానికి అప్పుడప్పుడు హాట్ లుక్స్ ఇస్తూ ఉంటుంది. లేటెస్టుగా ఈ అమ్మడు ఓ ఫొటో షూట్ కు ఫోజులిచ్చింది. ఇందులో జాన్విని చూసి ఎలాంటి కామెంట్ చేశారంటే?
అందం గురించి మాట్లాడేటప్పుడు అలనాటి శ్రీదేవి గురించి చెబుతారు. మరి ఆ అతిలోక సుందరి కూతురు ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అనుకున్నట్లు శ్రీదేవి కూతురు జాన్వీ తల్లికి మించిన అందంతో ఫ్యాన్స్ ను అలరిస్తోంది. Black and White కాలంలో శ్రీదేవి తన అంద చందాలతో నాటి ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది. ఆ కాలంలో శ్రీదేవి సినిమాలంటే పడి చచ్చేవారు. కొన్ని సినిమాలు శ్రీదేవి కోసమే నడిచాయని చెప్పుకుంటారు.
ఇప్పుడు ఆమె కూతురు జాన్వీ కూడా Black and Whiteలో ఫొటోలకు ఫోజిలిచ్చింది. అచ్చం తల్లిలా మారిపోయిన జాన్వి షాకింగ్ లుక్ లో దర్శనమిచ్చింది. ఈ పిక్స్ చూసిన కొంతంది కొంటె కుర్రాళ్లు షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. చీరకట్టులో అందంగా ఉన్న జాన్వి జాకెట్ వేసుకోవడం మరిచిపోయిందా? అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టడం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
కొన్ని నెలలుగా వరుస ఆఫర్లు దక్కించుకున్న జాన్వీ ఈమధ్య సమ్మర్ టూర్స్ కు వెళ్ళింది. ఇందులో భాగంగా సౌదీ అరేబియా వెళ్లిన ఈ భామ తన ఫ్రెండ్స్ కలిసి తెగ ఎంజాయ్ చేసిందట. ఇక్కడ హాట్ హాట్ పిక్స్ తీసుకుందట. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్లు పురాతన కాలంలో కొన్ని ప్రాంతాల్లో జాకెట్ వేసుకోకుండా ఉన్న మహిళలను పోలి ఇప్పుడు జాన్వి కూడా వితౌట్ బ్లౌజ్ సారీ ధరించి ఆకట్టుకుంటోంది.
బాలీవుడ్ లో బిజీ అయిన ఈ భామ త్వరలో టాలీవుడ్ తెరపై కనిపించనుంది. ఎన్టీఆర్ తో కలిసి ఓ సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. కొరటాల శివ డైరెక్షన్లో రన్ అవుతున్న ఈ మూవీ త్వరలో జాన్వీతో సీరియస్ షూటింగ్ సాగనుంది. అయితే కాస్త గ్యాప్ దొరికినట్టుంది అందుకే జాన్వీ విదేశీ టూర్లతో బిజీగా మారింది. మరి ఎన్టీఆర్ తో ఈ భామ ఏ రేంజ్ లో కనిపిస్తుందో చూడాలి.