Bigg Boss 9 Telugu Thanuja: తెలుగు బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) హిస్టరీ లో మొట్టమొదటి లేడీ టైటిల్ విన్నర్ గా తనూజ నిలబడుతుందా?,ఇప్పటి వరకు ఓటింగ్ లో తన తోటి కంటెస్టెంట్స్ అందరి మీద కనీవినీ ఎరుగని రేంజ్ లీడింగ్ తో కొనసాగుతూ వచ్చిన ఆమె, ఇక మీదట కూడా అదే లీడింగ్ తో కొనసాగబోతుందా అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. మొదటి వారం నుండి ఈమె టాస్కుల పరంగా తనవంతు ఎంత కృషి చేయగలదో, అంత కృషి చేస్తూ వచ్చింది. కానీ కెప్టెన్సీ అవ్వాలనే తన కోరిక మాత్రం ఇప్పటి వరకు తీరలేదు. చివరి వరకు రావడం, చేజారిపోవడం తనూజ కి అలవాటుగా మారిపోయింది. గత వారం ఆమెకు కెప్టెన్సీ టాస్కు నుండి ఎంత అన్యాయంగా తీసేసారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆమె ఏడ్చిన ఏడుపు ని చూసి ఆడియన్స్ కూడా అయ్యో పాపం అంటూ కంటతడి పెట్టుకున్నారు.
కానీ ఈ వారం మాత్రం ఆమె కెప్టెన్ అయ్యేందుకు నూటికి 99 శాతం ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఈ వారం జరుగుతున్న ‘బిగ్ బాస్ కింగ్డమ్’ టాస్క్ లో కమాండర్ గా కొనసాగుతూ వచ్చిన తనూజ, ఈరోజు కింగ్ స్థానం లో ఉన్న కళ్యాణ్ తో తలపడి, అతన్ని ఒక టాస్క్ లో ఓడించి, మహారాణి స్థానాన్ని సొంతం చేసుకుంది. పవన్ కళ్యాణ్ ని ఓడించడం అనేది చిన్న విషయం కాదు. ఎందుకంటే ప్రస్తుతం అతను ఓటింగ్ లో టాప్ 2 స్థానం లో ఉన్నాడు. టాస్కులు కూడా చాలా బాగా ఆడుతాడు. అలాంటి వ్యక్తిని ఓడించి, అతన్ని రాజు స్థానం నుండి తప్పించింది అంటే ఇక ఈరోజు ఎపిసోడ్ టెలికాస్ట్ తర్వాత తనూజ గ్రాఫ్ ఏ రేంజ్ లో పెరగబోతుందో ఊహించుకోవచ్చు. ప్రస్తుతానికి కెప్టెన్సీ కంటెండర్లు గా రీతూ చౌదరి, నిఖిల్ మరియు తనూజ నిలిచారు.
వీరిలో ఎవరు కెప్టెన్ అవ్వబోతున్నారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారిన అంశం. ఈ టాస్క్ ఎలా ఉండబోతుంది?, సపోర్టింగ్ టాస్క్ లాగానే ఉంటుందా?, లేదంటే సాధారణమైన టాస్క్ లాగానే ఉంటుందా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ తనూజ కెప్టెన్ అయితే మాత్రం ఆమెని మొదటి స్థానం నుండి క్రిందకు దించడం ఎవరి తరం కాదు. ఎందుకంటే వచ్చే వారం ఫ్యామిలీ వీక్ ఉండనుంది. ఫ్యామిలీ వీక్ లో తన కుటుంబం ముందు కెప్టెన్ గా నిల్చుంటే ఎంతటి ఎలివేషన్ వస్తుందో మీరే ఊహించుకోండి. బిగ్ బాస్ ఎదో చాలా పెద్ద డ్రామా నే క్రియేట్ చేసేందుకు స్టేజి ని సెట్ చేసాడు. ఇక చూడాలి వచ్చే వారం ఎలా ఉండబోతుంది అనేది.