Live-In Relationship: ఆధునిక కాలంలో పెరుగుతున్న లివ్ ఇన్ రిలేషన్షిప్ సంస్కృతిపై ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందిబెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సంస్కృతి భారతీయ నైతిక విలువలకు విరుద్ధమంటూ.. ఈ సంస్కృతి పాటిస్తే 50 ముక్కలై కనిపిస్తారంటూ హెచ్చరించారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలో మహాత్మా గాంధీ కాశీ విద్యా పీఠం, జననాయక్ చంద్రశేఖర్ విశ్వవిద్యాలయంల స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మాట్లాడారు. విదేశీ సంస్కృతి అయిన లీవ్ ఇన్ రిలేషన్షిప్ మాయలో భారతీయ యువతులు పడుతున్నారని.. 15 నుంచి 20 ఏళ్ల లోపు అమ్మాయిలు ఇందులో ఉండడం బాధాకరమని ఆమె అన్నారు. ఈ సంబంధాల పట్ల యువతులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.
లివ్ ఇన్ రిలేషన్షిప్ పై ఆనందిబెన్ సంచల కామెంట్స్ చేశారు. ఈ మాయలో పడిన యువతులు కొన్ని రోజుల తర్వాత 50 ముక్కలై కనిపిస్తారని అన్నారు. భారతీయ యువతలకు నేనిచ్చే సలహా ఒకటి ఏంటంటే.. లీవ్ ఇన్ రిలేషన్షిప్ వల్ల ఎన్నో పర్యావసనాలు చూస్తున్నాం. యువతులు 50 కనిపించిన దృశ్యాలు ఇప్పటికే చూశాం.. గత కొన్ని రోజులుగా ఇలాంటి కేసులు ఎక్కువగా వినిపిస్తున్నాయి. చాలామంది అమ్మాయిలు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ తప్పు దోవపడుతున్నారు. వీటి గురించి విన్నప్పుడల్లా బాధ కలుగుతుంది. అందువల్ల ఇటువంటి సంబంధాల జోలికి వెళ్లకుండా ఉండడమే మంచిది అని అమ్మాయిలకు సూచించారు.
అలాగే లివ్ ఇన్ రిలేషన్ షిప్ వల్ల ఎంతోమంది అనాథలుగా మారుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంబంధాలు మెయింటైన్ చేసేవాళ్లు అనాథ ఆశ్రమాలకు వెళ్లి చూడాలని చెప్పారు. అక్కడ 15 నుంచి 20 వేల లోపు ఉన్న అమ్మాయిలు చేతిలో చిన్న పిల్లలతో కనిపిస్తారని పేర్కొన్నారు. యువతులు తాత్కాలిక మోజులో పడి తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని.. అలా కాకుండా విద్యపై దృష్టి పెట్టి ఉన్నత లక్ష్యాల కోసం కష్టపడాలని ఆనందిబెన్ పటేల్ కోరారు. ఏ నిర్ణయం తీసుకోవాలని అనుకున్న తల్లిదండ్రులను సంప్రదించాలని.. చదువు తప్ప మరి ఏది జీవితాన్ని నిలబెట్టదని ఆమె హెచ్చరించారు.
అయితే గవర్నర్ చేసిన వ్యాఖ్యలపై మిశ్రమ ఫలితాలు వస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర యూనివర్సిటీల చాన్సలర్ హోదాలో ఉండి ఆమె చేసిన ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. కొందరు ఈ వ్యాఖ్యలపై సమర్థిస్తుండగా.. మరికొందరు మహిళల వ్యక్తిగత స్వేచ్ఛకు ఇవి విరుద్ధమని అంటున్నారు. కానీ లివ్ ఇన్ రిలేషన్ షిప్ అనేది యువతులకు నష్టమే కానీ ఎలాంటి లాభం ఉండదని మరికొందరు చెబుతున్నారు. ఇప్పటికే చాలామంది యువతులు మోసపోయి అనాధలుగా మారిన సంఘటనలు ఉన్నాయి. గవర్నర్ చేసిన ఈ వాఖ్యలను ప్రతి ఒక్క యువతి గుర్తుంచుకోవాలని అంటున్నారు.