Cars: కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ తర్వాత పిల్లలు, పెద్దలు అనే తేడాల్లేకుండా చాలామంది వ్యక్తిగత వాహనాలను కొనుగోలు చేయడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. బడ్జెట్ ధరలో ఉండే కార్లకు రోజురోజుకు డిమాండ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం. మరికొన్ని రోజుల్లో దసరా పండుగ ఉన్న నేపథ్యంలో ప్రముఖ కార్ల కంపెనీలు సైతం అదిరిపోయే ఆఫర్లను ప్రకటించాయి. అద్భుతమైన ఫీచర్లతో 5 లక్షల రూపాయల బడ్జెట్ లో ఎన్నో కార్లు ఉన్నాయి.

నిస్సాన్ మాగ్నైట్ కారు ధర 5.71 లక్షల రూపాయల నుంచి 10.15 లక్షల రూపాయల వరకు ఉండగా ఈ పెట్రోల్ కారు లీటర్ కు 20 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. హైడ్రాలిక్ బ్రేక్ అసిస్ట్, సీట్ బెల్ట్ రిమైండర్, 360 డిగ్రీ కెమెరా, ఎయిర్ పూరిఫైయర్, టైర్ ప్రెషర్ మానిటరింగ్, 8 అంగుళాల ఇన్ఫో టైన్ మెంట్ తో పా్తు మరికొన్ని ఫీచర్లు ఈ కారులో ఉన్నాయి. టాటా టియాగో కారు ధర 4.99 లక్షల రూపాయల నుంచి 7.09 లక్షల రూపాయల వరకు ఉంది.
ఈ కారు మైలేజ్ లీటర్ కు 20 కిలోమీటర్లు కాగా ఏఎంటీ ఆటో, మాన్యువల్ ఫీచర్లతో ఈ కారు అందుబాటులో ఉంది. ఈ కారులో స్పీడ్ సెన్సిటివ్ ఆటో డోర్ లాకింగ్, పంక్చర్ రిపేర్ కిట్, రెండు ఎయిర్ బ్యాగులు, వెనుక వైపు పార్కింగ్ కెమెరా ఉన్నాయి. మారుతి ఎస్ ప్రెస్సో ధర 3.78 లక్షల రూపాయల నుంచి 5.43 లక్షల రూపాయల వరకు ఉంది. డాట్సన్ రెడిగో కారు ధర 3.97 లక్షల రూపాయల నుంచి 4.96 లక్షల రూపాయల వరకు ఉంది.
ఈ కారు యొక్క మైలేజ్ 22 కిలోమీటర్లు కాగా ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే, ఏబీఎస్ ఈబీడీ, మరికొన్ని ఫీచర్లు ఈ కారులో ఉన్నాయి. మారుతి సెలెరియో కారు ధర 4.65 లక్షల రూపాయల నుంచి 6 లక్షల రూపాయల వరకు ఉంది. రెనో క్విడ్ కారు ధర 4.06 లక్షల రూపాయల నుంచి 5.51 లక్షల రూపాయల వరకు ఉంది. బడ్జెట్ లో కారును కొనుగోలు చేయాలని అనుకునే వాళ్లకు ఈ ఆఫర్లు బెస్ట్ ఆఫర్లు అని చెప్పవచ్చు.