BP Control:అధిక రక్తపోటు (హైబీపీ) ఇప్పుడు చాలా మందిని వేధిస్తోంది. రక్తపోటును నియంత్రణలో ఉంచుకోకపోతే ప్రాణాలకే ప్రమాదం. దీంతో చాలా రోగాలు ముడిపడి ఉంటాయి. మొదట బీపీతో గుండెజబ్బు ముప్పు ఎక్కువగా ఉంటుంది. మనం తీసుకునే ఆహారం, ఒత్తిడి వల్ల బీపీ పెరుగుతుంది. రక్తపోటు రావడానికి పలు సంకేతాలు కూడా ముందే వస్తాయి. కానీ మనం గుర్తించం. దీంతో అది కాస్త తీవ్రమైతే మందులు వాడాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఈ నేపథ్యంలో బీపీని నియంత్రణలో ఉంచుకోవాల్సిన అవసరం ఏర్పడుతోంది. ఆధునిక జీవనశైలి, మనం తీసుకునే ఆహారాలే మనకు ప్రతిబంధకాలుగా మారుతున్నాయి.

రక్తపోటు వల్ల గుండె, మూత్రపిండాలు దెబ్బతినడానికి ప్రధాన కారణంగా పరిణమిస్తుంది. మన జీవనశైలిని మార్చుకుంటే రక్తపోటును తగ్గించుకోవచ్చు. రక్తపోటు సాధారణంగా ఉంటే అనారోగ్య సమస్యల నుంచి దూరం కావచ్చు. ఉదయం పూట నడక, వ్యాయామం రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయి. దీంతో ఒత్తిడి కూడా తగ్గుతుంది. వారంలో కనీసం ఐదు రోజులైనా నడక కొనసాగిస్తే బీపీ తగ్గడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఇంకా ఉప్పు వాడకం మానేయాలి. దీనితో కూడా బీపీ లేకుండా పోతుంది. దీని వల్ల మన ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది.
మనకు తెలియకుండానే ఉప్పు ఎక్కువగా తింటుంటాం. దీంతో గుండెకు ప్రమాదమే. ఉప్పు అధికంగా తినడం వల్ల రక్తపోటు పెరిగి దాంతో గుండె పోటు వచ్చే ముప్పు ఎక్కువగా ఉంటుంది. ఇది మన ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుంది. వీలైనంత వరకు ఉప్పును తగ్గించడమే మంచిది. లేదంటే కచ్చితంగా గుండెపోటు వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. మనం తీసుకునే ఆహారంలో కూడా సోడియం ఉంటుంది. అందుకే మనం బయట నుంచి ఉప్పు తీసుకోవాల్సిన అవసరం ఉండదు. కానీ చాలా మంది ఉప్పు వేసుకుని తినేందుకు ప్రాధాన్యం ఇస్తారు.
ఒక మనిషి రోజుకు మితంగా అయితే ఒక గ్రాము ఉప్పు తీసుకోవాలి. మనం ప్రతి కూరలో ఉప్పు వాడకంతో దాదాపు నాలుగైదు గ్రాముల ఉప్పు తింటున్నాం. ఇదంతా గుండె చుట్టు ఉన్న రక్తనాళాల్లో పేరుకుపోయి గుండెపోటుకు దారితీస్తుంది. దీంతో డెబ్బయి ఏళ్లకు రావాల్సిన గుండెపోటు పాతికేళ్లకే రావడం గమనార్హం. పొటాషియం హృదయ స్పందన రేటును నియంత్రిస్తుంది. రక్తపోటును నియంత్రణలో ఉంచుకోకపోతే మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ నేపథ్యంలో ఉప్పును సాధ్యమైనంత వరకు తగ్గించుకుని మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

తాజా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పాలు, గుడ్లు వంటివి తీసుకుంటే రక్తపోటు అదుపులో ఉంటుంది. వైద్యుడి సలహా మేరకు మన జీవనశైలిని మార్చుకోవాలి. మద్యం తాగడం కూడా మానేయాలి. అల్కహాల్ తాగడం వల్ల రక్తపోటు కంట్రోల్ లో ఉంటుంది. శీతల పానీయాలు తీసుకుంటే అందులో ఉండే చక్కెరతో కొవ్వు పెరగడంతో అధిక బరువు సమస్య ఏర్పడుతుంది. జీవన శైలిలో మార్పులు చేసుకోకపోతే బీపీ కంట్రోల్ కు రాకపోవడంతో ఇతర సమస్యలు వచ్చే వీలుంటుంది.