Zodiac Signs: శని గ్రహం పట్టీ పీడిస్తే ఏడేళ్ల వరకు ఉంటుందని కొందరు పండితులు చెబుతారు. అందువల్ల శని దేవుడు అనగానే చా లామంది భయపడిపోతూ ఉంటారు. అయితే శని గ్రహం అనుగ్రహం వల్ల కొన్ని రాశుల వారికి పంట పండుతుంది. శని గ్రహం ఏ రాశిలో ప్రవేశిస్తే ఆ రాశిలో రెండు సంవత్సరాల పాటు సంచరిస్తారు. ప్రస్తుతం కుంభ రాశిలో ఉన్న శని దేవుడు ఏప్రిల్ 29న మీన రాశిలోకి అడుగుపెట్టబోతున్నాడు. ఈ సందర్భంగా కొన్ని రాశులపై ప్రభావం పడింది. దీంతో ఆ రాశుల వారు అదృష్టవంతులుగా మారిపోతున్నారు. ఇంతకీ ఆ రాశులు ఏవంటే?
శని గ్రహం రాశి మారడం వల్ల వృషభ రాశి పై ప్రభావం పడనుంది. మీ రాశి వారు ఇప్పటినుంచి ఏ పని మొదలు పెడితే ఆ పని సక్సెస్ అవుతుంది. గతంలో పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేసుకుంటారు. ఇంట్లో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి. అనుకోకుండా డబ్బులు వసూలు అవుతాయి. కొత్తగా ప్రాజెక్టులు చేపట్టేవారు విజయవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల మద్దతుతో ఉద్యోగులు ఉల్లాసంగా ఉంటారు. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. అయితే ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
మిథున రాశి వారికి శని ప్రభావం పడనుంది. ఈ రాశి వారు ఉగాది నుంచి అదృష్టాన్ని పొందుతారు. దీంతో కొత్త ప్రాజెక్టులు ఏది చేపట్టిన విజయవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల మద్దతుతో కొత్త పెట్టుబడులు పెడతారు. ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉంటుంది. దీంతో ప్రశంసలు పొందుతారు. కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. స్నేహితులతో ఉల్లాసంగా ఉంటారు. వ్యాపారంలో వృద్ధి ఉంటుంది.
తులా రాశి వారికి ఉగాది నుంచి అనుకూల ఫలితాలు ఉండనున్నాయి. కుటుంబ సభ్యులతో వేరు ఉల్లాసంగా ఉంటారు. అనుకోని అదృష్టం వల్ల ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. పెండింగు బకాయిలు వసూలు అవుతాయి. ఉద్యోగులకు పదోన్నతి లభించే అవకాశం ఉంది. అనుకోకుండా విహారయాత్రలకు వెళ్లాల్సి వస్తుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
వృశ్చిక రాశి వారికి ఉగాది నుంచి అన్ని మంచి శకునాలే ఉండాలు ఉన్నాయి. వీరు ఇంతకాలం ఎదుర్కొంటున్న కష్టాల నుంచి బయటపడతారు. అయితే వ్యాపారులు శత్రువులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. వారి నుంచి ఎదుక్కోవడానికి కొన్ని పరిహారాలు చేయాల్సి ఉంటుంది. ఉద్యోగులు కొంత ఒత్తిడిని ఎదుర్కొన్నా.. ఆ తర్వాత ఉల్లాసంగా మారిపోతారు.
మకర రాశి వారికి శని అనుకూలంగా మారనున్నారు. మీరు ఎలాంటి కష్టాన్ని ఎదుర్కొన్న శని దేవుడికి పూజలు చేయడం వల్ల.. వాటి నుంచి బయటపడతారు. ఉద్యోగులు ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు. కుటుంబంలో ఉన్న వివాదాలు సమసి పోతాయి. కొత్త ప్రాజెక్టులను చేపడతారు. అయితే కొత్త వ్యక్తులతో ఆర్థిక వ్యవహారాలు జరపొద్దు.
కుంభ రాశి వారికి ఇంతకాలం ఉన్న కష్టాలు తొలగిపోతాయి. ఇప్పటినుంచి వేరు పట్టిందల్లా బంగారమే అవుతుంది. బంధువుల నుంచి ధన సహాయమందుతుంది. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. శత్రువుల పన్నాగం నుంచి తప్పించుకుంటారు.