Anirudh And Kavya Maran: నిప్పు లేనిదే పొగరాదు అంటారు. కాకపోతే ఈ పొగ వచ్చినప్పుడు సెలబ్రిటీలు కాదు కూడదు అంటూ సమాధానం చెబుతుంటారు.. పైగా అవన్నీ వదంతులని.. వాటిని నమ్మకూడదని.. పుకార్లను నిజాలని భావించకూడదని నీతులు చెబుతుంటారు.. చివరికి దొరికిపోయిన తర్వాత తలదించుకుని వెళ్ళిపోతుంటారు.. ఆ తర్వాత ఇదే ప్రశ్నను మీడియా గనుక అడిగితే తమకు కూడా వ్యక్తిగత జీవితం ఉంటుంది కదా అంటూ రమణ మహర్షి లాగా జీవిత సత్యాలు చెబుతుంటారు. మనదేశంలో సెలబ్రిటీలు ప్రేమ వ్యవహారాలు సాగించడం.. మీడియాకు దొరికిపోవడం.. ఆ తర్వాత తన బంధాన్ని ఓపెన్ గా చెప్పేయడం ఎప్పటినుంచో కొనసాగుతున్నదే.
ప్రస్తుతం సోషల్ మీడియా యుగం లోకి వచ్చిన తర్వాత సెలబ్రిటీల గురించి ప్రతి చిన్న విషయం కూడా వెంటనే తెలుస్తోంది.. సోషల్ మీడియాలో ఏ విషయం కూడా దాగే అవకాశం లేదు. ఒకవేళ సెలబ్రిటీలు జాగ్రత్తగా అడుగులు వేసినప్పటికీ అది మిగతా ప్రపంచానికి తెలియకుండా ఆగడం లేదు.. తాజాగా ఈ జాబితాలోకి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు యజమాని కావ్య మారన్ చేరింది.. వాస్తవానికి కావ్య చాలా చాలాకిగా ఉంటుంది. మైదానంలో చిచ్చర పిడుగు మాదిరిగా తిరుగుతూ ఉంటుంది. జట్టు విజయం సాధిస్తే ఎగిరి గంతులు వేస్తుంది.. ఓడిపోతే చిన్నపిల్ల మాదిరిగా కన్నీరు పెడుతుంది.. అందువల్లే కావ్యను చాలామంది అభిమానిస్తుంటారు.. ప్రేమిస్తుంటారు.. సోషల్ మీడియాలో ఆమె గురించి రకరకాల వీడియోలను పోస్ట్ చేస్తూ ఉంటారు.
కావ్య వ్యక్తిగత జీవితం గురించి మొన్నటిదాకా పెద్దగా తెలిసేది కాదు. పైగా తను లో ప్రొఫైల్ మెయింటైన్ చేయడం వల్ల జనాలకు కూడా ఆమె గురించి సమాచారం అంతగా తెలిసేది కాదు. అయితే కావ్య గురించి గతంలో ఒక విషయం బయటకు వచ్చింది.. ఆమె గతంలో సంగీత దర్శకుడు అనిరుధ్ తో రిలేషన్ లో ఉన్నట్టు ప్రచారం జరిగింది. అయితే దానిని కావ్య ఖండించింది. అనిరుధ్ కూడా మీడియాతీరును తప్పుపట్టాడు. అయితే ఇప్పుడు వీరిద్దరూ జంటగా కనిపించారు. న్యూయార్క్ లో వీరిద్దరూ కలిసి తిరుగుతుండగా ఓ యూ కే వ్లాగర్ వీడియో తీశాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రకంపనలు సృష్టిస్తోంది. గతంలో వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారని.. పెళ్లి కూడా చేసుకుంటారని ప్రచారం జరిగింది. అయితే దానిని వారిద్దరూ అప్పట్లో ఖండించారు. ఇప్పుడు మాత్రం జంటగా దొరికిపోయారు. ఆమధ్య జైలర్ సినిమా సూపర్ సక్సెస్ అయిన తర్వాత సన్ పిక్చర్స్ అధినేత కళానిధి (కావ్య తండ్రి) మారన్ అత్యంత ఖరీదైన కారును అనిరుధ్ కు కానుకగా ఇచ్చాడు. అన్నట్టు రజనీకాంత్ సతీమణి లత సోదరుడి కొడుకే అనిరుధ్.
அமெரிக்காவில் இசையமைப்பாளர் அனிருத் மற்றும் காவ்யா மாறன் இணைந்து வலம் வந்த வீடியோ இணையத்தில் வைரல்https://t.co/wupaoCz9iu | #Anirudh #Kaviyamaran #Cinema #Viral #ABPNADU pic.twitter.com/Wf5F5C3WvB
— ABP Nadu (@abpnadu) November 13, 2025