Hari Hara Veeramallu Making Video : ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) విషయం లో మొదటి నుండి అభిమానులకు ఒకటే నిరాశ..అదేమిటంటే ఈ సినిమా ని ఇంత భారీగా 300 కోట్ల రూపాయిలు ఖర్చు చేసి తీశారు, దానికి తగ్గ ప్రమోషన్స్ అసలు చేయడం లేదు, కనీసం మామూలు కమర్షియల్ సినిమాకు చేసినంత ప్రమోషన్ కూడా చేయడం లేదు,మేకర్స్ అలసత్వాన్ని సహించలేకపోతున్నాము అంటూ సోషల్ మీడియా లో అభిమానులు తీవ్రమైన అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే నిర్మాత AM రత్నం ఇక నుండి తన వింటేజ్ యాంగిల్ ని బయటకు తీసుకొస్తానని అంటున్నాడు. రీసెంట్ గానే VFX వర్క్ ని పూర్తి చేసిన మూవీ టీం, త్వరలోనే థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేయనుంది. దీనికి సంబంధించిన అప్డేట్ మరో రెండు రోజుల్లో రానుంది. ఇది కాసేపు పక్కన పెడితే మేకింగ్ వీడియో గురించి ఒక వార్త సోషల్ మీడియా ని ఒక రేంజ్ లో ఊపేస్తోంది.
మేకింగ్ వీడియో అంటే ఏ సినిమాకి అయినా నాలుగు నిమిషాలు ఉంటుంది, లేకపోతే 7 నిమిషాలు ఉంటుంది. కానీ ‘హరి హర వీరమల్లు’ చిత్రానికి ఏకంగా 30 నిమిషాల మేకింగ్ వీడియో ని విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారట మేకర్స్. ఈ 30 నిమిషాల మేకింగ్ వీడియో ఎలా ఉండబోతుందంటే, రాజమౌళి #RRR డాక్యుమెంటరీ ని మీరంతా నెట్ ఫ్లిక్స్ లో చూసే ఉంటారు, ఆ తరహా లో ఉంటుందట. ఈ సినిమాకి పని చేసిన ప్రతీ ఒక్కరు తమ అనుభూతులను పంచుకోవడమే కాకుండా, కొన్ని ఎక్సక్లూసివ్ షాట్స్ ని కూడా పొందుపరుస్తారట. దీనిని ట్రైలర్ విడుదలైన కొద్దిరోజుల తర్వాత విడుదల చేస్తారట. ఇప్పటికే ఒక చిన్న మేకింగ్ వీడియో సోషల్ మీడియా లో లీకై బాగా వైరల్ అయ్యింది. ఆమ్మో సినిమాని ఊహించిన దానికంటే ఎక్కువ తీసినట్టు ఉన్నారే, ఈ రేంజ్ లో సినిమా ఉంటే ఇండస్ట్రీ రికార్డ్స్ మొత్తం బద్దలు అవుతుంది అంటూ చెప్పుకొచ్చారు ఫ్యాన్స్.
రెండు నిమిషాల మేకింగ్ వీడియో కే అంత రియాక్షన్ వస్తే, ఈ 30 నిమిషాల మేకింగ్ వీడియో కి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. అంతే కాదు రీసెంట్ గానే ఇరాన్ నుండి గ్రాఫిక్స్ వర్క్ మొత్తం డెలివరీ అయ్యింది. ఔట్పుట్ మామూలు రేంజ్ లో లేదట. ఇప్పటి వరకు ఇండియన్ సినిమా కనీవినీ ఎరుగని రీతిలో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దినట్టు తెలుస్తుంది. ట్రైలర్ తోనే ఈ విషయం అర్థం అయిపోతుందని అంటున్నారు. ఇక ఈ చిత్రాన్ని ప్రస్తుతానికి అయితే జులై 18 న విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. ట్రైలర్ తో పాటు విడుదల తేదీని కూడా ఒకే రోజున ప్రకటిస్తారా మేకర్స్. అభిమానులు ఈ అప్డేట్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు.