Eggs : కోడిగుడ్డు తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కోడిగుడ్డులో కాల్షియంతో పాటు విటమిన్ బి, విటమిన్ డి ఉంటాయి. అలాగే ఇందులో జింక్ వంటి పదార్థాలు ఉంటాయి. అందువల్ల గర్భిణీలు, చిన్నపిల్లలు ప్రతిరోజు ఒక కోడిగుడ్డు తినాలని చెబుతూ ఉంటారు. అంగన్వాడి సెంటర్లు.. కొన్ని స్కూళ్లలో ప్రతిరోజు గుడ్డును సరఫరా చేస్తూ ఉంటారు. అయితే వేసవికాలం రాగానే చాలామంది గుడ్డును దూరంగా పెడుతూ ఉంటారు. కోడిగుడ్డు తినడం వల్ల ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుందని.. శరీరానికి వేడి చేస్తుందని భయపడిపోతూ ఉంటారు. దీంతో చాలామంది గుడ్డుకు దూరంగా ఉంటారు. అసలు కోడిగుడ్డు వల్ల నిజంగానే వేసవిలో శరీరానికి వేడి చేస్తుందా? ఆ వివరాల్లోకి వెళితే.
Also Read : ఈస్టర్ ఎగ్స్ అంటే? రంగురంగుల గుడ్లు ఎందుకు ఉపయోగిస్తారంటే?
రోజు ఒక గుడ్డు తినండి అంటూ ప్రభుత్వం సైతం ప్రచార కార్యక్రమాలు ప్రారంభించింది. గుడ్డు తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కోడిగుడ్డు తినడం వల్ల శరీరానికి తక్షణ శక్తి ఇవ్వడమే కాకుండా.. శరీరంలో ఎలాంటి అదనపు కొలెస్ట్రాల్ ఉన్న వెంటనే కరిగిస్తుంది. అంతేకాకుండా బరువు తగ్గాలని అనుకునేవారు ప్రతిరోజు పొద్దున సాయంత్రం రెండు కోడిగుడ్లు తినాలని చెబుతూ ఉంటారు. ఇక క్రీడల్లో పాల్గొనేవారు సాధ్యమైనంతవరకు ఎక్కువగా కోడిగుడ్లు తినాలని అంటారు. ఎందుకంటే కోడిగుడ్ల వల్ల బోన్స్ దృఢంగా మారిపోతాయి. కండరాలు బలపడతాయి. పిల్లలు కోడిగుడ్లు తినడం వల్ల వారిలో ఎదుగుదల మెరుగ్గా ఉంటుంది.
అయితే వేసవిలో కోడిగుడ్లు తినవద్దని చాలామంది చెబుతూ ఉంటారు. కానీ వేసవిలో కూడా కోడిగుడ్లు తినవచ్చు. అయితే ఏదైనా ఆహారం మితంగా తీసుకుంటేనే ఆరోగ్యం.. అంతకుమించితే అనారోగ్యమే అవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో భాగంగా ప్రతిరోజు రెండు కోడిగుడ్లను తినవచ్చని పేర్కొంటున్నారు. అంతకుమించి ఎక్కువగా కోడిగుడ్లు తినడం వల్ల అనారోగ్యమే అవుతుందని పేర్కొంటున్నారు. అయితే ఇతర వ్యాధులు ఉన్నవారు.. శరీరంలో ఉష్ణోగ్రత అధికంగా ఉన్నవారు వేసవిలో మాత్రం కోడిగుడ్లకు దూరంగా ఉండాలని కోరుకుంటున్నారు. ఈ విషయంలో రైతులను సంప్రదించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని అంటున్నారు.
మిగతావారు మాత్రం ప్రతిరోజు రెండు కోడిగుడ్లను తినవచ్చు అని అంటున్నారు. వేసవిలో లేదా ఇతర కాలంలో కోడిగుడ్లు ఒకే రకమైన శక్తిని అందిస్తాయి. అందువల్ల కాలాన్ని బట్టి కోడిగుడ్డులో ఉన్న పోషకాలు మారవు. ఇవి ఎప్పటికీ ఒకేలాగా ఉంటాయి కాబట్టి.. ఎప్పుడైనా వీటిని తినే అవకాశం ఉంటుందని అంటున్నారు. అందువల్ల కోడిగుడ్ల విషయంలో అపోహలు మాని ప్రతిరోజు రెండు కోడిగుడ్లు తినాలని అంటున్నారు. ప్రతిరోజు రెండు కోడిగుడ్లు తినడం వల్ల కడుపు నిండినట్లుగా మారి ఎక్కువ ఆహారాన్ని తినకుండా ఉంటారు. దీంతో బరువు పెరగకుండా ఉంటారు. అలాగే ఫైబర్ ని పొందాలని అనుకునే వారు కూడా కోడిగుడ్లన్నీ తినవచ్చు అని చెబుతున్నారు.
అయితే కోడిగుడ్డు అనగానే చాలామంది ఆమ్లెట్ వేసుకుంటూ ఉంటారు. ఇలా ఆమ్లెట్ వేసుకునే బదులు బాయిల్డ్ అయిన ఎగ్ను తినడం ఎంతో మంచిది అని చెబుతున్నారు. ఆమ్లెట్ వేసి ప్రాసెస్ చేయడం వల్ల అధిక నూనె లేదా మసాలాతో శరీరానికి అనారోగ్యం ఉండే అవకాశం ఉంటుంది. అయితే టేస్టీ కోసం అప్పుడప్పుడు ఆమ్లెట్ కూడా తినవచ్చని చెబుతున్నారు. కానీ బాయిల్డ్ ఎగ్ మాత్రం ఆరోగ్యమే అని చెబుతూ ఉంటారు.
Also Read : ‘గుడ్లు’ తేలేస్తున్న అమెరికన్లు.. గుడ్లు కొనాలంటే అమెరికాలో అష్టకష్టాలు.. అసలేమైందంటే?