Women Hair: మనం ఏదైనా ఆధ్యాత్మిక క్షేత్రానికి వెళ్లినప్పుడు అక్కడ కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఇవన్నీ పూర్వకాలంలో పెద్దలు చేయడంతో వారి నుంచి వారసత్వంగా నియమాలు పాటిస్తున్నాం. ఇందులో భాగంగా ప్రముఖ ఆలయాలకు వెళ్లినప్పుడు తల నీలాలు సమర్పించడం వంటివి వస్తోంది. సాధారణంగా ఎక్కువగా ఆలయాలకు వెళ్లినప్పుడు తమ జుట్టును దేవుడికి సమర్పిస్తుంటారు. కానీ తిరుమల లాంటి ప్రముఖ ఆలయాలకు వెళ్లినప్పుడు ఆడవారు కూడా తమ తలనీలాలను పూర్తిగా ఇస్తూ ఉంటారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం సతీమణి అన్నా లెజివో తిరుమల వెళ్లి తలనీలాలను సమర్పించారు. అయితే దీనిని దృష్టిలో ఉంచుకొని అంతకుముందు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గరికపాటి నరసింహారావు ఆడవాళ్లు తలనీలాలను పూర్తిగా సమర్పించకూడదు అని అన్న వీడియోలను వైరల్ చేస్తున్నారు. అసలు వాస్తవానికి ఆడవాళ్లు దేవుడికి తరలిరాలను పూర్తిగా సమర్పించవచ్చా? గరికపాటి అలా ఎందుకు అన్నారు?
గరిగపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఈ వీడియోలో గరికపాటి మాట్లాడుతూ తలనీలాలు సమర్పించడం అంటే మనలోని అహంకారాన్ని పూర్తిగా తొలగించుకోవడం. అయితే ముత్తయిదుగా ఉన్న ఆడవాళ్లు తమ తలనీలాలను పూర్తిగా తొలగించకూడదు అని ఆయన అన్నారు. ఆడవారి అందంను లక్ష్మీదేవితో పోలుస్తారు. అలాంటి లక్ష్మీదేవి ఇలా ఉన్న ఆడవారి జుట్టును కత్తిరించడం వల్ల దోషం అని గరికపాటి నరసింహారావు గతంలో అన్నారు. అయితే మూడు కత్తెరలు మాత్రం ఇవ్వవచ్చు అని.. అవి కూడా అవసరం లేదని అన్నారు.అయితే ఆ వీడియోలను ఏపీ డిప్యూటీ సీఎం సతీమణి తన తలనీలాలను దేవుడికి సమర్పించిన తర్వాత వైరల్ చేశారు. కానీ దీనిపై భిన్నవాదాలను వస్తున్నాయి. అసలు నిజంగానే ఆడవారు దేవుడికి తలనీలాలు సమర్పించవచ్చా? అన్నా చర్చ సాగుతోంది.
అయితే కొందరు ఆధ్యాత్మిక వాదులు మాట్లాడుతూ.. దేవుడికి తలనీలాలు సమర్పించడం అనేది ఎవరి ఇష్టం వారిది అని.. దానికి ఎవరో ఒకరు నియమం పెట్టడం సరికాదు అని అంటున్నారు. తలనీరాలు సమర్పించడం అంటే ఒక మనిషిలోని అహంకారాన్ని పూర్తిగా వదిలేయడం.. తలలో ఉన్న అహంకారాన్ని వదులు కోవడం అంటే అందాన్ని వదులుకోవడం కోసమే ఆడవారు తమ తలనీలాలను సమర్పిస్తూ ఉంటారని అంటున్నారు. అయితే తలనీలాలు దేవుడికి సమర్పించడం వల్ల ఎవరికైనా పుణ్యమే వస్తుంది అని.. ఇది తప్పు అని కొందరు అంటున్నారు. ఎందుకంటే పురాతన కాలంలో భర్త చనిపోయినప్పుడు భార్య అందంగా కనిపించకూడదని శిరోముండనం చేయించేవారు. ఈ ఉద్దేశంతోనే కొందరు అలా చెబుతున్నారని అంటున్నారు. తమ పెద్దలు చెప్పిన విధంగా ఆచారాన్ని పాటించడం ఎవరి ఇష్టం వారిది అని అంటున్నారు. దైవచింతనలో భాగంగా చాలామంది తిరుమలలో ఆడవారు తమ తలనీలాలు ఇస్తుంటారని.. ఇప్పటికే చాలామంది ప్రముఖులు తలనీలాలు సమర్పించారని అంటున్నారు.