PM KISAN Yojana: కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ఎన్నో స్కీమ్స్ ను అమలు చేస్తోంది. రైతుల కోసం కేంద్రం ప్రత్యేకంగా అమలు చేస్తున్న స్కీమ్స్ లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన స్కీమ్ కూడా ఒకటనే సంగతి తెలిసిందే. కేంద్రం అమలు చేస్తున్న ఈ స్కీమ్ ద్వారా రైతులకు సంవత్సరానికి 6,000 రూపాయలు లభిస్తాయి. అయితే ఈ మొత్తం రైతుల ఖాతాల్లో కేంద్రం మూడు విడతల్లో జమ చేస్తుంది.

ఇప్పటివరకు కేంద్రం తొమ్మిది విడతల డబ్బులను రైతుల ఖాతాలలో జమ చేయగా త్వరలో పదో విడత డబ్బు జమ కానుందని తెలుస్తోంది. ఈ నెల 31వ తేదీన రైతుల ఖాతాలలో నగదు జమయ్యే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. అయితే మోదీ సర్కార్ నుంచి ఈ మేరకు అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కేంద్రం అమలు చేస్తున్న ఈ స్కీమ్ ద్వారా రైతులు ఆర్థికంగా లాభం పొందుతున్నారు.
అర్హత ఉండి ఇప్పటివరకు ఈ స్కీమ్ లో చేరని వాళ్లు వెంటనే చేరితే మంచిదని చెప్పవచ్చు. ఆన్ లైన్ ద్వారా లేదా సమీపంలోని మీసేవ కేంద్రాన్ని సంప్రదించి ఈ స్కీమ్ లో చేరే అవకాశం ఉంటుంది. న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ ద్వారా సులభంగా ఈ స్కీమ్ కొరకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. పొలం పాస్ బుక్, బ్యాంక్ అకౌంట్, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ సహాయంతో ఈ స్కీమ్ లో చేరవచ్చు.
కేంద్రం అమలు చేస్తున్న స్కీమ్స్ ద్వారా రైతులకు భారీస్థాయిలో ప్రయోజనం చేకూరనుందని చెప్పవచ్చు. రోజురోజుకు పెట్టుబడి ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం అమలు చేస్తున్న స్కీమ్స్ ద్వారా రైతులు ఎక్కువ మొత్తం పొందే అవకాశం అయితే ఉంటుంది.