Car Tips : భరించలేని వేసవి కాలం వచ్చేసింది. ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. కాబట్టి మీతో పాటు మీ వాహనాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. కారును సరిగ్గా చూసుకోకపోతే ప్రాణ, ఆస్తి నష్టం కూడా జరగవచ్చు. సాధారణంగానే వేసవి కాలంలో వాహనాల్లో మంటలు చెలరేగే ఘటనలు పెరుగుతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం.ఈ తప్పులు చేస్తే కారు ‘అగ్ని గోళం’గా కూడా మారవచ్చు.
Also Read : వేసవిలో మీ కారును జాగ్రత్తగా చూసుకునేందుకు ఈ చిట్కాలు పాటించండి
ఆగకుండా డ్రైవ్ చేయడం
సమ్మర్ వచ్చిందంటే పిల్లల స్కూళ్లు, కాలేజీలకు సెలవులు వస్తాయి. దీంతో సరదాగా టూర్లు వేస్తుంటారు. ఈ క్రమంలోనే చాలా మంది హిల్ స్టేషన్లకు వెళ్లడం ప్రారంభిస్తారు. అయితే మీరు ఎక్కువ దూరం ప్రయాణిస్తుంటే ఆగకుండా డ్రైవ్ చేయకుండా ఉండండి. నిరంతరం డ్రైవింగ్ చేయడం వల్ల వేసవిలో మీ కారు వేడెక్కవచ్చు. దీని కారణంగా కారు ఆగిపోవడమే కాకుండా, వేడెక్కడం వల్ల మంటలు చెలరేగే ప్రమాదం కూడా పెరుగుతుంది.
మెయింటెనెన్స్
కారు బాగానే నడుస్తుందని, సర్వీసింగ్ కాస్త ఆలస్యంగా చేయించుకోవచ్చని ప్రజలు భావిస్తారు. కానీ మీ నిర్లక్ష్యం మీకు చాలా ఖరీదైనదిగా మారుతుంది. సరైన సమయంలో సర్వీసింగ్ చేయకపోవడం ప్రమాదకరం. సర్వీసింగ్ సమయంలో కారులో ఎక్కడైనా సమస్య ఉందా లేదా అని పూర్తిగా తనిఖీ చేస్తారు. సరైన సమయంలో కారులో వస్తున్న సమస్యను పరిష్కరిస్తే ప్రమాదాన్ని నివారించవచ్చు. కాబట్టి సమయానికి సర్వీసింగ్ చేయించుకోవాలి.
కూలెంట్ కొరత
వేసవిలో కారు నడిపే ప్రతి ఒక్కరూ కారులో కూలెంట్ స్థాయిని పూర్తి స్థాయిలో ఉంచాలి. కూలెంట్ కొరత కారణంగా, కారులో వేడెక్కడం సమస్య వస్తుంది. దీని కారణంగా కారులో మంటలు చెలరేగే ప్రమాదం పెరుగుతుంది.
Also Read : కార్లు ఉన్నవారు వర్షా కాలంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏం చేయకుండా ఉండాలి?