High Salary Jobs : నేటి కాలంలో ఎవరైనా డబ్బు కోసమే పని చేస్తారు. కానీ చాలామందికి ఎక్కువ డబ్బులు సంపాదించాలన్న ఆశ ఉంటుంది. ఇందుకోసం పెద్దపెద్ద ఉద్యోగాలు చేయాలని అనుకుంటారు. ఆ ఉద్యోగాల కోసం మొదటి నుంచే బాగా చదువుకుంటారు. అయితే కొందరు చదివిన చదువుకు తగిన ఉద్యోగం రాలేదని బాధపడతారు. ఎందుకంటే వారు ఎంచుకున్న కోర్స్ సరిగా లేదని.. ఎంచుకున్న రంగం బాగాలేదని అంటూ ఉంటారు. అసలు ఏ రంగంలో ఎక్కువ డబ్బు సంపాదిస్తారు? ఏ రంగంలో ఎక్కువ జీతం ఇస్తారు? ఆ వివరాలు కి వెళ్తే..
మెడికల్
మెడికల్ ప్రొఫెషనల్ లోకి వెళ్తే మిగతా వారి కంటే ఎక్కువగా డబ్బు సంపాదించవచ్చు. ఇందులో ఎంబిబిఎస్ పూర్తి చేసిన తర్వాత ఏదైనా ఒక విషయంలో ప్రతిభ చూపిస్తే వారికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా గైనకాలజిస్ట్, సర్జన్లకు 6 లక్షల నుంచి 50 లక్షల రూపాయల వరకు జీతం ఉండే అవకాశం ఉంటుంది. ఇండియాలోనే కాకుండా ఇతర దేశాల్లో సర్జన్లకు బాగా డిమాండ్ ఉంది. అందుకే చాలామంది వైద్య వృత్తిని ఎంచుకుంటూ ఉన్నారు.
ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్
కొన్ని కంపెనీలు, ప్రభుత్వాలు స్టాక్ లేదా బాండ్ల ద్వారా నిధులు సేకరిస్తూ ఉంటాయి. ఈ నిధులను బ్యాంకర్లు జారీ చేస్తాయి. కంపెనీలు ఇతర కంపెనీలను కొనడానికి.. లేదా విలీనం చేయడానికి బ్యాంకింగ్ రంగం ఉపయోగపడుతుంది. అలాగే క్లిష్టమైన పరిస్థితిలో ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడానికి ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ వారు హెల్ప్ చేస్తారు. కొత్త సెక్యూరిటీలను ఎప్పుడు అమ్మాలి? ఎప్పుడూ కొనుగోలు చేయాలి? అనే విషయాలను కంపెనీలకు సలహాలు ఇస్తుంటారు. ఇలాంటి వారికి మార్కెట్లో బాగా డిమాండ్ ఉంది. వీరు రూ.10 లక్షల నుంచి రూ. 50 లక్షల వరకు సంపాదిస్తారు.
ఫైనాన్స్ కన్సల్టెంట్
ఆదాయం, ఖర్చులు, అప్పులు వంటి డేటాను సేకరించి ఆర్థిక పరిస్థితిని అంచనా వేసేవారు ఫైనాన్స్ కన్సల్టెంట్. మీరు పెట్టుబడులు, పొదుపుల గురించి ఖాతాదారులకు మార్గ నిర్దేశం చేస్తారు. ఆర్థిక లక్ష్యాలను సాధించడంలో వివరచన చేస్తారు. ఒక సంస్థ పై ఆర్థిక నివేదికలను విశ్లేషించి అవి ఎలాంటి ప్రభావం చూపుతాయో తెలుపుతారు. ఖర్చులు చేయాలా? పొదుపు చేయాలా అనే విషయాన్ని చెప్పి కంపెనీలకు సలహాలు ఇస్తారు. ఇలాంటి వారికి కూడా ఎక్కువ జీతం ఇచ్చి నియమిచ్చుకుంటారు. మీరు రూ. 20 లక్షల నుంచి రూ.1.5 కోట్ల రూపాయలు సంపాదించే అవకాశం ఉంది.
ప్రోడక్ట్ మేనేజర్
ప్రోడక్ట్ మేనేజర్ ఒక వస్తువు ఉత్పత్తి యొక్క దార్శని కతను రూపొందిస్తాడు. ఒక కంపెనీకి కావాల్సిన అవసరాలను గుర్తించి లక్ష్యం చేరే దిశగా ముందుకు వెళ్తాడు. ఉత్పత్తికి సంబంధించిన రోడ్ మ్యాప్ ను రూపొందించి.. వినియోగదారుల అవసరాలను తెలియజేస్తాడు. విభాగాల మార్కెటింగ్ డిజైన్ చేసి సేల్స్ను పెంచుతాడు. ఇలాంటివారు 25 లక్షల రూపాయల నుంచి రెండు కోట్ల వరకు ఆదాయాన్ని పొందుతున్నారు.
ఏఐ మేనేజర్
ప్రస్తుత సమయంలో Artificial Intelligence (AI) రంగం దూసుకుపోతుంది. ఈ రంగంలో నిపుణులైన వారికి చాలా డిమాండ్ ఉంటుంది. ఈ రంగంలో పనిచేసే వారికి 30 లక్షల నుంచి 2.5 కోట్ల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది.