Summer: ఎండాకాలం ఎండలు మండిపోతున్నాయి. మనుషులకు అదే విధంగా జంతువులు, వాహనాలకు కూడా ఈ ఎండ నుంచి జాగ్రత్త అవసరమే. కార్లు, బైకులకు కూడా ఈ సమయంలో జాగ్రత్త వహించకపోతే పాడవుతాయి. అందుకే వాహనాలను కాపాడుకోవడానికి కార్ల యజమానులు, డ్రైవర్లు అనేక రకాల మార్గాలను ఎంచుకుంటున్నారు. ముఖ్యంగా కారు లోపలి భాగాలను రక్షించడం అవసరం . ఇంజన్ నుంచి ప్రతి పార్ట్ ను ఎలా కాపాడుకోవాలో ఓ సారి ఇక్కడ తెలుసుకొని జాగ్రత్త వహించండి.
బయటి భాగం.. ఎండ వల్ల కారు రంగు పోతుంటుంది. మీ కారు రంగు మారకుండా ఉండాలంటే యూవీ కిరణాల నుంచి కాపాడుతూ వాష్ చేయడం, పెయింట్ వేయడం మంచిది. పెయింట్ ఒరిజినల్ కలర్ పోకుండా చూస్తుంది. వీలైతే కారును నీడలోనే పార్క్ చేయండి. లేదా కవర్ ను ఉపయోగించండి. ఇలా చేయడం వల్ల లోపలి భాగాలు కూడా చల్లగా ఉంటాయి.
ఇంజిన్ కూలింగ్.. కారుకు గుండె అయిన ఇంజన్ వేసవిలో హీట్ అవుతుంటుంది. కాబట్టి ఏసీ బాగుండేలా చూసుకోవాలి. ఏసీ సిస్టమ్ ను బయటకు వెళ్లినా, వచ్చిన తర్వాత అయినా చెక్ చేసుకోవడం మంచిది. అవసరమైతే ఏసీ రిచార్జ్ చేయించుకోవడం బెటర్. కూలింగ్ సిస్టమ్ లోని లీకులు వెంటనే రిపేర్ చేయడం వల్ల ఇంజిన్ డ్యామేజ్ అవకుండా ఉంటుంది. రేడియేటర్ మూసుకుపోయి ఉంటే వెంటనే మెకానిక్ కు చూపించండి.
టైర్ మెయింటెన్స్.. వేడి వల్ల కార్ల టైర్లు పంచర్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే టైర్ ప్రెజర్ ఏ స్థాయిలో ఉందో చెక్ చేసుకోవాలి. టైర్ గాలి తగ్గినా, లీక్ అవుతున్నా టైర్ మార్చాల్సిందే. కారులో స్టెఫినీ మస్ట్.
కారు ఇంటీరియర్.. కారులోని లోపలి భాగం కూడా వేడి అవుతుంటుంది. దీని వల్ల అసౌకర్యం కూడా కలుగుతుంది. అందుకే విండ్ షీల్డ్, కారు కిటికీలపై సన్ షేడ్స్ వాడటం ఉత్తమం. వీటి వల్ల డాష్ బోర్డ్ కు గీతలు పడకుండా ఉంటాయి. సీట్లను మృదువుగా ఉంచడానికి స్క్రాచ్ లేకుండా ఉండాలంటే లెదర్ కండీషనర్ అవసరం.
మరి తెలుసుకున్నారు కదా.. మీ కారు బాగుండాలి అంటే ఎండాకాలంలో ఈ టిప్స్ పాటించండి.లేదంటే ఈ వాతావరణం, అధిక ఉష్ణోగ్రతలకు కారు రిపేర్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. జాగ్రత్త.