https://oktelugu.com/

Jabardasth – Dhee : జబర్దస్త్-ఢీ షోలలో భారీ మార్పులు… ఇవి మీరు గమనించారా?

రెండు రోజులు జబర్దస్త్ షోనే ప్రసారం అవుతుంది. కాగా గతంలో ఉన్నంత ఆదరణ ఇప్పుడు జబర్దస్త్ షోకి లేదు. అందుకే మల్లెమాల సంస్థ కీలక మార్పులు చేసింది.

Written By:
  • NARESH
  • , Updated On : June 3, 2024 / 06:30 PM IST

    Big changes in Jabardasth - Dhee shows

    Follow us on

    Jabardasth – Dhee  : ఈటీవీలో ప్రసారం అవుతున్న ఢీ, ఇంకా జబర్దస్త్ షోలకు ఉన్న క్రేజే వేరు. దశాబ్దానికి పైగా బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఢీ డాన్స్ షో ద్వారా ఎంతో మంది డాన్సర్లు, కొరియోగ్రాఫర్స్ వెలుగులోకి వచ్చారు. ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్, గణేష్ మాస్టర్ టాప్ కొరియోగ్రాఫర్స్ గా ఉన్నారు. ఈ స్టార్ కొరియోగ్రాఫర్స్ ఢీ షో కి జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు.

    ఢీ వలె జబర్దస్త్ షో బుల్లితెరపై ఎన్నో సంచలనాలు సృష్టించింది. జబర్దస్త్ వేదికగా అనేక మంది సామాన్యులు స్టార్స్ అయ్యారు. ముఖ్యంగా యాంకర్స్ అనసూయ, రష్మీ గౌతమ్ ల ఫేట్ మారిపోయింది. తాజాగా జబర్దస్త్, ఢీ షోల ప్రసారంలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఇకపై ఢీ షో రెండు రోజులు వస్తుందట. ఇప్పటికే ఢీ డాన్స్ రియాలిటీ షో 17 సీజన్లు కంప్లీట్ చేసుకుంది. గత సీజన్ సెలెబ్రెటీ స్పెషల్ అంటూ బుల్లితెర సెలెబ్రెటీలను కంటెస్ట్ చేయించారు.

    ఇటీవల ఢీ సీజన్ ముగిసింది. కాగా మరో కొత్త సీజన్ తాజాగా లాంచ్ చేశారు. ఢీ సెలెబ్రెటీ స్పెషల్ 2 రెండో సీజన్ మొదలుపెట్టారు. ఇందుకు సంబంధించిన ప్రోమో కూడా విడుదల అయింది. ఇక ఈ షో కి గెస్ట్ గా హన్సిక వచ్చింది. శేఖర్ మాస్టర్, గణేష్ మాస్టర్ జడ్జెస్ గా ఉన్నారు. ఇప్పటి వరకు ఢీ షో ప్రతి బుధవారం ప్రసారం అవుతుందని తెలిసిందే. కానీ ఇకపై ఢీ షోని బుధవారం తో పాటు గురువారం కూడా ప్రసారం చేస్తారట.

    ఈ క్రమంలో ఎక్స్ట్రా జబర్దస్త్ షోని తీసేస్తున్నారు. ఇక నుంచి రెండు షోలు కాకుండా ఒకే షోగా జబర్దస్త్ ని ప్రసారం చేయబోతున్నట్లు తెలుస్తోంది. మొన్నటి వరకు గురువారం, శుక్రవారం జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ షోలు ప్రసారం అయ్యేవి. ఇప్పుడు భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ఇకపై జబర్దస్త్ పేరిట ప్రతి శుక్రవారం, శనివారం ప్రసారం కానున్నాయి. ఎక్స్ట్రా జబర్దస్త్ మాత్రం ఇకపై ఉండదు. రెండు రోజులు జబర్దస్త్ షోనే ప్రసారం అవుతుంది. కాగా గతంలో ఉన్నంత ఆదరణ ఇప్పుడు జబర్దస్త్ షోకి లేదు. అందుకే మల్లెమాల సంస్థ కీలక మార్పులు చేసింది.